Malayalam OTT: అఫీషియల్.. కిల్ ఆర్ డై.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్.. 8.1 రేటింగ్
Malayalam OTT: లేటెస్ట్ మలయాళం బ్లాక్ బస్టర్ డార్క్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో థ్రిల్ అందించేందుకు రెడీ అవుతోంది.
Malayalam OTT: థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మలయాళ సినిమా ‘భరతనాట్యం 2 మోహినియాట్టం’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శన చేసిన ఈ సినిమా డిజిటల్ డెబ్యూ చేయబోతుంది.

భరతనాట్యం 2 మోహినియాట్టం ఓటీటీ
మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ భరతనాట్యం 2 మోహినియాట్టం ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ మే 8 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని నెట్‌ఫ్లిక్స్ ఇవాళ (మే 5) అనౌన్స్ చేసింది.
తెలుగులోనూ
భరతనాట్యం 2 మోహినియాట్టం మూవీ తెలుగులోనూ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ మలయాళం సూపర్ హిట్ మూవీ తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రానుంది. మలయాళం, తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో భరతనాట్యం 2 మోహినియాట్టం ఓటీటీ డెబ్యూ చేయనుంది.
సీక్వెల్ గా
2024లో వచ్చిన భరతనాట్యం మూవీకి సీక్వెల్ గా భరతనాట్యం 2 మోహినియాట్టం సినిమా వచ్చింది. ఇది ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి క్రిష్ణదాస్ మురళీ డైరెక్టర్. భరతనాట్యం 2 మోహినియాట్టం సినిమాలో సాయిజు కురుప్, సూరజ్ వెంజరమూడు, జగదీశ్, వినయ్, బేబీ జీన్, కళారజిని, శ్రీజ రవి తదితరులు నటించారు.
బ్లాక్ బస్టర్
భరతనాట్యం 2 మోహినియాట్టం సినిమా థియేటర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.40 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకోవడం విశేషం. ఈ మూవీకి ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉంది.
భరతనాట్యం 2 మోహినియాట్టం స్టోరీ
శశి, అతని కుటుంబం చుట్టూ తిరిగే కథనే భరతనాట్యం 2 మోహినియాట్టం మూవీ. తండ్రి భరతన్ నాయర్ మరణం తర్వాత, ఆయనకు రెండు ఫ్యామిలీలు ఉన్నాయని శశి తెలుసుకుంటాడు. ఆ రెండు కుటుంబాలను ఒకటి చేస్తాడు. అయితే, భరతన్ పాత స్నేహితుడైన గోవిందరాజ రంగ ప్రవేశంతో కథ మలుపు తిరుగుతుంది.
భరతన్ నాయర్ గతంలో ఒక నకిలీ దేవాలయాన్ని నిర్మించి ప్రజలను మోసం చేశాడని గోవిందరాజ బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ గొడవలో అనుకోకుండా శశి తల్లి చేతిలో గోవిందరాజ చనిపోతాడు. ఆ శవాన్ని వదిలించుకోవడానికి కుటుంబ సభ్యులంతా కలిసి పడే పాట్లు నవ్వుతో పాటు ఉత్కంఠను కలిగిస్తాయి.
చివరకు ఆ శవాన్ని ఎలా మాయం చేశారు? ఆ గుడిలో ఏముంది? అనే విషయాన్ని భరతనాట్యం 2 మోహినియాట్టం సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


