OTT Telugu: ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా- ప్రేమకు గ్యారెంటీ కార్డు, భీమా- 240 దేశాల్లో, 5 భాషల్లో స్ట్రీమింగ్!

Love Insurance Kompany OTT Release Official: ఓటీటీలోకి తెలుగు సైన్స్ ఫిక్షన్ కామెడీ లవ్ డ్రామా సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేయనుంది. దీనికి సంబంధించి తాజాగా అధికారిక ఓటీటీ రిలీజ్ ప్రకటన వచ్చింది. ఐదు భాషల్లో, 240 దేశాల్లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అది ఎక్కడో చూద్దాం.

Published on: May 4, 2026, 16:01:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

LIK OTT Streaming Announced Officially: సరికొత్త కథాంశంతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ బాట పట్టింది. మే 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది.

ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా- ప్రేమకు గ్యారెంటీ కార్డు, భీమా- 240 దేశాల్లో, 5 భాషల్లో స్ట్రీమింగ్!
ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా- ప్రేమకు గ్యారెంటీ కార్డు, భీమా- 240 దేశాల్లో, 5 భాషల్లో స్ట్రీమింగ్!

240 దేశాల్లో ఓటీటీ రిలీజ్

కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి 5 భాషల్లోనూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ రిలీజ్ కానుంది. సుమారు 240 దేశాల్లోని సినీ ప్రియులు ఈ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించేలా గ్లోబల్ ప్రీమియర్‌ను ప్లాన్ చేశారు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ వంటి యూత్ ఫుల్ హిట్స్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

2040 నాటి చెన్నై.. ప్రేమకు భీమా ఉంటే?

ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథ 2040 కాలంలో సాగుతుంది. ఆ కాలంలో ప్రేమ అనేది కేవలం మనసులకు సంబంధించిన విషయం కాదు.. అది ఒక శక్తివంతమైన కార్పొరేట్ సంస్థ ద్వారా నియంత్రించబడుతుంది. ప్రేమికులకు భరోసా ఇచ్చేలా ఒక 'ఇన్సూరెన్స్' కంపెనీ పుట్టుకొస్తుంది.

అల్గారిథమ్స్, టెక్నాలజీ ద్వారా ప్రేమను అంచనా వేయొచ్చని నమ్మే సీఈఓ సూర్యన్ (ఎస్‌జే సూర్య) ఒకవైపు.. అసలు ప్రేమే స్వచ్ఛమైనది, దాన్ని ఎవరూ నియంత్రించలేరని నమ్మే యువకుడు వైబ్ వాసీ (ప్రదీప్ రంగనాథన్) మరోవైపు. ఈ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణ, మధ్యలో ధీమ (కృతి శెట్టి) ప్రవేశంతో కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది వినోదాత్మకంగా మలిచారు.

బలమైన తారాగణం..

దర్శకుడు విఘ్నేష్ శివన్ తనదైన మార్క్ కామెడీతో పాటు భవిష్యత్తు కాలం నాటి టెక్నాలజీని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ప్రదీప్ రంగనాథన్ తనదైన మేనరిజమ్స్‌తో ఆకట్టుకోగా, ఎస్‌జే సూర్య నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్

బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి తన గ్లామర్‌తో పాటు నటనతోనూ మెప్పించింది. ఇక రాక్ స్టార్ అనిరుధ్ అందించిన సంగీతం ఇప్పటికే యువతను ఊపేస్తోంది. యోగి బాబు కామెడీ, సీమాన్, గౌరీ కిషన్ వంటి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నేటి తరం డేటింగ్ యాప్స్, వర్చువల్ ప్రపంచంలో ప్రేమను ఎలా వెతుక్కుంటున్నారో ఈ సినిమాలో సెటైరికల్‌గా చూపించారు.

ప్రేమకు గ్యారెంటీ కార్డు ఇచ్చే కంపెనీ ఉంటే ఎలా ఉంటుందో చూడాలంటే 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సరైన ఎంపిక. డిజిటల్ యుగంలో మన ఎమోషన్స్ కూడా ఎలా యాప్స్ చేతిలోకి వెళ్తున్నాయో తెలియజేస్తూనే, గుండె లోతుల్లో ఉండే మానవ సంబంధాల గొప్పతనాన్ని ఈ చిత్రం గుర్తు చేస్తుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

కామెడీతో సైన్స్ ఫిక్షన్ లవ్ డ్రామా కావాలనుకునే వారు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో మే 6 నుంచి ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాన్ని ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More