Divyanka Sirohi Death: గుండెపోటుతో హీరోయిన్ దివ్యాంక సిరోహి మృతి- 29 ఏళ్లకే హఠాన్మరణం- 50కిపైగా మ్యూజిక్ వీడియోలు!

Actress Divyanka Sirohi Died At Age 29: గుండెపోటుతో హీరోయిన్ దివ్యాంక సిరోహి 29 ఏళ్ల వయసులో మరణించారు. అస్వస్థతకు గురైన దివ్యాంక సిరోహి అకస్మాత్తుగా కుప్పకూలారు. దాంతో ఆమె తలకు తీవ్రమైన గాయం కావడంతో రక్తస్రావం జరిగింది. ఆమె మృతి పట్ల సినీ ఇండస్ట్రీ సంతాపం తెలిపింది.

Published on: Apr 23, 2026, 10:20:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Heroine Divyanka Sirohi Died At Age 29: ప్రముఖ హర్యానవీ హీరోయిన్, సోషల్ మీడియా స్టార్ దివ్యాంక సిరోహి (29) ఘజియాబాద్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. 50కి పైగా మ్యూజిక్ వీడియోల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన దివ్యాంక సిరోహి మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

గుండెపోటుతో హీరోయిన్ దివ్యాంక సిరోహి మృతి- 29 ఏళ్లకే హఠాన్మరణం- 50కిపైగా మ్యూజిక్ వీడియోలు!
గుండెపోటుతో హీరోయిన్ దివ్యాంక సిరోహి మృతి- 29 ఏళ్లకే హఠాన్మరణం- 50కిపైగా మ్యూజిక్ వీడియోలు!

హర్యానవీ మ్యూజిక్ ఇండస్ట్రీలో

హర్యానవీ మ్యూజిక్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంక సిరోహి మరణ వార్త అభిమానులను కలిచివేస్తోంది. మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి ఘజియాబాద్ రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని తన ఇంట్లో దివ్యాంక ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

దివ్యాంక సోదరుడు హిమాన్షు తెలిపిన వివరాలు

దివ్యాంక సోదరుడు హిమాన్షు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కింద పడిపోయారు. ఆ సమయంలో తలకు తీవ్రమైన గాయం కావడంతో పాటు రక్తస్రావం జరిగింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే దివ్యాంక మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బుధవారం (ఏప్రిల్ 22) ఉదయం ఘజియాబాద్‌లో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. అయితే, దివ్యాంక గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.

సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి: ఏఐసీడబ్ల్యూఏ నివాళులు

దివ్యాంక సిరోహి అకాల మరణం పట్ల ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించింది. "కేవలం 29 ఏళ్ల వయసులోనే దివ్యాంక మనల్ని విడిచి వెళ్లడం అత్యంత బాధాకరం. ఇది ఆమె కుటుంబానికే కాకుండా మొత్తం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఒక కళాకారుడి కష్టాలు, కలలు మరో కళాకారుడికి మాత్రమే అర్థమవుతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం" అని అసోసియేషన్ పేర్కొంది.

వైరల్ వీడియోతో వెలుగులోకి..

హర్యానా చిత్ర పరిశ్రమలో తన అంకితభావంతో దివ్యాంక సిరోహి చెరగని ముద్ర వేసిందని అసోసియేషన్ కొనియాడింది. ఇదిలా ఉంటే, సాధారణ ఉద్యోగం వదిలి కళారంగంపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దివ్యాంక ప్రయాణం స్ఫూర్తిదాయకం. సునందా శర్మ పాడిన 'మేరీ మమ్మీ ను పసంద్ నీ తూ' పాటకు ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ తెచ్చుకున్నారు.

కోట్లలో ఫాలోయింగ్

దాదాపు 50కి పైగా హర్యానవీ పాటల్లో దివ్యాంక సిరోహి నటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దివ్యాంక సిరోహికి 13 లక్షల (1.3 Million) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. మాసూమ్ శర్మ, అమిత్ సైనీ రోహ్తకియా వంటి ప్రముఖ సింగర్లతో కలిసి పనిచేసి మాస్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

అప్పట్లో పెద్ద సెన్సేషన్

సిర్సాలోని జేసీడీ కాలేజీలో మాసూమ్ శర్మతో కలిసి దివ్యాంక సిరోహి ఇచ్చిన లైవ్ పర్ఫామెన్స్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఆమె ఇలా మరణించడం తీరని విషాదమని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. దివ్యాంక సిరోహి మరణానికి కారణం ఏంటి?

దివ్యాంక హఠాత్తుగా ఇంట్లో కింద పడిపోవడంతో తలకు గాయమై మరణించారని ఆమె సోదరుడు తెలిపారు. అయితే పూర్తిస్థాయి వైద్య నివేదికలు రావాల్సి ఉంది.

2. దివ్యాంక సిరోహి ఏ ఇండస్ట్రీకి చెందిన నటి?

ఆమె హర్యానవీ మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి, డ్యాన్సర్.

3. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎంత?

దివ్యాంకకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల (13 లక్షల) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె చేసే ప్రతి వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండేది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More