OTT Weekend: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు- వీకెండ్‌కు బెస్ట్- అన్నీ ఒకేదాంట్లో, తెలుగులో 1!
Top 5 Movies For This Weekend Watch: ఈ వారం ఓటీటీలో సందడి మామూలుగా లేదు. హారర్ థ్రిల్లర్ల నుంచి సామాజిక ఇతివృత్తాల వరకు విభిన్న కథాంశాలతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ముందుకు వచ్చింది. మీ వీకెండ్‌ను ఎంటర్టైనింగ్‌గా మార్చే ఐదు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఇక్కడ ఉన్నాయి. వీటిలో ఒక్కటి మాత్రమే తెలుగులో ఉంది.
Top 5 Movies For This Weekend Watch: వారాంతం వచ్చిందంటే చాలు.. ఇంటిల్లిపాదీ కలిసి కొత్తగా ఏం చూడాలా అని వెతుకుతుంటారు. ఇప్పుడు ఆ సెర్చ్ ఆపేయండి! ఏప్రిల్ నెలాఖరులో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రాలు, సిరీస్‌లు భలే ఆసక్తిగా ఉన్నాయి.

ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే
కొరియన్ సస్పెన్స్ డ్రామాలు, ఛార్లీజ్ థెరాన్ యాక్షన్ ఫీట్లు, సామాజిక కోణంలో సాగే హిందీ చిత్రాలు.. ఇలా అన్నీ మీకోసం రెడీగా ఉన్నాయి. కచ్చితంగా చూసేలా ఐదు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ ఈవీకెండ్‌కు బెస్ట్ అనిపించే లిస్ట్ ఇది. ఈ సినిమాలన్నీ ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుండగా.. తెలుగులో ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రాణం తీసే కోరికలు: ‘ఇఫ్ విషెస్ కుడ్ కిల్’
కొరియన్ సినిమాలకు మన దగ్గర ఉండే క్రేజే వేరు. ఏప్రిల్ 24న ఓటీటీ రిలీజ్ ఈ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ సరికొత్త సస్పెన్స్‌తో అలరిస్తోంది. ఐదుగురు స్నేహితులు ఒక వింతైన యాప్‌ను కనిపెడతారు.
కోరుకున్న కోరికలు తీర్చే ఆ యాప్, బదులుగా చావును బహుమతిగా ఇస్తుంది. మనిషి అత్యాశ ప్రాణాల మీదకు వస్తే పరిస్థితి ఏంటనేది ఈ సిరీస్ సారాంశం. కంగ్ మి-నా, జియాన్ సో-యంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రతి నిమిషం ఉత్కంఠ రేకెత్తించే ఈ థ్రిల్లర్ వీకెండ్ వాచ్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్.
ఛార్లీజ్ థెరాన్ ‘అపెక్స్’.. మనుగడ కోసం పోరాటం!
యాక్షన్ ప్రియుల కోసం ఛార్లీజ్ థెరాన్, టారన్ ఎగర్టన్ జంటగా నటించిన ‘అపెక్స్’ ఏప్రిల్ 24 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆస్ట్రేలియా అడవుల్లో సాగే మనుగడ పోరాటం ఇది. ఒక పర్వతారోహకురాలిని వేటాడే క్రూరమైన వేటగాడి నుంచి ఆమె ఎలా తప్పించుకుంది? కేవలం తెలివితేటలతో మృత్యువును ఎలా ఎదిరించింది? అన్నది కళ్లు తిప్పుకోకుండా చూపిస్తారు. విజువల్స్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
వివాదాస్పద కథనంతో ‘స్ట్రెయిట్ టు హెల్’
జపాన్‌కు చెందిన వివాదాస్పద జ్యోతిష్కురాలు కజుకో హోసోకి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ డ్రామా ఇది. ఏప్రిల్ 27 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. కేవలం వృత్తిపరమైన విజయాలే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణలను దర్శకుడు హిడియో నకటా అద్భుతంగా ఆవిష్కరించారు.
ఎరికా తోడా ఈ పాత్రలో ఒదిగిపోయారు. ఒక సామాన్య మహిళ అంతటి ప్రఖ్యాతి ఎలా సంపాదించింది? దాని వెనుక ఉన్న రహస్యాలేంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విద్యావ్యవస్థపై సెటైర్.. ‘నుక్కడ్ నాటక్’
సమాజంలో పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల చుట్టూ తిరిగే కథే ఈ ‘నుక్కడ్ నాటక్’. చోరీ కేసులో ఇరుక్కున్న ఇద్దరు కాలేజీ కుర్రాళ్లు, మళ్లీ కాలేజీలో చేరాలంటే మురికివాడల్లోని పిల్లలను స్కూల్లో చేర్పించాలనే నిబంధన పెడతారు.
ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, పొందిన పాఠాలు సినిమాను ముందుకు నడిపిస్తాయి. తాన్మయ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ హిందీ డ్రామా మనసుకు హత్తుకునేలా ఉంటుంది.
కల్ట్ సంకెళ్ల నుంచి విముక్తి.. ‘అన్‌చూసెన్’
ఏప్రిల్ 21న విడుదలైన ‘అన్‌చూసెన్’ ఒక సైకలాజికల్ థ్రిల్లర్. కఠినమైన ఒక కల్ట్ సమూహంలో చిక్కుకున్న మహిళ తన స్వేచ్ఛ కోసం ఎలా పోరాడింది? అసలు ఆ రహస్య సంస్థ వెనుక ఉన్న భయంకర నిజాలేంటి? అన్నది ఆరు ఎపిసోడ్ల పాటు ఉత్కంఠగా సాగుతుంది. ఆసా బటర్ ఫీల్డ్, మోలీ విండ్సర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. రహస్యాలు, కుట్రలు ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


