OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మిస్టరీ హారర్ థ్రిల్లర్- బెడిసికొట్టే క్షుద్ర పూజ-బిడ్డకు శాపం, తల్లి పోరాటం-ఎక్కడంటే?
Satan The Dark OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన లేటెస్ట్ మిస్టరీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ సతన్ ది డార్క్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. క్షుద్రపూజ బెడిసికొట్టడంతో ఓ దుష్టశక్తి బయటకు వస్తుంది. అది శాపంగా ఎలా మారిందనే కథతో వచ్చిన సతన్ ది డార్క్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ చూద్దాం.
Horror Thriller Satan The Dark OTT Release Today: హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. మంత్ర తంత్రాలు, క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన తమిళ మిస్టరీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం సతన్: ది డార్క్ ఓటీటీలోకి ఇవాళ (మే 8) వచ్చేసింది. సతన్ అంటే సైతాన్ అని లేదా తెలుగులో దెయ్యం అనే అర్థం వస్తుంది.

ప్రేక్షకులను భయపెట్టి
డైరెక్టర్ మణికందన్ రామలింగం దర్శకత్వం వహించిన సతన్ ది డార్క్ చిత్రం ఈ ఏడాది మార్చి 27న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను భయపెట్టింది. ఐఎమ్‌డీబీ నుంచి తక్కువ రేటింగ్ సాధించినప్పటికీ భయపెట్టే హారర్ మూవీగా నిలిచింది.
క్షుద్ర పూజ బెడిసికొట్టడంతో ఓ దుష్టశక్తి బయటకు వస్తుంది. అది ఓ బిడ్డకు శాపంగా ఎలా మారింది, బిడ్డను కాపాడుకునేందుకు తల్లి చేసిన పోరాటం ఏంటీ అనే కాన్సెప్టుతో సతన్ ది డార్క్ మూవీ తెరకెక్కింది.
కథ ఏమిటంటే?
రెండు వేర్వేరు కాలమానాల (టెమ్ లైన్స్) మధ్య సాగే ఈ కథ హస్తినాపురం అనే కొండ ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో జరిగిన ఒక క్షుద్ర పూజ బెడిసికొట్టి, ఒక దుష్టశక్తి బయటకు వస్తుంది. దాంతో ప్రస్తుత కాలంలో మార్సెలిన్ (మోనా బెడ్రే) అనే మహిళ ప్రవర్తన హఠాత్తుగా మారుతుంది.
ఏదో అదృశ్య శక్తి ప్రభావంతో మార్సెలిన్ హింసాత్మకంగా ప్రవర్తిస్తుండటంతో, ఆమె కుమార్తె అలిషా (అయిరా పాలక్) ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఆ శాపం నుంచి తన బిడ్డను కాపాడుకోవడానికి మార్సెలిన్ చేసిన పోరాటమే ఈ సతన్ ది డార్క్ సినిమా.
ప్రధాన పాత్రలు - సాంకేతిక బృందం
సతన్ ది డార్క్ చిత్రంలో ఎఫ్.జె (FJ), అయిరా పాలక్, చాందిని తమిళరసన్, మోనా బెడ్రే, శ్రీజ రవి కీలక పాత్రలు పోషించారు. బాలా జి. రామస్వామి ఛాయాగ్రహణం అందించగా, అశ్విన్ కృష్ణ సంగీతం సమకూర్చారు. రాజ్ కుమార్, కోవై అభిషేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. చాందిని తమిళరసన్ ఒక విలక్షణమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
విశ్లేషణ - ఎలా ఉంది?
సతన్ ది డార్క్ సినిమాలోని విజువల్స్, సౌండ్ డిజైన్ భయపెట్టేలా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భయం, ఆందోళన కలిగించే సన్నివేశాల్లో అయిరా పాలక్, ఫ్రెడరిక్ జాన్ నటన మెప్పించింది.
అయితే, 144 నిమిషాల నిడివి సినిమా వేగాన్ని కొంత తగ్గించిందని, ఎడిటింగ్ విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుంటే బాగుండేదనే టాక్ వినిపించింది. పాతకాలపు మాంత్రికులకు సంబంధించిన సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. హారర్ చిత్రాలను ఇష్టపడే వారు కచ్చితంగా ఒకసారి ట్రై చేయవచ్చని రివ్యూలు వచ్చాయి.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ఇలాంటి హారర్ థ్రిల్లర్ సతన్ ది డార్క్ ఓటీటీలోకి నేడు వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో మే 8న సతన్ ది డార్క్ ఓటీటీ రిలీజ్ అయింది. థియేటర్లలో విడుదలైన దాదాపు ఆరు వారాల తర్వాత సతన్ ది డార్క్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే, హారర్ సినిమాలకు థియేటర్ల కంటే ఓటీటీలో ఎక్కువ ఆదరణ ఉంటుందని పరిశ్రమ వర్గాల నుంచి వచ్చే టాక్. కాగా, కేవలం తమిళంలోనే అమెజాన్ ప్రైమ్‌లో సతన్ ది డార్క్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఎలాంటి భాషా చిత్రమైన చూద్దామనుకునేవారు ఈ సతన్ ది డార్క్ మూవీని ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


