Biopic OTT: లెజెండరీ హీరోయిన్ మధుబాల బయోపిక్‌లో ధురంధర్ బ్యూటీ సారా అర్జున్- నేరుగా ఓటీటీలో రిలీజ్- భన్సాలీ భారీ స్కెచ్

Sara Arjun In Madhubala Biopic OTT Release Directly: బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన సారా అర్జున్ ఇప్పుడు ఏకంగా భారతీయ చలనచిత్ర దిగ్గజం మధుబాల పాత్రలో మెరవబోతోంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక మధుబాల బయోపిక్ ఓటీటీలోనే నేరుగా స్ట్రీమింగ్ కానుంది.

Published on: Apr 23, 2026, 12:22:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sara Arjun In Madhubala Biopic OTT Release: భారతీయ వెండితెర 'వీనస్', లెజెండరీ హీరోయిన్ మధుబాల జీవిత చరిత్రను సినిమాగా మలచాలనే ప్రయత్నాలు బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ పాత్ర కోసం టాక్సిక్ బ్యూటీ కియారా అద్వానీ, సయ్యారా హీరోయిన్ అనీత్ పడ్డా వంటి పేర్లు వినిపించినా, అవేవీ కార్యరూపం దాల్చలేదు.

లెజెండరీ హీరోయిన్ మధుబాల బయోపిక్‌లో ధురంధర్ బ్యూటీ సారా అర్జున్- నేరుగా ఓటీటీలో రిలీజ్- డైరెక్టర్ భారీ స్కెచ్
లెజెండరీ హీరోయిన్ మధుబాల బయోపిక్‌లో ధురంధర్ బ్యూటీ సారా అర్జున్- నేరుగా ఓటీటీలో రిలీజ్- డైరెక్టర్ భారీ స్కెచ్

తాజాగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ధురంధర్ బ్యూటీ సారా అర్జున్‌ను మధుబాల పాత్ర కోసం ఖరారు చేసినట్లు సమాచారం. చిన్నప్పుడు 'నాన్న' (తమిళంలో దైవ తిరుమగళ్) సినిమాలో విక్రమ్ కూతురిగా నటించి మెప్పించిన సారా అర్జున్ ఇప్పుడు ఇంతటి భారీ పాత్రను పోషించడం ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది.

థియేటర్లకు బదులు ఓటీటీ బాట?

అయితే, మధుబాల బయోపిక్ సినిమా విషయంలో మేకర్స్ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం ఉన్నప్పటికీ, ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ (Direct-to-OTT) ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.

కంటెంట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు ఓటీటీ వేదికల ద్వారా మధుబాల బయోపిక్ కథను చేరవేయాలని భావిస్తున్నారు. 'డార్లింగ్స్' సినిమాతో తన మార్క్ చాటుకున్న జస్మీత్ కె. రీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

భన్సాలీ ఎంట్రీతో మారిన దశ

నిజానికి ఈ ప్రాజెక్ట్ గత రెండేళ్లుగా బడ్జెట్ సమస్యల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఎప్పుడైతే అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారో, అప్పటి నుంచి ఈ సినిమా వేగం పుంజుకుంది. మధుబాల లాంటి అందగత్తెను వెండితెరపై ఆవిష్కరించాలంటే భన్సాలీ లాంటి మేకింగ్ వాల్యూస్ ఉన్న నిర్మాత అవసరమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

దిలీప్ కుమార్, కిషోర్ కుమార్ పాత్రధారులు ఎవరు?

జూలై 2026 నుంచి మధుబాల బయోపిక్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మధుబాల జీవితంలో కీలక వ్యక్తులైన దిలీప్ కుమార్, కిషోర్ కుమార్ పాత్రల కోసం ప్రస్తుతం వేట కొనసాగుతోంది. ఈ పాత్రల కోసం కూడా అగ్ర హీరోలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, మధుబాల ఆహార్యాన్ని, హావభావాలను ఒడిసిపట్టేందుకు సారా అర్జున్ ఇప్పటికే కఠినమైన శిక్షణ తీసుకుంటోంది. ఆమె ఫిజికల్ మేకోవర్ కోసం ప్రత్యేక టీమ్ పనిచేస్తోంది. 2011లో కేవలం ఆరేళ్ల వయసులో బాలనటిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన సారా అర్జున్ ఇప్పుడు ఈ సెన్సేషనల్ బయోపిక్‌తో బాలీవుడ్ స్టార్‌గా ఎదిగేందుకు సిద్ధమైంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. మధుబాల బయోపిక్‌లో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారు?

'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మధుబాల పాత్రను పోషిస్తోంది.

2. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది ఎవరు?

ఆలియా భట్ నటించిన 'డార్లింగ్స్' సినిమాతో పేరు తెచ్చుకున్న జస్మీత్ కె. రీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

3. సినిమా విడుదల ఎక్కడ ఉండబోతోంది?

తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.

4. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది?

ఈ సినిమా చిత్రీకరణ జూలై 2026లో ప్రారంభం కానుందని సమాచారం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More