MI IPL 2026: 14 ఏళ్ల వనవాసానికి విముక్తి- ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ రికార్డ్ బ్రేకింగ్ విజయం-స్టైల్ మార్చిన రోహిత్ శర్మ!
MI vs KKR IPL 2026: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. 14 ఏళ్లుగా వస్తున్న ఓపెనింగ్ మ్యాచ్ ఓటముల సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ బ్యాటింగ్ హైలెట్ అయింది.
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అంటేనే ‘స్లో స్టార్టర్స్’ అనే ముద్ర ఉంది. 2012 నుంచి ఇప్పటివరకు ఒక్క సీజన్‌లో కూడా ముంబై తమ మొదటి మ్యాచ్ గెలిచిన దాఖలాలు లేవు. కానీ, ఆదివారం (మార్చి 29) వాంఖడే స్టేడియంలో జరిగిన పోరులో హార్దిక్ సేన ఆ రెండు దశాబ్దాల శాపాన్ని చెరిపివేసింది. అంటే, ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ గెలవనటువంటి ముంబై ఇండియన్స్ 14 ఏళ్ల వనవాసానికి విముక్తి కలిగింది.

ఐపీఎల్ 2026 రెండో రోజే ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలోనే ఛేదించి, కేకేఆర్‌పై 6 వికెట్ల తేడాతో రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ సాధించింది ముంబై ఇండియన్స్. ముంబై జట్టుకు ఇది రెట్టింపు సంతోషంగా నిలిచింది. ఎందుకంటే గత ఏడు ప్రయత్నాల్లో 220 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ముంబై ఎప్పుడూ ఛేదించలేదు. ఆ అసాధ్యాన్ని ఈసారి సుసాధ్యం చేసింది.
రోహిత్ శర్మ విధ్వంసం.. రియాన్ రికెల్టన్ జోరు!
లక్ష్యం పెద్దదైనా ముంబై బ్యాటర్లలో ఏమాత్రం బెరుకు కనిపించలేదు. ముఖ్యంగా ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ పాత రోజులను గుర్తు చేస్తూ కేకేఆర్ బౌలర్లను చీల్చి చెండాడారు. తన ఫిట్‌నెస్, బ్యాటింగ్ స్టైల్ మార్చి కేవలం 38 బంతుల్లోనే 78 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు రోహిత్ శర్మ.
మరోవైపు రియాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81 పరుగులు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు కేవలం 72 బంతుల్లోనే 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ముంబై వైపునకు వార్ వన్‌సైడ్ చేసేశారు.
కేకేఆర్ బౌలింగ్ బలహీనత..
కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్‌లోకి ప్రధాన బౌలర్లు లేకుండానే బరిలోకి దిగింది. ఆ లోటు మైదానంలో స్పష్టంగా కనిపించింది. వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజరబానీలు ముంబై ఓపెనర్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తి ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, సునీల్ నరైన్ తన పాత వాడిని కోల్పోయినట్లు కనిపించారు. దీంతో ముంబై బ్యాటర్లకు పరుగులు చేయడం నల్లేరు మీద నడకలా మారింది.
వాంఖడేలో పరుగుల వరద..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ పరుగులతో రెచ్చిపోయింది. వాంఖడే పిచ్‌పై గడ్డి ఉండటంతో బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని గ్రహించిన అజింక్యా రహానే (40 బంతుల్లో 67) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
ముంబై కుర్రాడు అంగ్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 51) కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై తరపున అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీసినప్పటికీ పరుగులను కట్టడి చేయలేకపోయారు.
చిన్నబోయిన భారీ లక్ష్యం
అయితే, ముంబై బ్యాటర్ల అద్భుత ఫామ్ ముందు కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. ఐదు బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయాన్ని అందుకుని ఈ ఐపీఎల్ 2026 సీజన్‌ను ఎన్నడులేని విధంగా చాలా గ్రాండ్‌గా మొదలుపెట్టింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


