Sharwanand: బంపర్ బ్లాక్ బస్టర్ కొడుతున్నా.. ఇండియా మొత్తం మాట్లాడుకునే సినిమా చేశాం.. శర్వానంద్ వైరల్ కామెంట్లు
Sharwanand: బైకర్ సినిమాతో మరోసారి థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు హీరో శర్వానంద్ వచ్చేస్తున్నాడు. ఇవాళ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
ఇండియాలోనే ఫస్ట్ మోటో క్రాస్ మూవీ అంటూ ‘బైకర్’ థియేటర్లలోకి రాబోతుంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ ఇవాళ (మార్చి 22) రిలీజైంది. మోటర్ బైక్ రేసింగ్ నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఆదివారం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా హీరో శర్వానంద్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

శర్వానంద్ కామెంట్లు
బైకర్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో శర్వానంద్ స్పీచ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ ట్రెండ్ అవుతోంది. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్ అన్న చెప్పినట్లు సీనియర్ల తర్వాతే మేం. ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు రాజశేఖర్ కు థ్యాంక్స్’’ అని శర్వానంద్ అన్నాడు.
బ్లాక్ బస్టర్
‘‘రాజన్న (దిల్ రాజు)కు థ్యాంక్స్. వంశీ భాయ్ కూడా అలాంటి ప్రొడ్యూసరే. అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటారు. ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఆనందించేది మా హీరోలమే. ఇప్పుడు మా టీమ్ గురించి ఏం చెప్పను. మొన్న చెప్పి హిట్ కొట్టా. ఇప్పుడు మళ్లీ చెప్తున్నా. బంపర్ బ్లాక్ బస్టర్ కొడుతున్నా. ఇండియా మొత్తం మాట్లాడుకునేంతా గొప్ప సినిమా తీశాం. ఏప్రిల్ 3న కలుద్దాం. అప్పుడు దాని గురించి మాట్లాడతా’’ అని శర్వానంద్ చెప్పాడు.
నారీ నారీ నడుమ మురారి
సంక్రాంతి 2026కు నారీ నారీ నడుమ మురారి సినిమాతో శర్వానంద్ హిట్ కొట్టాడు. ఆ మూవీ రిలీజ్ కు ముందు ఓ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘‘ఈ సారి హిట్ కొడుతున్నా’’ అని కామెంట్లు చేశాడు. ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు బైకర్ రిలీజ్ కంటే ముందు శర్వానంద్ మరోసారి అలాంటి కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
బైకర్ ట్రైలర్
శర్వానంద్ హీరోగా నటించిన అప్ కమింగ్ మూవీ ‘బైకర్’. ఈ మోటో క్రాస్ మూవీ ఏప్రిల్ 3, 2026న రిలీజ్ కానుంది. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి డైరెక్టర్. యూవీ క్రియేషన్స్ ఈ బైకర్ మూవీని నిర్మించింది. ఆదివారం రిలీజైన ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది. రేసింగ్, యాక్షన్ సీన్లు వేరే లెవల్ లో ఉన్నాయి. ఈ ట్రైలర్ తో బైకర్ మూవీపై హైప్ మరింత పెరిగిపోయింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


