OTT Sci-Fi: 2 ఓటీటీల్లో 750 కోట్ల సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్- మంచు ఖండంలో ఫ్యామిలీ పోరాటం-తెలుగులోనూ స్ట్రీమింగ్!
Greenland 2 Migration OTT Release Telugu: హాలీవుడ్ యాక్షన్ హీరో గెరార్డ్ బట్లర్ నటించిన సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గ్రీన్‌ల్యాండ్ 2: మైగ్రేషన్ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా రెండింట్లో గ్రీన్‌ల్యాండ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది.
Greenland 2 Migration OTT Streaming In Telugu: : హాలీవుడ్ సినిమాలకు, ముఖ్యంగా విపత్తు నేపథ్యంలో సాగే థ్రిల్లర్లకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంటుంది. గతంలో వచ్చిన 'గ్రీన్‌ల్యాండ్' చిత్రం ఇక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన గ్రీన్‌ల్యాండ్ 2: మైగ్రేషన్ ఓటీటీలో సందడి మొదలుపెట్టేసింది.

మంచు ఖండంలో మనుగడ పోరాటం
తొలి భాగంలో భూమిని తాకిన తోకచుక్క సృష్టించిన విధ్వంసం నుంచి ప్రాణాలతో బయటపడిన గ్యారిటీ కుటుంబం కథే ఈ రెండో భాగం. గ్రీన్‌ల్యాండ్ బంకర్‌లోని రక్షణ వదిలి, పూర్తిగా గడ్డకట్టిన ఐరోపా మంచు ఖండం గుండా కొత్త నివాసం కోసం వారు చేసే ప్రయాణం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. జాన్ గ్యారిటీగా గెరార్డ్ బట్లర్, అలిసన్ పాత్రలో మోరెనా బక్కారిన్ మరోసారి తమ నటనతో మెప్పించారు.
తొలి భాగం కేవలం ప్రాణాలు కాపాడుకోవడం మీద సాగితే, ఈ రెండో భాగంలో శిథిలమైన మౌలిక సదుపాయాలు, విరుచుకుపడే సునామీల మధ్య ఒక సమాజాన్ని ఎలా నిర్మించుకోవాలనే కోణంలో కథ సాగుతుంది. ముఖ్యంగా తండ్రి అడుగుజాడల్లో నడవాలనుకునే టీనేజ్ కొడుకు నాథన్ పాత్ర ఈ చిత్రంలో కీలకంగా మారింది.
భారీ బడ్జెట్.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం
ఈ సినిమాను సుమారు 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 750 కోట్ల రూపాయలు) భారీ వ్యయంతో నిర్మించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఉత్తర అమెరికాలో మొదటి వారంలో 8.4 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 20.8 మిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయింది.
ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్ కూడా 5.2 పాయింట్ల వద్దే ఉండటం గమనార్హం. రిక్ రోమన్ వా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, యాక్షన్ ప్రియులకు మాత్రం ఇది మంచి విందుగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారికి గ్రీన్‌ల్యాండ్ 2 మైగ్రేషన్ ఓటీటీ రిలీజ్ మంచి అవకాశం అని చెప్పొచ్చు.
ఇంటి వద్దే థ్రిల్లింగ్ అనుభవం
లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)లో గ్రీన్‌ల్యాండ్ 2 మైగ్రేషన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 24న గ్రీన్‌ల్యాండ్ 2 ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో గ్రీన్‌ల్యాండ్ 2 ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ రెంటల్ పద్ధతిలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
2 ఓటీటీల్లో
లయన్స్ గేట్ ప్లే సబ్‌స్క్రైబర్లు నేరుగా ఈ సినిమాను చూడవచ్చు. లేదంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె చెల్లించి వీక్షించవచ్చు. భారీ గ్రాఫిక్స్, ఉత్కంఠ రేపే సన్నివేశాలతో సాగే ఇలాంటి సినిమాలు హోమ్ థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే బాక్సాఫీస్ వద్ద వెనుకబడినప్పటికీ, 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో గ్రీన్‌ల్యాండ్ 2 భారీ వ్యూస్‌ను రాబట్టే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


