Biker Trailer: రేసింగ్ అంటే ప్రాణం.. గూస్ బంప్స్ తెప్పించేలా శర్వానంద్ బైకర్ ట్రైలర్.. తండ్రి, మెంటార్ గా రాజశేఖర్

Biker Trailer: ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ మూవీగా చెప్పుకొంటున్న ‘బైకర్’ ట్రైలర్ వచ్చేసింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. 

Published on: Mar 22, 2026, 18:13:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి 2026కు ‘నారీ నారీ నడుమ మురారి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు ‘బైకర్’ అంటూ సందడి చేయబోతున్నాడు. సక్సెస్ అందుకున్న జోష్ లో బైకర్ తో థియేటర్లో మరోసారి అదగొట్టేందుకు వచ్చేస్తున్నాడు. ఈ బైకర్ మూవీ ట్రైలర్ ను ఇవాళ (మార్చి 22) రిలీజ్ చేశారు.

బైకర్ ట్రైలర్ రిలీజ్ (x/UV_Creations)
బైకర్ ట్రైలర్ రిలీజ్ (x/UV_Creations)

బైకర్ ట్రైలర్

ఇండియాలోనే ఫస్ట్ మోటో క్రాస్ మూవీ ‘బైకర్’ అని మేకర్స్ చెప్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదివారం రిలీజైన ఈ సినిమా ట్రైలర్ అందుకు తగ్గట్లుగానే ఉంది. రేస్, యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో శర్వానంద్ తండ్రి, మెంటార్ గా సీనియర్ హీరో రాజశేఖర్ నటించాడు.

ఛాంపియన్ రేసర్

ఇంటర్నేషనల్ ట్రాక్ లపై ఇండియన్ రేసర్లు పోటీపడగలరా? అనే ప్రశ్నతో బైకర్ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత శర్వానంద్ ఓ ఛాంపియన్ బైకర్ గా ఎంట్రీ ఇస్తాడు. రేసింగ్ సీక్వెన్స్ భలే థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఆ తర్వాత హీరోకు మెంటార్ గా కన్నతండ్రి రావడం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

తండ్రీ కొడుకుల మధ్య

రేసింగ్ కు ప్రధాన సబ్జెక్ట్ గా తీసుకున్న బైకర్ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం అనే పాయింట్ కూడా టచ్ చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కొడుకును పిరికివాడు అనే తండ్రి, పిరికివాడు అని కొడుకును వదిలేసే తండ్రిని చూడలేదంటూ కొడుకు చెప్పే డైలాగ్ లు ఆసక్తి కలిగిస్తున్నాయి.

వాయిదా పడుతూ

నిజానికి నారీ నారీ నడుమ మురారి కంటే ముందే బైకర్ మూవీ రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ లోపు సంక్రాంతి 2026కు వచ్చిన నారీ నారీ నడుమ మురారి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు బైకర్ రిలీజ్ కాబోతుంది.

బైకర్ రిలీజ్ డేట్

శర్వానంద్ హీరోగా నటించిన అప్ కమింగ్ మూవీ బైకర్ ఏప్రిల్ 3, 2026న థియేటర్లకు రాబోతుంది. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్. సీనియర్ హీరో రాజశేఖర్ తదితరులు నటించారు. ఈ బైకర్ చిత్రానికి అభిలాష్ రెడ్డి డైరెక్టర్.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ‌ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ బైకర్ సినిమాను నిర్మించారు. దీనికి జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. మరి నారీ నారీ నడుమ మురారి మూవీతో వచ్చిన సక్సెస్ ను బైకర్ తోనూ శర్వానంద్ కొనసాగిస్తాడేమో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More