Memu CopLam OTT Trailer: మేము కాప్‌లం ట్రైలర్- సలార్ రాజు కోసం వేట-కామెడీ నుంచి చేతబడి వరకు- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Naga Babu Getup Srinu Memu CopLam OTT Trailer Released: ఓటీటీలోకి వస్తోన్న సరికొత్త కామెడీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ మేము కాప్‌లం. నాగబాబు, గెటప్ శ్రీను, ర‌వితేజ న‌న్నిమాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఓటీటీ సిరీస్ మేము కాప్‌లం ట్రైలర్ ఇవాళ విడుదల అయింది. మేము కాప్‌లం ఓటీటీ రిలీజ్ వివరాలు చూద్దాం.

Published on: May 14, 2026, 13:37:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu Series Memu CopLam Trailer Released: ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్టుతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో వస్తోన్న కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మేము కాప్‌లం. ఈ ఓటీటీ సిరీస్‌లో మెగా బ్రదర్ నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల ప్రధాన పాత్రలు పోషించారు.

మేము కాప్‌లం ట్రైలర్- సలార్ రాజు కోసం వేట-కామెడీ నుంచి చేతబడి వరకు- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మేము కాప్‌లం ట్రైలర్- సలార్ రాజు కోసం వేట-కామెడీ నుంచి చేతబడి వరకు- ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వికటకవి డైరెక్టర్

వికటకవి ఓటీటీ సిరీస్ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి మేము కాప్‌లంకు దర్శకత్వం వహించారు. రా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై బీవీఎస్ రవి, కౌముది కె నేమాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్‌కి శోభన్ చిట్టుప్రోలు కథను అందించారు. ఇదివరకే టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి పోస్టర్ రిలీజ్ వరకు సిరీస్‌పై క్యూరియాసిటీ కల్పించారు.

కామెడీ నుంచి థ్రిల్లర్ వరకు

తాజాగా ఇవాళ (మే 14) మేము కాప్‌లం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వించేలా మేము కాప్‌లం ట్రైలర్ సాగింది. కామెడీ, డ్రామాతోపాటు చేతబడి వంటి థ్రిల్లర్ వరకు అంశాలతో ఇంట్రెస్ట్ కల్పించేలా సిరీస్‌ను తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

నవ్వు తెప్పించే సీన్స్

సలార్ రాజు అనే పందెం కోడి కోసం ఇద్దరు కానిస్టేబుల్స్ వేట కొనసాగించడం, ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సంఘటనలు, ఇబ్బందుల సముహారమే మేము కాప్‌లం ఓటీటీ సిరీస్. వారసుడొచ్చాడని నాగబాబుతో ఇంటి పనోడు చెబుతాడు. వారసుడొచ్చింది సంక్రాంతి పందెలాకు కోడి పుంజు అని తర్వాత తెలుస్తుంది.

బాహుబలి రాజు వారసుడు సలార్ రాజు

బాహుబలి రాజు వారసుడు సలార్ రాజు అని ఆ పుంజుపిల్లకు నాగబాబు పేరు పెడతాడు. సంక్రాంతి పందెలు ప్రారంభం అయ్యే సమయంలో సలార్ రాజును ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆ కోడిని పట్టుకునేందుకు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను పంపిస్తారు. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రక్రియ, మనుషులతో మాట్లాడే తీరు, వారి విచారణ విధానం నవ్వు తెప్పించేలా ఉంది.

థ్రిల్లర్ జోనర్‌లోకి

ఆ సలార్ రాజును కిడ్నాప్ చేసే అవకాశం ఇద్దరికే ఉందని అనుమానించడం, వారితో కానిస్టేబుల్స్‌ మాట్లాడటం వంటి సీన్స్ పర్వాలేదు. అప్పటివరకు కామెడీతో అలరించిన ట్రైలర్ ఒక్కసారిగా థ్రిల్లర్ జోనర్‌లోకి మారిపోతుంది. ఊరిలో అంతా రక్తం కక్కుకను చావడం, ఒకరి పొలంలో చేతబడి చేయడం వంటి విషయాలు మిస్టీరియస్‌గా అనిపిస్తాయి.

ఇంట్రెస్టింగ్ విషయాలు

తమ పరిజ్ఞానంతో ఊరిలోని మిస్టరీ ఏంటీ?, సలార్ రాజును ఎవరు?, ఎందుకు? కిడ్నాప్ చేశారు. అసలు సలార్ రాజుకు ఏమైంది? అనే విషయాలను కానిస్టేబుల్స్ తెలుసుకున్నారా లేదా అనేదే మేము కాప్‌లం కథ. కాగా ఈ ఓటీటీ సిరీస్‌లో న్యూస్ యాంకర్‌గా బుల్లితెర బ్యూటీ, బిగ్ బాస్ భామ రీతూ చౌదరి కూడా యాక్ట్ చేస్తోంది.

మేము కాప్‌లం ఓటీటీ స్ట్రీమింగ్

ఇలా కామెడీ, థ్రిల్లర్ అంశాలతో సాగే మేము కాప్‌లం ఓటీటీలోకి వచ్చేయనుంది. జీ5 ప్లాట్‌ఫామ్‌లో మేము కాప్‌లం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మే 22న తెలుగులో జీ5లో మేము కాప్‌లం ఓటీటీ రిలీజ్ అవనుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More