Kareena Kapoor: భర్త, కుటుంబంతో ఐపీఎల్ మ్యాచ్‌కు కరీనా కపూర్- చిరాకుతో అరిచేసిన స్టార్ హీరోయిన్- కోపానికి కారణం ఏంటీ?
Kareena Kapoor Angry At IPL 2026 Wankhede: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌ను చూసేందుకు ఫ్యామిలీతో కలిసి వెళ్లిన కరీనా కపూర్ అక్కడ కాసేపు అసహనానికి గురయ్యారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందుకు గల కారణం ఆసక్తిగా మారింది.
ముంబైలోని వాంఖడే స్టేడియం ఆదివారం (ఏప్రిల్ 12) సాయంత్రం తారల మెరుపులతో మెరిసిపోయింది. ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తన భర్త, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జెహ్‌తో కలిసి హాజరయ్యారు. సైఫ్ పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా వారితో ఉన్నారు. వీరంతా ముంబై ఇండియన్స్ జెర్సీలు ధరించి టీమ్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించారు. అయితే ఈ ఆనందకరమైన వాతావరణంలో ఒక చిన్న ఘటన కరీనా మూడ్‌ను మార్చేసింది.

లిఫ్ట్ వద్ద అసహనం.. అసలేం జరిగింది?
స్టేడియంలోని లిఫ్ట్ కోసం వేచి చూస్తున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా కరీనా కపూర్ కుటుంబం చుట్టూ చేరారు. సెల్ఫీల కోసం ఎగబడటంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఆ తోపులాటలో కరీనా కపూర్ విపరీతమైన అసహనానికి లోనయ్యారు. తన టీమ్ మెంబర్ లేదా స్టాఫ్ పట్ల కరీనా కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏదో అరవడం కెమెరాల్లో రికార్డ్ అయింది.
"అసలు ఏం జరుగుతోంది ఇక్కడ?" అని భర్త సైఫ్ అలీ ఖాన్‌ను కరీనా కపూర్ ప్రశ్నిస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే కాసేపటికే ఆమె తేరుకుని స్టేడియంలో మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ కనిపించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
హోరాహోరీ పోరులో బెంగళూరు విజయం
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన ఈ పోరు అభిమానులను ఊరించింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. కరీనా కపూర్ ఫ్యామిలీ ముంబైకి మద్దతుగా నిలిచినప్పటికీ, ఆర్సీబీ ఆధిపత్యం చాటుకుంది.
కరీనా కొత్త ప్రాజెక్టులు ఇవే..
సినిమాల విషయానికి వస్తే, కరీనా కపూర్ ప్రస్తుతం మేఘనా గుల్జార్ దర్శకత్వంలో 'దాయరా' (Daayra) అనే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఒక దారుణమైన ఘటన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, నైతిక విలువలు ఎలా మారుతాయి అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 2026లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అంతకుముందు వచ్చిన 'క్రూ' (Crew), 'ది బకింగ్‌హామ్ మర్డర్స్' చిత్రాలతో కరీనా ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


