Dacoit OTT: లవర్‌పై హీరో ప్రతికారం- డెకాయిట్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్- మారిన ప్లాట్‌ఫామ్- 5 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?
Dacoit OTT Streaming Details: ఓటీటీలోకి డెకాయిట్ స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్లలో తన యాక్షన్ పవర్ చూపించిన అడివి శేష్, మృణాల్ ఠాకూర్ల డెకాయిట్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ మారిపోయింది. మరి డెకాయిట్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు అనే వివరాలపై ఇక్కడ తెలుసుకుందాం.
Dacoit OTT Release Details: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బ్యూటిపుల్ మృణాల్ ఠాకూర్ జోడీగా నటించిన లేటెస్ట్ మూవీ 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ'. ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. మొదటి రోజే సుమారు 6.55 కోట్ల రూపాయల ఓపెనింగ్స్‌తో అడివి శేష్ తన మార్కెట్ స్టామినాను నిరూపించుకున్నారు.

డెకాయిట్ కలెక్షన్స్
శని, ఆదివారాల్లో కూడా నిలకడగా రాణించడంతో మొదటి వారం ముగిసేసరికి డెకాయిట్ సినిమా 28.45 కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంది. రెండో వారంలో 'ధురంధర్ 2', 'భూత్ బంగ్లా' వంటి పెద్ద సినిమాల నుంచి పోటీ ఎదురైనప్పటికీ, నిలకడగా ఆడి ప్రపంచవ్యాప్తంగా 55.23 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇందులో కేవలం ఇండియా నుంచే 41.65 కోట్ల రూపాయలు రావడం విశేషం.
ప్రేమ.. ప్రతీకారం.. 'డెకాయిట్' కథాంశం
దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన డెకాయిట్ సినిమా పక్కా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. తప్పు చేయకపోయినా జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి, బయటకు వచ్చాక తన మాజీ ప్రేమికురాలిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే అంశాన్ని దర్శకుడు ఉత్కంఠభరితంగా చూపించారు.
తెలుగు, హిందీలో
ఇందులో అడివి శేష్ తన మార్కు నటనతో ఆకట్టుకోగా, మృణాల్ ఠాకూర్ గ్లామర్, పర్ఫామెన్స్‌తో మెప్పించింది. అనురాగ్ కశ్యప్, అతుల్ కుల్‌కర్ణి, ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించడం వల్ల ఈ సినిమాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.
ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
తాజా సమాచారం, ప్రకారం డెకాయిట్ ఓటీటీలోకి త్వరలో ప్రీమియర్ అవనుంది. మే 8 నుంచి డెకాయిట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని టాక్ నడుస్తోంది. అంటే థియేటర్లలో విడుదలైన సరిగ్గా నాలుగు వారాలకే ఈ సినిమా డిజిటల్ రంగప్రవేశం చేస్తోంది. తొలుత డెకాయిట్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని వార్తలు వచ్చాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి
కానీ, తాజా నివేదికల ప్రకారం డెకాయిట్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అంటే, నెట్‌ఫ్లిక్స్‌లోనే డెకాయిట్ ఓటీటీ రిలీజ్ అవనుందన్నమాట. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో కూడా డెకాయిట్ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.
మారిన ఓటీటీ ప్లాట్‌ఫామ్
అయితే, డెకాయిట్ ఓటీటీ రిలీజ్‌పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, లవర్‌పై హీరో ప్రతికారం తీర్చుకునే కథతో తెరకెక్కిన డెకాయిట్ మూవీ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ మార్చుకుని నెట్‌ఫ్లిక్స్‌లో మే 8 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


