YouTube: 400 కోట్ల సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్- ఓటీటీలో కాదు నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్- ఎప్పుడంటే?
Iron Lung OTT Streaming On YouTube: థియేటర్లలో సంచలన విజయం సాధించిన గ్లోబల్ యూట్యూబర్ మార్కిప్లియర్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఐరన్ లంగ్ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. నేరుగా యూట్యూబ్‌లో రూ. 400 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టిన సూపర్ హిట్ ఫిల్మ్ ఐరన్ లంగ్ ప్రీమియర్ అవనుంది.
Iron Lung OTT Release On YouTube: గేమింగ్, హారర్ జోనర్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంచలన చిత్రం 'ఐరన్ లంగ్' (Iron Lung) ఎట్టకేలకు ఓటీటీ స్క్రీన్‌పైకి వచ్చేస్తోంది. ప్రముఖ గ్లోబల్ యూట్యూబర్ మార్క్ ఫిష్‌బాక్ (మార్కిప్లియర్) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ చిత్రమే ఐరన్ లంగ్.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగిన ఒక ప్యానెల్ చర్చలో మార్కిప్లియర్ స్వయంగా ఐరన్ లంగ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మన దేశంలో యూట్యూబర్లు షార్ట్ ఫిలిమ్స్ లేదా వెబ్ సిరీస్‌లు చేయడం సాధారణంగా చూస్తుంటాం. కానీ అంతర్జాతీయ స్థాయిలో కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఒక క్రియేటర్, ఏకంగా హాలీవుడ్ రేంజ్ సినిమాను సొంతంగా నిర్మించి థియేటర్లలో రికార్డులు సృష్టించడం ప్రపంచవ్యాప్తంగా సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తక్కువ బడ్జెట్.. భారీ వసూల్లు
ఈ ఏడాది జనవరి 30న థియేటర్లలో విడుదలైన 'ఐరన్ లంగ్' బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. కేవలం 3 నుంచి 4 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 25-30 కోట్లు) పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా 50 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 400 కోట్లు) పైగా కలెక్షన్స్ సాధించి హాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ప్రముఖ సినీ విమర్శకుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. హాలీవుడ్ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు సైతం ఐరన్ లంగ్ సినిమా సాధించిన విజయాన్ని చూసి నేర్చుకోవాలని అంతర్జాతీయ మీడియా ప్రశంసించింది.
రక్తం నిండిన సముద్రంలో సబ్‌మెరైన్ కథ
డేవిడ్ షిమాన్స్కి 2022లో రూపొందించిన ఒక పాపులర్ ఇండీ హారర్ గేమ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక గ్రహంపై ఉన్న రక్తం లాంటి ఎర్రటి సముద్రంలో, ఇరుకైన సబ్‌మెరైన్ (జలాంతర్గామి) లోపల చిక్కుకున్న ఒక ఖైదీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఇరుకైన ప్రదేశంలో అతనికి ఎదురైన భయానక పరిస్థితులు, భ్రమలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెడతాయి.
ఈ సినిమాలో సైమన్ అనే ప్రధాన పాత్రలో మార్కిప్లియర్ స్వయంగా నటించారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సొంత డబ్బుతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. ఇటీవల అమీ నెల్సన్‌తో పెళ్లి, ఆ తర్వాత హఠాత్తుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం వంటి పరిణామాల తర్వాత మార్కిప్లియర్ నుంచి వస్తున్న పెద్ద అప్‌డేట్ ఇదే కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఎక్కడ, ఎలా చూడొచ్చు?
యూట్యూబ్‌లో నేరుగా ఐరన్ లంగ్ ఓటీటీ రిలీజ్ కానుంది. మే 31 నుంచి యూట్యూబ్‌లో ఐరన్ లంగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. యూట్యూబ్ మూవీస్ అండ్ టీవీ (YouTube Movies & TV) స్టోర్‌ఫ్రంట్‌లో ఈ చిత్రం ప్రీమియం పద్ధతిలో అందుబాటులోకి రానుంది.
సాధారణంగా యూట్యూబ్‌లో విడుదలయ్యే కొత్త చిత్రాల ధర 19.99 డాలర్ల నుంచి 29.99 డాలర్ల (సుమారు రూ. 1,600 నుంచి రూ. 2,500) వరకు ఉంటుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రెంట్ లేదా కొనుగోలు ధరను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీనితో పాటు డిస్క్‌ల (Physical Release) రూపంలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి
కేన్స్ వేదికగా మార్కిప్లియర్ మాట్లాడుతూ, 2027లో తన తదుపరి సరికొత్త సినిమా ప్రాజెక్ట్‌పై పని చేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ వేసవిలో 'ఐరన్ లంగ్' ఒక సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


