ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ డేట్.. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే మూవీ డిజిటల్ ప్రీమియర్ ఆరోజేనా?
రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది. నవంబర్ 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఈ నెల చివర్లో డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ సినిమా రానుంది.
ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' థియేట్రికల్ రన్ ముగించుకుని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. నవంబర్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 25న అంటే క్రిస్మస్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఆంధ్రా కింగ్ తాలూకా డిజిటల్ ప్రీమియర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి మరో నిరాశనే మిగిల్చిన మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమా వెనుకబడిపోయింది. దీంతో నెల రోజుల్లోపే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ఆంధ్రా కింగ్ తాలూకా బాక్సాఫీస్ రిపోర్ట్
నవంబర్ 27న విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుంచి పర్వాలేదనిపించే స్పందన వచ్చింది. కానీ కమర్షియల్ గా మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తొలి రోజు రూ. 4.15 కోట్లతో మొదలు పెట్టింది. ఆదివారం నాటికి కాస్త పుంజుకుని రూ. 3.7 కోట్లు రాబట్టినా.. సోమవారం నుంచి వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
మొత్తంగా 15 రోజుల్లో ఈ సినిమా ఇండియాలో కేవలం రూ. 23.1 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేయగలిగింది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పాచిగొళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
సాగర్ (రామ్) అనే యువకుడు, సినిమా స్టార్ 'ఆంధ్రా కింగ్' సూర్య కుమార్ కు వీరాభిమాని. తన అభిమాన హీరో చుట్టూ తిరిగే సాగర్ జీవితం, ఆ పిచ్చి ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే కథ.
రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో మెరిశారు. రావు రమేష్, మురళి శర్మ, సత్య ఇతర పాత్రల్లో నటించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందించగా, సిద్ధార్థ్ నూని సినిమాటోగ్రఫీ అందించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


