గ్యాంగ్‌స్టర్ కాదు మాన్‌స్టర్-టాక్సిక్ నుంచి యశ్ వీడియో లీక్-షర్ట్ లేకుండా సిగరెట్ తాగుతూ-ఫ్యాన్స్ థ్రిల్
కేజీఎఫ్ తో వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కన్నడ సూపర్ స్టార్ యశ్. ఇప్పుడు అతను టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ నుంచి యశ్ లుక్ లీక్ అయింది. షర్ట్ లేకుండా సిగరెట్ తాగుతున్న అతని వీడియో వైరల్ గా మారింది.
కన్నడ స్టార్ యశ్ ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అనే ప్రాజెక్ట్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం ఆయన షర్ట్ లేకుండా సిగరెట్ తాగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇది చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

టాక్సిక్ వీడియో లీక్
యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సెట్స్ నుంచి ఓ వీడియో లీక్ అయింది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో యశ్ ఒక బాల్కనీలో నిలబడి కనిపించారు. షర్ట్ లేకుండా కేవలం జీన్స్ ధరించి, సిగరెట్ తాగుతున్న దృశ్యం అందులో ఉంది. ఈ వీడియోను ఓ అభిమాని దూరం నుంచి చిత్రీకరించారు. టేక్ సమయంలో నటుడిపై జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేశారు. కింద భాగంలో పాక్షికంగా కనిపిస్తున్న ఓ సైన్‌బోర్డ్‌పై శామ్యూల్ అనే పేరు ఉంది. బాల్కనీ కింద షాట్‌లో లేనట్లుగా నిలబడి ఉన్న కొంతమంది సిబ్బంది నవ్వుతూ కనిపించారు.
స్వాగ్ చూడండి
అనధికారికంగా బయటకు వచ్చినప్పటికీ 'టాక్సిక్' సినిమాకు సంబంధించిన ఈ చిన్న గ్లింప్స్ చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. ఒక అభిమాని ఏమో “ఆ స్వాగ్ చూడండి” అని కామెంట్ చేశారు. మరొకరు “ఓ మై గాడ్. టాక్సిక్ లీక్ వీడియో. యశ్ చాలా బాగున్నాడు” అని రాశాడు. కొంతమంది సినిమా టీజర్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ.. “యాక్షన్ టీజర్ కోసం వేచి ఉండలేకపోతున్నాం”, “టాక్సిక్ టీజర్ డే & రిలీజ్ డే వైబ్స్‌ను ఊహించుకోండి” వంటి కామెంట్లు పెట్టారు. ఉత్సాహంతో ఓ అభిమాని “కేవలం లీకైన వీడియోనే సోషల్ మీడియా మొత్తాన్ని ఏలేస్తోంది” అని రాశారు.
టాక్సిక్ గురించి..
సెప్టెంబర్ 19న 'టాక్సిక్' అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) పేజీలో ముంబై తర్వాత బెంగళూరులో షూటింగ్ జరుపుతామని చిత్ర బృందం పేర్కొంది. “ముంబై (టిక్ ఎమోజి) బెంగళూరు (త్వరలో ఎమోజి). టాక్సిక్ బృందం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ ఆధ్వర్యంలో ముంబైలో 45 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. చివరి షెడ్యూల్ సెప్టెంబర్ చివరిలో బెంగళూరులో ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 19, 2026న మూవీ విడుదల కానుంది” అని పోస్టు చేసింది.
'టాక్సిక్' ఒక గ్యాంగ్‌స్టర్ చిత్రం. ఇందులో యశ్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ తదితరులు నటిస్తున్నారు. దీనిని వెంకట్ కె నారాయణ, యశ్ తమ కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


