రాజా సాబ్ కాదు డూప్ సాబ్.. ప్రభాస్ మూవీపై మళ్లీ మొదలైన ట్రోలింగ్.. హీరోయిన్‌ను కూడా ఇలా చేస్తారా అంటూ..
ది రాజా సాబ్ ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్నా ట్రోలింగ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా సినిమాలో హీరోయిన్ కు కూడా డూప్ వాడటంపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. డూప్ సాబ్ అంటూ ఓ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు.
ప్రభాస్ నటించిన 'రాజా సాబ్' థియేటర్లలో డిజాస్టర్ అయినా ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అయితే సినిమాలో నటీనటులకు బదులుగా డూప్స్ (బాడీ డబుల్స్) వాడారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. మాళవిక మోహనన్ ఫైట్ సీన్ నుంచి ప్రభాస్ వీఎఫ్ఎక్స్ వరకు జరుగుతున్న రచ్చ వివరాలు ఇక్కడ చూడండి.

ఓటీటీలో నెంబర్ 1.. కానీ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హారర్ కామెడీ మూవీ 'రాజా సాబ్' (The Raja Saab). మారుతి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. కథ, కథనం సరిగా లేకపోవడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. అయితే థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికపై మాత్రం సంచలనం సృష్టిస్తోంది.
ప్రస్తుతం జియో హాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతున్న ‘రాజా సాబ్’.. వ్యూయర్షిప్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన వారు, నెగటివ్ టాక్ వల్ల వెళ్లని వారు ఇప్పుడు ఓటీటీలో చూస్తుండటంతో ఈ సినిమా టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్లాట్‌ఫామ్‌కు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. కానీ సినిమా చూసిన తర్వాత నెటిజన్లు చేస్తున్న ట్రోలింగ్ మాత్రం చిత్రబృందానికి తలనొప్పిగా మారింది.
మాళవిక మోహనన్ 'డూప్' రచ్చ
సినిమాలో హీరోయిన్ మాళవిక మోహనన్ ఎంట్రీ ఒక ఫైట్ సీన్‌తో ఉంటుంది. అయితే ఆ సీన్‌లో మాళవిక నటించలేదని, ఆమెకు బదులుగా ఒక డూప్ ను వాడారని నెటిజన్లు కనిపెట్టారు. ఇందుకు సంబంధించిన 'బిహైండ్ ది సీన్స్' వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేవలం యాక్షన్ సీన్లకే కాకుండా సాధారణ సన్నివేశాలకు కూడా డూప్స్ వాడటంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రభాస్ ముఖం గ్రాఫిక్సేనా?
అంతేకాదు ప్రభాస్ విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. కొన్ని సీన్లలో ప్రభాస్ అసలు లేడని, వేరే వ్యక్తి బాడీకి ప్రభాస్ ముఖాన్ని వీఎఫ్ఎక్స్ (VFX) ద్వారా అతికించారని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలో ఇలాంటి నాసిరకం పనులు చేయడం ఏంటని దర్శకుడు మారుతిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, బడ్జెట్ విషయంలో స్కామ్ జరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
విమర్శలు ఎలా ఉన్నా రాజా సాబ్ ఓటీటీలో మాత్రం సందడి చేస్తోంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోయే 'ఫౌజీ' (Fauzi) సినిమాపై పూర్తి దృష్టి సారించాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


