Kiara Advani: నాలో ఆడపులి నిద్రలేచింది, జీవితాన్ని చూసే కోణమే మారిపోయింది.. టాక్సిక్ బ్యూటి కియారా అద్వానీ కామెంట్స్

Kiara Advani Comments On Motherhood Became Tigress: తనలోని ఆడపులి నిద్రలేచినట్లుగా ఉందని, జీవితాన్ని చూసే కోణమే మారిపోయిందని యశ్ టాక్సిక్ హీరోయిన్ కియారా అద్వానీ తాజాగా తెలిపింది. హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి తర్వాత తన బంధం గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది కియారా అద్వానీ.

Mar 28, 2026, 21:25:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా గతేడాది తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2025 జూలైలో వీరికి 'సారాయ మల్హోత్రా' జన్మించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అద్వానీ.. అమ్మనయ్యాక తనలో కలిగిన మార్పుల గురించి ఎంతో హృద్యంగా మాట్లాడారు.

నాలో ఆడపులి నిద్రలేచింది, జీవితాన్ని చూసే కోణమే మారిపోయింది.. టాక్సిక్ బ్యూటి కియారా అద్వానీ కామెంట్స్
నాలో ఆడపులి నిద్రలేచింది, జీవితాన్ని చూసే కోణమే మారిపోయింది.. టాక్సిక్ బ్యూటి కియారా అద్వానీ కామెంట్స్

మాతృత్వం తర్వాత కియారా కొత్త రూపం!

పిల్లలు పుట్టిన తర్వాత ఏ తల్లికైనా ప్రపంచం మారిపోతుంది. కియారా విషయంలోనూ అదే జరిగింది. "అమ్మనయ్యాక నాలో ఒక ఆడపులి (Tigress) మేల్కొన్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు నా జీవితాన్ని చూసే కోణమే మారిపోయింది. ఒకవైపు ఏదీ ముఖ్యం కాదనిపిస్తూనే, మరోవైపు ప్రతి చిన్న విషయం కూడా చాలా ముఖ్యం అనిపిస్తోంది. నా లోపల ఆ చిన్నారి నిరంతరం ఉంటూనే ఉంది" అని కియారా అద్వానీ తన భావాలను పంచుకున్నారు.

సిద్ధార్థ్‌తో పెళ్లి తర్వాత బంధం గురించి మాట్లాడుతూ.. "పెళ్లికి ముందు మా మధ్య ఉన్న సరదా కబుర్లు, కలిసి ప్రయాణాలు చేయడం.. ఇవేవీ మారలేదు. ఇప్పటికీ మేమిద్దరం కలిసి సినిమాలు చూస్తాం. నటీనటులుగా, సినిమా ప్రేమికులుగా ఆ చిత్రాల గురించి చర్చించుకోవడం మాకు చాలా ఇష్టం" అని కియారా అద్వానీ పేర్కొన్నారు.

షెర్షా సెట్స్ నుంచి సారాయ దాకా..

'షెర్షా' సినిమా షూటింగ్ సమయంలో మొదలైన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పరిచయం ప్రేమగా మారి 2023లో పెళ్లి పీటల దాకా వెళ్లింది. గతేడాది ఫిబ్రవరిలో గర్భవతిని అని ప్రకటించిన కియారా, జూలైలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ నెలలో తమ ముద్దుల కూతురికి 'సారాయ' అని పేరు పెట్టినట్లు ఈ జంట ప్రకటించింది.

యశ్ ‘టాక్సిక్’లో కియారా సందడి!

ఇక సినిమాల విషయానికి వస్తే.. కియారా అద్వానీ తదుపరి చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic) విడుదలకు సిద్ధమవుతోంది. కన్నడ స్టార్ హీరో యశ్ సరసన కియారా నటిస్తున్న ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తార సుతారియా వంటి ముద్దుగుమ్మలు కూడా నటిస్తున్నారు.

అయితే, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా యశ్ సినిమా విడుదల తేది మారింది. తొలుత మార్చి 19న 'ధురంధర్: ది రివెంజ్'తో పాటు విడుదల కావాల్సిన యశ్ మూవీని ఇప్పుడు జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాతో యశ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత వెండితెరపై అలరించనున్నాడు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More