Memu COPlam OTT: గెటప్ శ్రీను, నాగబాబు వెబ్ సిరీస్ వివాదం- అసలు టైటిల్ వేరే- మేము COPలం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Naga Babu Getup Srinu Memu COPlam OTT Streaming: ఇటీవల గెటప్ శ్రీను, జర్నలిస్ట్ జాఫర్ మధ్య ఓటీటీ సిరీస్ మేము కాపులం అనే టైటిల్ వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే, దాని టైటిల్ వేరే అంటూ మేము COPలం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను తాజాగా ప్రకటించారు. మరి మేము COPలం ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.
Naga Babu Getup Srinu Memu COPlam OTT Release Platform: ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్, టైటిల్స్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. అయితే, ఇటీవల నాగబాబు, గెటప్ శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న తెలుగు ఓటీటీ సిరీస్ మేము కాపులం టైటిల్ వివాదం అయిన విషయం తెలిసిందే.

జాఫర్‌తో గెటప్ శ్రీను గొడవ
జర్నలిస్ట్ జాఫర్‌తో గెటప్ శ్రీను చేసిన ఇంటర్వ్యూలో మేము కాపులం అనే టైటిల్ రచ్చ మొదలైంది. ఆ టైటిల్‌ను జాఫర్ తప్పుబట్టడం, గెటప్ శ్రీను కోపంతో వెళ్లిపోవడం జరిగింది. ఇదంతా నిజమా, లేక పబ్లిసిటీ స్టంటా అని చాలా అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అసలు టైటిల్ వేరే ఉందని తాజాగా రివీల్ చేశారు మేకర్స్.
అయితే, అది ఓ కులానికి సంబంధించిన మేము కాపులం కాదు పోలీసుల నేపథ్యంతో తెరకెక్కే ‘‘మేము COPలం’’ ఓటీటీ సిరీస్ అని వెల్లడించారు మేకర్స్. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగానే మేము కాప్‌లం ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వివరాలను కూడా వెల్లడించారు.
జీ5 ఓటీటీలో
జీ5 ఓటీటీలో మేము COPలం ఓటీటీ రిలీజ్ కానుంది. వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న టాప్‌లో ఒకటైన ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఇప్పుడు ఈ కొత్త సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. కామెడీ, మిస్టరీ కలయికగా రూపొందిన ఈ ఓటీటీ సిరీస్ అందరినీ మెప్పించే కథాంశంతో రూపొందుతోందట.
గ్రామీణ నేపథ్యంలో, అక్కడి రోజువారీ జీవితం, స్థానిక రాజకీయాలు, ఊహించని గందరగోళం.. ఇలా అన్నీ కలగలిపిన ఆసక్తికరమైన కథతో ఈ ఓటీటీ సిరీస్ తెరకెక్కుతోంది. కామెడీ, మిస్టరీ, రూరల్ డ్రామాగా మేము కాప్‌లం ఓటీటీ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
వికటకవి డైరెక్టర్ దర్శకత్వం
రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బీవీఎస్ రవి, కౌముది కె నేమాని నిర్మాతలుగా ప్రదీప్ మద్దాలి క్రియేటివ్‌తో కలిసి ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ తెలుగు సిరీస్‌కు ‘వికటకవి’ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌కి శోభన్ చిట్టుప్రోలు కథను అందించారు.
ఈ వెబ్ సిరీస్‌లో నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రలో కనిపించగా.. గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల కీలక పాత్రలు చేస్తున్నారు. తమ నటన, కామెడీ టైమింగ్‌తో వీరు ప్రేక్షకులను మెప్పించనున్నారు. గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో జరిగే కథ ఇది.
చిన్న ఘటనతో మారిపోయే వాతావరణం
అక్కడ ఒక విచిత్రమైన ఘటన జరగడంతో గ్రామంలో గందరగోళం ఏర్పడుతుంది. ఆ కేసును విచారించడానికి ఇద్దరు పోలీసుల ద్వయం రంగంలోకి దిగుతారు. వారికి ఇదే ఫస్ట్ బిగ్ కేస్ అవుతుంది. ఆ ఇద్దరూ ఎంతో కాన్ఫిడెంట్‌గానే ఉంటారు కానీ కాస్త టెన్షన్‌గా ఫీల్ అవుతుంటారు. అక్కడ వారికి దొరికే క్లూస్, ఆ తరువాత జరిగే పరిణామాలు అన్నీ కూడా వినోదాత్మకంగా మారుతాయి.
మేము COPలం ఓటీటీ రిలీజ్ డేట్
ప్రతీ ఒక్కరిపై అనుమానం రావడంతో అంతా గందరగోళంగా మారుతుంది. చిన్న ఘటనతో అక్కడి వాతావరణం అంతా మారిపోతుంది. అవేంటనేవి తెలుసుకోవాలంటే మాత్రం ఓటీటీ సిరీస్ చూడాల్సిందే అని మేకర్స్ అంటున్నారు. జీ5లో స్ట్రీమింగ్ కానున్న మేము COPలం ఓటీటీ రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


