The Manity.in: ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు- హాలీవుడ్ రేంజ్ మేకింగ్- వేల కోట్ల కలెక్షన్స్ టార్గెట్‌గా ది మానిటి. ఇన్ మూవీ

BS Rao The Manity.in Movie Posters Released: హాలీవుడ్ రేంజ్ మేకింగ్‌తో టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ సోషల్ ఎలిమెంట్స్ సినిమా ది మానిటి.ఇన్. ఈ సినిమాకు బీఎస్ రావు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండు పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని ఐమాక్స్ 8కే టెక్నాలజీతో రిలీజ్ చేయనున్నారు.

Published on: May 10, 2026, 08:30:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

BS Rao The Manity.in Movie Posters Released: టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ‘ది మానిటి.ఇన్’ చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్ బీఎస్ రావు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు అందించనున్నారని మేకర్స్ చెబుతున్నారు.

ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు- హాలీవుడ్ రేంజ్ మేకింగ్- వేల కోట్ల కలెక్షన్స్ టార్గెట్‌గా ది మానిటి. ఇన్ మూవీ
ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు- హాలీవుడ్ రేంజ్ మేకింగ్- వేల కోట్ల కలెక్షన్స్ టార్గెట్‌గా ది మానిటి. ఇన్ మూవీ

హాలీవుడ్ యాక్షన్ తరహాలో

కేవలం వందల కోట్లను మాత్రమే కాకుండా, వేల కోట్ల వసూళ్లను టార్గెట్ చేసుకుని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోయే ఈ మూవీ తెలుగు సినిమా మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తుందని చిత్ర దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వీఎఫ్ఎక్స్ విభాగంలో అనుభవం ఉండడంతో టాలీవుడ్‌లో మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని IMAX 8K ఫార్మాట్‌లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ ఫార్మాట్‌ను ఇక్కడ పరిచయం చేయడం ద్వారా ప్రేక్షకులకు ఒక వినూత్నమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నారు.

మానవత్వం విఫలమైనప్పుడు

టెక్నాలజీ పరంగా రాజీ పడకుండా, ప్రతి ఫ్రేమ్‌ను ఒక విజువల్ పోయెట్రీలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి దర్శకుడు బీఎస్ రావు మాట్లాడుతూ, మానవత్వం (Humanity) విఫలమైనప్పుడు ‘మానిటీ’ (MANITY) ఏం చేస్తుంది అనే ఒక విలక్షణమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుందని వివరించారు.

తాజాగా ఈ చిత్రం ది మానిటి.ఇన్ నుంచి రెండు అదిరిపోయే పోస్టర్లను విడుదల చేశారు. అందులోని ఓ పోస్టర్‌లో "When humanity is neglected... Manity arises" అనే ట్యాగ్‌లైన్ సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని ఆసక్తికరంగా రివీల్ చేస్తోంది.

సమాజంలో మనిషి విలువలు తగ్గినప్పుడు ప్రకృతి లేదా ఒక అదృశ్య శక్తి ఏ విధంగా స్పందిస్తుందనే అంశాన్ని సైన్స్ ఫిక్షన్, సోషల్ ఎలిమెంట్స్ కలగలిపి అద్భుతంగా రాసుకున్నట్లు తెలిపారు. ఈ పాయింట్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయడమే కాకుండా, సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని డైరెక్టర్ బీఎస్ రావు వెల్లడించారు.

ఐమాక్స్ 8కే టెక్నాలజీతో

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి సైతం ఐమాక్స్ ఫార్మాట్‌లో సినిమా చేయడానికి ఎంతో సమయం తీసుకున్నారని, తాను తన మొదటి సినిమాతోనే IMAX 8K ప్రమాణాలను అందుకోవాలని గట్టి సంకల్పంతో ఉన్నానని బీఎస్ రావు ధీమా వ్యక్తం చేశారు. పోస్టర్‌పై కనిపిస్తున్న "IMAX 8k never before" అనే పదం ఈ చిత్ర సాంకేతిక నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది.

మనిషి సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని, తనకున్న టెక్నికల్ నాలెడ్జ్‌తో హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్‌ను టాలీవుడ్ హీరోలతో సాధ్యం చేసి చూపిస్తానని బీఎస్ రావు ఛాలెంజ్ చేశారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, తెరపై కనిపిస్తుందని ఆయన గర్వంగా చెబుతున్నారు.

ఇద్దరు స్టార్ హీరోలు

ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించినట్లు దర్శకుడు బీఎస్ రావు తెలిపారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఎవరైనా ఈజీగా సెట్ అయ్యేలా కథను సిద్ధం చేశానని, స్టార్ హీరోల డేట్స్ కుదిరితే ఈ పాటికి సినిమా ప్రారంభమయ్యేదని బీఎస్ రావు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ నచ్చే ఏ హీరో అయినా ముందుకు వస్తే వారితో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఈ కథలో ఉండే ఎమోషన్స్, విజువల్స్ ఏ స్టార్ హీరోకైనా ఒక కెరీర్ మైల్‌స్టోన్ లాంటి సినిమా అవుతుందని బీఎస్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు.

పోస్టర్‌లో కనిపిస్తున్న ఇంటెన్స్ ఐస్ (కళ్లు) సినిమాలోని గాంభీర్యాన్ని, నిగూఢమైన రహస్యాలను సూచిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఈ లుక్‌లో అంతరిక్షం (Space), నగరం (Cityscape), అడవి (Forest) సముద్రం (Sea) వంటి విభిన్న ఎలిమెంట్స్ ఒకే చోట కనిపించడం సినిమా విస్తృతిని చాటిచెబుతోంది.

ఊహలకు అందని స్థాయిలో

ప్రేక్షకులు తమ ఊహలకు కూడా అందని స్థాయిలో ఈ సినిమా విజువల్స్ ఉంటాయని, మీరు ఎంతటి భారీ అంచనాలు పెట్టుకున్నా వాటిని మించేలా అవుట్‌పుట్ ఉంటుందని చిత్ర యూనిట్ హామీ ఇస్తోంది. ముఖ్యంగా యూత్, పిల్లలు ఈ సినిమాలోని విజువల్స్, క్యారెక్టరైజేషన్స్‌కు ఫిదా అవుతారని, ఇక పిల్లలు ఇష్టపడే ఏ సినిమా అయినా సరే అది ఒక యూనివర్సల్ హిట్‌గా మారుతుందని డైరెక్టర్ బీఎస్ రావు పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More