Prabhas: ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. మిర్చి డైలాగ్‌తో ప్ర‌భాస్‌.. థ్యాంక్స్ చెప్పిన శ‌ర్వానంద్‌

Prabhas: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. ఇదీ మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్. శర్వానంద్ కోసం ఈ డైలాగ్ నే కాస్త మార్చి ‘ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అంటూ ప్రభాస్ చేసిన సందడి వైరల్ గా మారింది. ఆ వీడియో ఇక్కడ చూసేయండి. 

Published on: Apr 1, 2026, 05:51:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

‘ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అని అంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ‘లెట్స్ రేస్’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది అతని మూవీ షూటింగ్ కాదు, కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కూడా కాదు. శర్వానంద్ బైకర్ మూవీకి సపోర్ట్ గా ప్రభాస్ ఇలా చేశాడు.

ప్రభాస్ (x/sharwanand)
ప్రభాస్ (x/sharwanand)

లెట్స్ రేస్

మిర్చి సినిమాలో స్టైలిష్ గా హార్లీ డేవిడ్సన్ బైక్ మీద ప్రభాస్ వెళ్తుండటం చూశాం. ఇప్పుడు మరోసారి అదే స్టైల్, స్వాగ్ తో డార్లింగ్ అదరగొట్టాడు. ‘‘శర్వా మా ఇంటి హీరో. ప్రమోద్, వంశీ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్’’ అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ప్రభాస్ చెప్పిన మాటలు ప్లే అవుతుండగా వీడియోలో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. వచ్చి బైక్ పై కవర్ లాగేసిన ప్రభాస్.. ‘‘ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్, లెట్స్ రేస్’’ అని డైలాగ్ చెప్పాడు.

శర్వా థ్యాంక్స్

బైకర్ మూవీని ప్రమోట్ చేస్తున్న ప్రభాస్ కు హీరో శర్వానంద్ థ్యాంక్స్ చెప్పాడు. రీసెంట్ గా బైకర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ వైబ్ బాగుందని ఇప్పటికే ప్రభాస్ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు పెట్టాడు. ఇప్పుడేమో ఏకంగా వీడియో చేశాడు.

‘‘థ్యాంక్ యూ ప్రభాస్ అన్న. లవ్ యూ. మీరెప్పుడూ నా కోసం నిలబడ్డారు. మన బంధం పట్ల చాలా సంతోషంగా ఉంది. అవును.. ట్రైలర్ చూసి కొన్ని నమ్మేయాలి. ఇండియా ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ ను డాల్బీ సినిమా, ఎపిక్, 4డీఎక్స్, పీసీఎక్స్ లో ఎక్స్ పీరియన్స్ చేయండి. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ్, మలయాళంలో బైకర్ గ్రాండ్ రిలీజ్ కానుంది’’ అని ప్రభాస్ వీడియోను శర్వా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

బైకర్ గురించి

నారీ నారీ నడుమ మురారి లాంటి సూపర్ హిట్ తర్వాత శర్వానంద్ నుంచి వస్తున్న మరో మూవీ ‘బైకర్’. ఇది ఇండియాలో ఫస్ట్ మోటో క్రాస్ సినిమాగా థియేటర్లకు రాబోతుంది. ఇందులో బైక్ రేసింగ్ తో పాటు తండ్రీకొడుకుల బాండింగ్ చుట్టూ కథ సాగనుంది.

సినిమాలో హీరో తండ్రి, మెంటార్ గా సీనియర్ హీరో రాజశేఖర్ నటించాడు. బైకర్ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. దీన్ని యూవీ క్రియేషన్స్ పై ప్రమోద్, వంశీ నిర్మించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మాళవిక నాయర్ హీరోయిన్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More