నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆనంద్ దేవరకొండ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. టీజర్ రిలీజ్.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్ లోకి ఆనంద్ దేవరకొండ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ మూవీ టీజర్ మంగళవారం (ఫిబ్రవరి 3) రిలీజైంది. నేరుగా ఓటీటీలోకే వస్తున్న ఈ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే ప్రీమియర్ కానున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.

Published on: Feb 3, 2026, 21:41:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'మిడిల్ క్లాస్ మెలోడీస్' వంటి ఫీల్ గుడ్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, దర్శకుడు వినోద్ అనంతోజు కాంబినేషన్ మళ్లీ వస్తోంది. ఈసారి థియేటర్లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో 'తక్షకుడు' మూవీతో వీళ్లు సందడి చేయనున్నారు. 'లాపతా లేడీస్' ఫేమ్ నితాన్షీ గోయల్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆనంద్ దేవరకొండ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. టీజర్ రిలీజ్.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆనంద్ దేవరకొండ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. టీజర్ రిలీజ్.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

తక్షకుడు టీజర్ రిలీజ్

కరోనా సమయంలో థియేటర్లు మూతపడినా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాతో అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో నేరుగా విడుదలై మన ఇళ్లల్లో నవ్వులు పూయించిన కాంబినేషన్ గుర్తుందా? హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు వినోద్ అనంతోజు. ఫ్యామిలీ డ్రామాతో మ్యాజిక్ చేసిన వీరిద్దరూ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో చేతులు కలిపారు. అదే 'తక్షకుడు'. ఇది ఓ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం.

అయితే 'తక్షకుడు' కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. థియేటర్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. విశేషమేమిటంటే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను ఏకంగా 30 భాషల్లో, పలు దేశాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

అంధుడిగా ఆనంద్.. వెన్నులో వణుకుపుట్టించే టీజర్

మంగళవారం (ఫిబ్రవరి 3) విడుదలైన 'తక్షకుడు' టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో ఆనంద్ దేవరకొండ అంధుడిగా కనిపించడం విశేషం. ఒక గుర్తు తెలియని వ్యక్తి తనను వెంటాడుతుంటే.. సమాధానం లేని ప్రశ్నల కోసం వెతికే యువకుడిగా ఆనంద్ నటన ఆకట్టుకుంటోంది.

విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామా తీసిన దర్శకుడేనా ఈ థ్రిల్లర్ తీసింది అనిపించేలా టీజర్ కట్ ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

టాలీవుడ్‌కి వస్తున్న 'లాపతా లేడీ'

ఇటీవల 'లాపతా లేడీస్' సినిమాతో దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ నటి నితాన్షీ గోయల్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఆమె రాకతో సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి నెలకొంది.

స్ట్రీమింగ్ తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ టీజర్ చూస్తుంటే మాత్రం ఈసారి ఈ కాంబో ఓ రేంజ్‌లో భయపెట్టి, మెప్పించేలా ఉంది. గుంటూరు, నెల్లూరు యాసలతో మనసు గెలుచుకున్న ఆనంద్.. ఈసారి థ్రిల్లర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

గతంలోనే ఈ తక్షకుడు గురించి ప్రొడ్యూసర్ నాగవంశీ స్పందించాడు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 30 భాషల్లో వివిధ దేశాల్లో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందని, ఎక్కువ మంది ఆడియెన్స్ కు చేర్చేందుకు ఇలా చేశామని చెప్పాడు. కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసం ఉంటే.. మరికొన్ని ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరేందుకు ఓటీటీ బెస్ట్ అని అభిప్రాయపడ్డాడు. తక్షకుడు మూవీని 30 భాషల్లో రిలీజ్ చేస్తున్నారంటే.. అందులో అంతలా ఏముంది? అసలు ఆ సినిమా స్టోరీ ఏంటన్నదానిపై చర్చ మొదలైంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More