రామ్ పోతినేనికి కలెక్షన్ కష్టాలు-ఆంధ్ర కింగ్ తాలూకాకు పాజిటివ్ టాక్-కానీ వసూళ్లు మాత్రం అంతంతే! తేడా ఎక్కడ?
వరుస ఫ్లాప్ లతో ఉక్కిరిబిక్కిరైన రామ్ పోతినేని లేటెస్ట్ గా ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ వచ్చాడు. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకేముంది రామ్ హిట్ ట్రాక్ ఎక్కాడనే అనుకున్నారు. కానీ కొత్తగా కలెక్షన్ కష్టం మొదలైంది.
ఇన్ని రోజులు హిట్ కష్టాలు పడ్డ రామ్ పోతినేనికి ఇప్పుడు మరో కష్టం వచ్చేసింది. ఆంధ్ర కింగ్ తాలూకాతో రామ్ హిట్ ట్రాక్ ఎక్కాడని ఫ్యాన్స్ సంబరపడ్డారు. మా స్టోరీనే అంటూ ప్రతి ఫ్యాన్ ఫీల్ అయ్యాడు. కానీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. రీసెంట్ గా మూవీ సక్సెస్ మీట్ లోనూ హీరో రామ్ పోతినేని ఇదే విషయంలో తన ఫీలింగ్స్ బయటపెట్టాడు.

ఆంధ్ర కింగ్ తాలూకా కలెక్షన్లు
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. డిసెంబర్ 27న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమాకు ఇటు సోషల్ మీడియాలో, అటు రివ్యూల్లో పాజిటివ్ టాక్ వినిపించింది. కానీ కలెక్షన్లు మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి.
ఇప్పటికీ ఈ సినిమా వసూళ్లు ఇండియాలో రూ.20 కోట్లకు కూడా చేరలేదు. అయిదు రోజుల్లో ఇండియాలో ఈ సినిమా రూ.15.9 కోట్లు నెట్ వసూళ్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ కలెక్షన్లు రూ.23.15 కోట్లు మాత్రమే.
మరీ దారుణంగా
సాధారణంగా ఏ సినిమాకైనా ఓపెనింగ్ వసూళ్లు అదిరిపోతాయి. ఇక పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం కలెక్షన్ల మోత మోగిపోతుంది. చిన్న సినిమాలే ఈ రోజుల్లో వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. అలాంటిది రామ్ పోతినేని లాంటి హీరో, మంచి టాక్ వచ్చిన మూవీ అయినా ఆంధ్ర కింగ్ తాలూకాకు కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి.
ఇవే కారణాలు
మహేష్ బాబు.పి డైరెక్షన్ లో వచ్చింది ఆంధ్ర కింగ్ తాలూకా. ఇందులో ఉపేంద్ర మరో కీ రోల్ ప్లే చేశారు. టీజర్, ట్రైలర్, పాటలు మూవీపై హైప్ పెంచాయి. కానీ ఇప్పుడు కలెక్షన్ల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఇందుకు రెండు కారణాలు చెప్పుకోవచ్చు.
సాధారణంగా నవంబర్ లో సినిమాలు ఎక్కువగా రిలీజ్ కావు. దీన్ని అన్ సీజన్ అంటారు. అయినా తమ మూవీపై నమ్మకంతో ఆంధ్ర కింగ్ తాలూకాను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. మరోవైపు ఈ వారం అఖండ 2 లాంటి భారీ సినిమా రాబోతుంది. ఇలాంటి పెద్ద మూవీ వస్తుందంటే అభిమానుల ఫోకస్ దానిపైనే ఉంటుంది. రామ్ చిత్రానికి వసూళ్లు రాకపోవడానికి ఇదీ ఓ కారణం. మొత్తానికి రాంగ్ టైమ్ కారణంగా ఓ మంచి సినిమా ఆడియన్స్ కు చేరలేకపోతుందనే టాక్ వినిపిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


