నాపై కుట్ర చేశారు-మరోసారి శివాజీ సంచలన వ్యాఖ్యలు-మహిళా కమిషన్ విచారణకు నటుడు-ఫైర్ అయిన నాగబాబు, ప్రకాష్ రాజ్

శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై కుట్ర చేశారన్నాడు. దండోరా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికపై నోరు జారిన శివాజీ అందుకు తగిన పరిణామాలు ఎదుర్కొంటున్నాడు. ఇవాళ మహిళా కమిషన్ విచారణకు హాజరయ్యాడు శివాజీ. మరోవైపు శివాజీపై నాగబాబు, ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. 

Published on: Dec 27, 2025, 16:05:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హీరోయిన్లపై అసభ్య పదజాలంతో సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ అందుకు తగిన పరిణామాలు ఎదుర్కొంటున్నాడు. శనివారం అతను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యాడు. తన సమాధానం చెప్పుకొన్నాడు. ఆ తర్వాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై కుట్ర చేశారన్నాడు. మరోవైపు శివాజీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా నాగబాబు, ప్రకాష్ రాజ్ శివాజీని తప్పుపట్టారు.

శివాజీ (x)
శివాజీ (x)

శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు

దండోరా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హీరోయిన్ల డ్రెస్ గురించి మాట్లాడుతూ ‘సామాన్లు’, ‘దొంగ ము**’ అనే పదాలు వాడాడు. అతని వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై తీవ్రమైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా దీనిపై రియాక్టయింది. శివాజీకి నోటీసులు పంపించింది.

కుట్ర చేశారని

తన వ్యాఖ్యలపై శివాజీ ఇప్పటికే సారీ చెప్పాడు. మరోవైపు నోటీసులు అందుకున్న నేపథ్యంలో ఇవాళ (డిసెంబర్ 27) మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యాడు. భవిష్యత్ లో మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయనని శివాజీ చెప్పినట్లు తెలిసింది. విచారణ తర్వాత బయటకు వచ్చిన శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఇండస్ట్రీలో జరిగిన ఘటన కారణంగానే అలాంటి కామెంట్లు చేశా. అయితే అందులో తప్పుడు పదాలు దొర్లాయి. అది అంగీకరించా. దీనిపై ఇప్పటికే క్షమాపణ చెప్పినట్లు మహిళా కమిషన్ కు తెలియజేశా. ఇండస్ట్రీలో కొంతమందికి నాపై వ్యతిరేకత ఉంది. అందుకే కుట్ర చేశారు’’ అని శివాజీ అన్నాడు.

నాగబాబు ఫైర్

మరోవైపు హీరోయిన్ల డ్రెస్ పై శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. ‘‘నేను శివాజీని టార్గెట్ చేయడం లేదు. ఆడపిల్లలు ఎలా ఉండాలని మాట్లాడేదానిపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. అలా చేయడం రాజ్యాంగం ప్రకారం తప్పు. ఆడవాళ్లు ఇలాంటి డ్రెస్ లు మాత్రమే వేసుకోవాలని చెప్పడానికి మీకేం హక్కు ఉంది’’ అంటూ సీరియస్ అయ్యారు నాగబాబు.

ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి

‘‘ఆడవాళ్లపై ఆ మాటలేంటీ? ఆ అహంకారం ఏంటీ? ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు సంస్కారం ఉండాలి. ఆమె (అనసూయ)ను ఆంటీ అంటున్నారు. అనసూయ లాంటి వాళ్లకు సపోర్ట్ చేస్తా. ఆ భాష ఏంటీ? శివాజీ కానీ, ఎవరైనా కానీ వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి’’ అని ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More