Netflix OTT: నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ బోల్డ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కూడా వచ్చేస్తోంది.. ఈసారి ఆ బోల్డ్ నటి రీఎంట్రీ

నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో సంచలనం సృష్టించిన 'లస్ట్ స్టోరీస్' ఫ్రాంచైజీ నుంచి మూడో సీజన్ రాబోతోంది. మూడు సీజన్లు పూర్తి చేసుకుంటున్న తొలి ఇండియన్ ఆంథాలజీగా ఇది రికార్డు సృష్టించనుంది. రాధికా ఆప్టే, కొంకణా సెన్ శర్మ, అదితి రావు హైదరీ వంటి స్టార్లు ఈ సీజన్ తో రాబోతున్నారు.

Published on: Feb 3, 2026, 17:07:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియన్ ఓటీటీ చరిత్రలో 'లస్ట్ స్టోరీస్' (Lust Stories) వెబ్ సిరీస్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆడవాళ్ల సెక్సువల్ కోరికలు, సంబంధాలలోని సంక్లిష్టతలను అత్యంత బోల్డ్ గా, నిజాయితీగా ఆవిష్కరించిన ఆంథాలజీగా దీనికి మంచి పేరుంది. 2018లో వచ్చిన మొదటి సీజన్, 2023లో వచ్చిన రెండో సీజన్ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ హిట్ ఫ్రాంచైజీ మూడో సీజన్‌తో రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో మూడు సీజన్లు పూర్తి చేసుకుంటున్న మొట్టమొదటి ఆంథాలజీగా ఇది నిలవనుంది.

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ బోల్డ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కూడా వచ్చేస్తోంది.. ఈసారి ఆ బోల్డ్ నటి రీఎంట్రీ
Netflix OTT: నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ బోల్డ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కూడా వచ్చేస్తోంది.. ఈసారి ఆ బోల్డ్ నటి రీఎంట్రీ

సీజన్ 3లో నటీనటులు, దర్శకులు వీరే..

నెట్‌ఫ్లిక్స్ లో సూపర్ హిట్ అయిన లస్ట్ స్టోరీస్ ఫ్రాంఛైజీ తెలుసు కదా. రెండో సీజన్ లో తమన్నా కూడా చాలా బోల్డ్ గా నటించింది. ఇప్పుడీ ఆంథాలజీ మూడో సీజన్ రానుంది. ఈసారి కూడా బాలీవుడ్ ప్రముఖ దర్శకులు, నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’ వస్తోంది. నాలుగు వేర్వేరు కథలతో ఈ ఆంథాలజీని రూపొందించారు.

విక్రమాదిత్య మోత్వానీ ఓ ఎపిసోడ్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో విలక్షణ నటి రాధికా ఆప్టే (ఈమె మొదటి సీజన్‌లోనూ నటించింది), కొంకణా సేన్ శర్మ (రెండో సీజన్‌ లో డైరెక్టర్ గా చేసింది) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక 'కపూర్ అండ్ సన్స్', 'గెహ్రాయియాన్' వంటి సినిమాల దర్శకుడు షకున్ బత్రా తెరకెక్కిస్తున్న కథలో అలీ ఫజల్, రాధికా మదన్ జంటగా కనిపించనున్నారు.

ఆమిర్ ఖాన్ మాజీ భార్య, 'లాపతా లేడీస్'తో ఆకట్టుకున్న కిరణ్ రావ్ దర్శకత్వంలో గుర్‌ఫతే పిర్జాదా, కొత్త నటి సనా థంపి నటిస్తున్నారు.

ఇక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న కథలో అందాల తార అదితి రావు హైదరీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె లస్ట్ స్టోరీస్ లాంటి బోల్డ్ సిరీస్ లో నటిస్తుండటం విశేషం.

షూటింగ్ పూర్తి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తాజా సమాచారం ప్రకారం ఈ నాలుగు కథల షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది మధ్యలో ఈ వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రోనీ స్క్రూవాలా, ఆషి దువా ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

'లస్ట్ స్టోరీస్' ప్రత్యేకత ఇదే..

భారతీయ సమాజంలో స్త్రీల లైంగిక కోరికలను, దాంపత్య సమస్యలను, వివాహేతర సంబంధాలను చర్చించడం చాలా అరుదు. ఆ గీతను చెరిపేస్తూ 2018లో వచ్చిన లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ (కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో) పెద్ద చర్చకే దారితీసింది.

ఆ తర్వాత 2023లో తమన్నా, విజయ్ వర్మ, కాజోల్ వంటి స్టార్లతో వచ్చిన రెండో సీజన్ కూడా మిశ్రమ స్పందనతో పాటు భారీ వ్యూయర్‌షిప్ దక్కించుకుంది. ఇప్పుడు మూడో సీజన్ ఇంకెంత బోల్డ్‌గా, వైవిధ్యంగా ఉండబోతోందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More