య‌ష్ టాక్సిక్ మూవీకి షాక్‌-టీజర్ తొలగించాలి-అశ్లీల సీన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న మ‌హిళా క‌మిష‌న్‌-సెన్సార్ కు లేఖ

యశ్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ టాక్సిక్ కు బిగ్ షాక్. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన బోల్డ్ టీజర్ హట్ టాపిక్ గా మారింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ సెన్సార్ బోర్డుకు లెటర్ రాసింది. తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

Published on: Jan 13, 2026, 08:55:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాక్సిక్ మూవీ నుంచి రాయగా హీరో యష్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఇటీవల రిలీజైన టీజర్ కలకలం రేపుతోంది. ఇందులో ఇంటిమేట్ సీన్ మరీ బోల్డ్ గా ఉండటమే ఇందుకు కారణం. ఈ టీజర్ పై విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా టీజర్ పై చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు కర్ణాటక మహిళా కమిషన్ లెటర్ రాసింది. దీంతో యష్ టాక్సిక్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది.

టాక్సిక్ టీజర్ లో యష్
టాక్సిక్ టీజర్ లో యష్

టాక్సిక్ టీజర్

యష్ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమా టీజర్ వివాదాస్పదంగా మారింది. ఈ టీజర్‌లో కారులో ఒక మహిళతో యష్ శృంగారం చేస్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చి కొంతమందిని కాల్చి చంపుతాడు. ఈ సన్నివేశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఈ టీజర్ వివాదాల్లో చిక్కుకుంది. సోమవారం (జనవరి 12) నాడు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ (KSWC)కు ఫిర్యాదు చేసింది.

టీజర్ లో అశ్లీలం

పీటీఐ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం నాయకులు రాష్ట్ర మహిళా కమిషన్ అధికారులను కలిసి ఈ విషయమై ఫిర్యాదు సమర్పించారు. అశ్లీల సీన్లు ఉన్న టాక్సిక్ టీజర్‌ను తొలగించాలని వారు కోరుతున్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి "తగిన చర్యలు" తీసుకోవాలని కోరుతూ లేఖ రాసింది.

మహిళలను కించపరిచేలా

"ఈ సినిమా టీజర్‌లోని అభ్యంతరకరమైన, స్పష్టమైన కంటెంట్ మహిళలు, పిల్లల సామాజిక శ్రేయస్సుకి తీవ్ర హాని కలిగిస్తోంది. వయస్సు సంబంధిత హెచ్చరిక లేకుండా బహిరంగంగా విడుదలైన ఈ సన్నివేశాలు మహిళల గౌరవాన్ని కించపరుస్తున్నాయి. కన్నడ సంస్కృతిని అవమానిస్తున్నాయి" అని ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ లేఖలో పేర్కొన్నారు.

"సమాజంపై ముఖ్యంగా మైనర్‌లపై ప్రతికూల ప్రభావం" చూపుతుందని పేర్కొంటూ, ఈ టీజర్‌ను నిషేధించాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించాలని పార్టీ కోరింది.

యాక్షన్ తీసుకోవాలని

"ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం తరపున ఈ విషయాన్ని మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించి, రాష్ట్ర సాంస్కృతికచ నైతిక విలువలను "పరిరక్షించడానికి" తక్షణ చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము" అని లేఖలో జోడించారు. "మీరు సమర్పించిన పిటిషన్‌లోని అంశంపై నియమాల ప్రకారం పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని కోరాం" అని కమిషన్ కార్యదర్మి ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ సమర్పించిన పిటిషన్‌ను ఉటంకిస్తూ సెన్సార్ బోర్డుకు రాసిన లేఖలో తెలిపారు.

'టాక్సిక్' గురించి

'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' టీజర్‌ను జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్-ప్యాక్డ్ టీజర్ కారులో ఒక మహిళతో యష్ సెక్స్ చేయడంతో టీజర్ ప్రారంభమై, ఆ తర్వాత కొంతమందిని కాల్చి చంపడంతో కొనసాగుతుంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' లో రుక్మిణి వసంత్, నయనతార, కియారా అడ్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More