ఓ సౌత్ సినిమా కోసం సైజ్‌లు పెంచేందుకు ప్యాడింగ్ చేసుకోమన్నారు: రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది. తన లేటెస్ట్ మూవీ సాలీ మొహబ్బత్ నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రాధికా ఈ కామెంట్లు చేసింది.
హిందీలో వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా మారిపోయింది హీరోయిన్ రాధికా ఆప్టే. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ యాక్టింగ్ తో తీరిక లేకుండా గడిపేస్తోంది. ఆమె హీరోయిన్ గా నటించిన సాలీ మొహబ్బత్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. జీ5 ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా రాధికా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

సైజ్ కోసం
రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది. సాలీ మొహబ్బత్ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆమె సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ సైజ్ లు పెంచేందుకు ప్యాడింగ్ చేసుకోమన్నారని చెప్పింది. చాలా పెద్దగా కనిపించేలా చేయాలని చెప్పారని, అది తనకు ఇబ్బందిగా అనిపించిందని రాధికా ఆప్టే పేర్కొంది.
సౌత్ సినిమాలో
ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే మాట్లాడుతూ.. ‘‘సౌత్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీ నుంచి అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. సౌత్ లో కొన్ని సినిమాలు చేశా. ఓ సినిమా షూటింగ్ సమయంలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నా. ఆ మూవీ షూటింగ్ లో నేనొక్కదన్నే అమ్మాయిని ఉన్నా. నా పిరుదులు, బ్రెస్ట్ పెద్దగా కనిపించేందుకు ప్యాడింగ్ చేయాలని చెప్పారు. అమ్మా.. ఇంకా ప్యాడింగ్ అని అన్నారు’’ అని రాధికా చెప్పింది.
ఎంత చేస్తారు?
‘‘అప్పుడు నేను అసిస్టెంట్ ను పిలిచి మీ అమ్మ, చెల్లికి ఎంత ఉంటుంది. ఎంత ప్యాడింగ్ పెడతారు? ఎంత పెద్దగా కనిపించాలి? ప్యాడింగ్ చేసుకోనని డైరెక్టర్ కు చెప్పండని చెప్పా. అప్పుడు నాకు మేనేజర్ లేడు, ఏజెంట్ లేడు. ఒక్కదాన్నే అమ్మాయిని’’ అని రాధికా ఆప్టే తాను ఇబ్బంది పడ్డ ఘటన గురించి చెప్పుకొచ్చింది.
రాధికా సినిమాలు
తమిళనాడులో పుట్టిన రాధికా ఆప్టే ఇప్పుడు హిందీలో బిజీ అయిపోయింది. సౌత్ (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ)లో ఆమె రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, ధోని, ఆల్ ఇన్ ఆల్ అజగు రాజా, లెజెండ్, వెట్రి సెల్వన్, హారం, లయన్, కబాలి, చిత్రం పేసుతడి 2, మెర్రీ క్రిస్మస్ సినిమాలు చేసింది. ఇందులో రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, ధోని, లెజెండ్, లయన్ సినిమాలు తెలుగులో వచ్చాయి.
బరువు తగ్గాలని
మరోవైపు రాధికా ఆప్టే తన శరీర రూపం, బరువులో హెచ్చుతగ్గులు, పరిశ్రమ ఒత్తిళ్ల గురించి కూడా బహిరంగంగా మాట్లాడింది. ఇటీవల ఇండియా టుడేతో మాట్లాడుతూ.. "కొన్నిసార్లు బరువు హెచ్చుతగ్గులు, వాపులు, ఇది, అది నన్ను నిజంగా బాధిస్తాయి. నేను అబద్ధం చెప్పను. 'ఓహ్, నేను పెరిగిన బరువును తగ్గించుకోవాలి' అని నాకు అనిపిస్తుంది. నేను ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాను" అని రాధికా తెలిపింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


