OTT Telugu: ఓటీటీలోకి వచ్చేస్తున్న సంక్రాంతి బ్లాక్ బస్టర్.. 100 కోట్ల మూవీ.. అనగనగా ఒక రాజు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సంక్రాంతి 2026కు థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ అనగనగా ఒక రాజు. ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రానుండి. రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. 

Published on: Feb 6, 2026, 13:51:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 సంక్రాంతి రేసులో నిలిచి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది.

అనగనగా ఒక రాజు సినిమా పోస్టర్ లో నవీన్ పొలిశెట్టి (x/Netflix_INSouth)
అనగనగా ఒక రాజు సినిమా పోస్టర్ లో నవీన్ పొలిశెట్టి (x/Netflix_INSouth)

అనగనగా ఒక రాజు ఓటీటీ

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సినిమా అనగనగా ఒక రాజు. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 11 నుంచి అనగనగా ఒక రాజు సినిమా స్ట్రీమింగ్ కానుంది.

100 కోట్లు

అనగనగా ఒక రాజు సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. నవీన్ పొలిశెట్టి కెరీర్ లో రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఇదే. ఇప్పుడు ఓటీటీలోకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రానుంది.

డేట్ కోసం

అనగనగా ఒక రాజు మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తుందన్నది ఎప్పుడో కన్ఫామ్ అయింది. 2025 జనవరిలోనే నెట్‌ఫ్లిక్స్ పండగలో భాగంగా అనగనగా ఒక రాజు సినిమా ఇదే ఓటీటీలోకి వస్తుందని ప్రకటించారు. కానీ మూవీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగింది. ఎట్టకేలకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 11న డిజిటల్ డెబ్యూ చేయనుంది.

అనగనగా ఒక రాజు సినిమాకు మారి డైరెక్టర్. ఇందులో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, గోపరాజు రమణ, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

అనగనగా ఒక రాజు స్టోరీ

గౌరవపురం జమీందారు పేరు గోపరాజు. ఆయన మనవడు రాజు (నవీన్ పొలిశెట్టి). ఊరితో తాతకు పెద్ద పేరు ఉంటుంది. కానీ ఆస్తులే ఉండవు. అప్పట్లో ఆడవాళ్ల కోసం ఉన్న ఆస్తినంతా హారతి కర్పూరం చేసేస్తాడు గోపరాజు. ఈ నేపథ్యంలో ఉన్న పేరును ఉపయోగించుకుని డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందామనుకుంటాడు రాజు.

అప్పుడే పెద్దిపాలెం భూపతి రాజు (రావు రమేష్) కూతురు చారు (మీనాక్షి చౌదరి)ను చూస్తాడు. ఆమెకు కోట్ల ఆస్తి ఉందని తెలుసుకుంటాడు. ఎలాగైనా చారును పడేయాలని ‘ఆపరేషన్ చారు’ స్టార్ట్ చేస్తాడు. దాని కోసం ఎన్నో తంటాలు పడతాడు. చివరకు చారుతో పెళ్లి జరుగుతుంది. కానీ ఫస్ట్ నైట్ రోజు రాజుకు ఓ లెటర్ వస్తుంది. దీంతో కథ మలుపు తిరుగుతుంది.

అసలు ఆ లెటర్ ఎవరు రాశారు? అందులో ఏముంది? పెద్దిపాలెం ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎర్రిబాబు (తారక్ పొన్నప్ప)కు పోటీగా రాజు ఎందుకు నిలబడ్డాడు? అన్నది అనగనగా ఒక రాజు సినిమాలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More