Genelia Son Rahyl: సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ జెనీలియా కొడుకు- ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన రాజా శివాజీ ట్రైలర్!
Genelia Son Rahyl Deshmukh Debut Raja Shivaji Trailer: తెలుగు స్టార్ హీరోయిన్ జెనీలియా కొడుకు రాహిల్ దేశ్‌ముఖ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా తన తండ్రి రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా, స్వీయ దర్శకత్వం వహించిన సినిమా కావడం విశేషం. తాజాగా రాజా శివాజీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈవెంట్ నిర్వహించారు.
Genelia Son Rahyl Deshmukh Debut Raja Shivaji Trailer: టాలీవుడ్‌లో హాసినీగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ జెనీలియా. ఇటీవలే తెలుగులో జూనియర్ సినిమాలో ఓ కీలక పాత్రతో అలరించిన జెనీలియా ఇప్పుడు తన కొడుకును సినిమాల్లోకి దింపుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో జెనీలియాతోపాటు ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్, కొడుకు మొత్త ఫ్యామిలీ అంతా కలిసి నటించడం విశేషం.

రితేష్ దేశ్‌ముఖ్ కలల ప్రాజెక్ట్
ఆ సినిమానే రాజా శివాజీ. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ తన కలల ప్రాజెక్ట్ చిత్రమే ఈ 'రాజా శివాజీ'. ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఈ చిత్రానికి స్వయంగా దర్శకత్వం కూడా వహించడం మరో విశేషం. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా రాజా శివాజీ ట్రైలర్ లాంచ్ వేడుక ముంబైలో అట్టహాసంగా జరిగింది.
తండ్రి వారసుడిగా రాహిల్ ఎంట్రీ
ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద ఆకర్షణ రితేష్, జెనీలియా దంపతుల చిన్న కుమారుడు రాహిల్ దేశ్‌ముఖ్. 10 ఏళ్ల రాహిల్ ఈ చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. రాజా శివాజీ ట్రైలర్ ఆరంభంలోనే 'స్వరాజ్యం' గురించి మాట్లాడే బాల శివాజీ పాత్రలో రాహిల్ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
చిన్ననాటి శివాజీ పరాక్రమాన్ని, ఆలోచనలను ప్రతిబింబించే సన్నివేశాల్లో రాహిల్ నటన ఆకట్టుకునేలా ఉంది. సాధారణంగా స్టార్ కిడ్స్ గ్లామరస్ రోల్స్‌తో ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, రాహిల్ ఇలాంటి చారిత్రాత్మక పాత్రను ఎంచుకోవడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్వేగానికి లోనైన రితేష్, జెనీలియా
ఇక రాజా శివాజీ ట్రైలర్ లాంచ్ వేడుకలో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ సినిమా కోసం తనకు అండగా నిలిచిన మిత్రులు సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
"అభిషేక్ నాకు సోదరుడిలా నిలబడ్డారు. ఈ ప్రయాణంలో మా టీమ్ పడ్డ కష్టం మాటల్లో చెప్పలేనిది" అంటూ రితేష్ కన్నీరు పెట్టుకున్నారు. నిర్మాతగా వ్యవహరించిన జెనీలియా కూడా ఈ వేదికపై ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. శివాజీ భార్య సాయిబాయి పాత్రలో జెనీలియా నటిస్తుండగా, మొఘలులతో శివాజీ సాగించిన వీరోచిత పోరాటాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.
పిల్లల భవిష్యత్తుపై రితేష్ క్లారిటీ
తన పిల్లలు రాహిల్, రియాన్ భవిష్యత్తు గురించి రితేష్ గతంలోనే ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "పిల్లలు ఏమవ్వాలి అనేది తల్లిదండ్రులు నిర్ణయించకూడదు. వారు ఏ వృత్తిని ఎంచుకోవాలనేది వారి ఇష్టానికే వదిలేయాలి. కేవలం ప్రోత్సహించడం మాత్రమే మన బాధ్యత" అని రితేష్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.
తండ్రి మాటలనే స్ఫూర్తిగా
తండ్రి మాటలనే స్ఫూర్తిగా తీసుకున్న రాహిల్ దేశ్‌ముఖ్ ఇప్పుడు నటన వైపు అడుగులు వేస్తున్నారు. బయట మీడియా ముందు ఎంతో వినయంగా నమస్కరిస్తూ కనిపించే రాహిల్ తెరపై బాల యోధుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారీ తారాగణం.. మే 1న విడుదల
కాగా రాజా శివాజీ చిత్రంలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ వంటి అగ్ర నటులతో పాటు మహేష్ మంజ్రేకర్, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే వంటి భారీ తారాగణం నటిస్తోంది. జ్యోతి దేశ్ పాండే, జెనీలియా దేశ్‌ముఖ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరాఠా వీరుడి పోరాట పటిమను నేటి తరానికి చాటిచెప్పేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


