MI vs KKR IPL 2026: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్- ఆర్సీబీ తరహా వ్యూహం- సరికొత్త రికార్డ్- టీ20లో తొలి ఐపీఎల్ టీమ్‌గా!
MI Vs KKR IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతున్న ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌తో టీ20 ఫార్మాట్‌లో 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది ముంబై ఇండియన్స్. అలా ప్రపంచంలోనే మొదటి ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ టీమ్ చరిత్ర సృష్టించింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ (MI), మరో అరుదైన ఘనతకు చేరువైంది. ఆదివారం (మార్చి 29) సొంత గడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న పోరుతో ముంబై జట్టు టీ20 క్రికెట్‌లో ఒక చారిత్రక మైలురాయిని అధిగమించింది.

ఆర్సీబీ వ్యూహాన్నే
ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోలక్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న రెండో ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్న ఈ జట్టు నిన్న (మార్చి 28) ఆర్సీబీ వ్యవహరించిన వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
300 మ్యాచ్‌ల క్లబ్‌లోకి ముంబై!
ఇదిలా ఉంటే, వాంఖెడే స్టేడియంలో కోల్‌కతాతో తలపడుతున్న ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు 300వ టీ20 మ్యాచ్. ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫార్మాట్‌లో ఈ మార్కును అందుకున్న మొట్టమొదటి ఫ్రాంచైజీ (క్లబ్)గా ముంబై రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు కేవలం పాకిస్థాన్ జాతీయ జట్టు, ఇంగ్లాండ్‌కు చెందిన సోమర్‌సెట్ కౌంటీ జట్లు మాత్రమే 300కు పైగా మ్యాచ్‌లు ఆడాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరిన మూడో జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్లు:
ఐపీఎల్ టోర్నీలోనూ ముంబై ఇండియన్స్ 277 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉంది.
మిగిలిన జట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
ముంబై ఇండియన్స్: 277 మ్యాచ్‌లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): 272 మ్యాచ్‌లు
ఢిల్లీ క్యాపిటల్స్ (DC): 266 మ్యాచ్‌లు
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): 265 మ్యాచ్‌లు
పంజాబ్ కింగ్స్ (PBKS): 263 మ్యాచ్‌లు
ఆరో టైటిల్ వేటలో హార్దిక్ సేన
రోహిత్ శర్మ సారథ్యంలో 2013, 2015, 2017, 2019, 2020లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ గత ఐదేళ్లుగా టైటిల్‌కు దూరమైంది. 2020లో ఢిల్లీని ఓడించి కప్పు గెలిచిన తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో 2025 సీజన్‌లో క్వాలిఫైయర్ 2 వరకు చేరుకున్నప్పటికీ, పంజాబ్ చేతిలో ఓడిపోయి తృటిలో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది.
163 మ్యాచ్‌ల్లో 91 విజయాలు
రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 163 మ్యాచ్‌ల్లో 91 విజయాలు అందించి 58.82 గెలుపు శాతాన్ని నమోదు చేశారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఈ రికార్డు 300వ మ్యాచ్‌ను విజయంతో ప్రారంభించి, ఆరో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని ముంబై ఇండియన్స్ పట్టుదలతో ఉంది. అంతేకాకుండా, గతంలో ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీని కూడా ముంబై రెండుసార్లు (2011, 2013) గెలుచుకోవడం విశేషం.
| Team | Total number of T20 matches |
|---|---|
| Pakistan cricket team | 303 |
| Somerset County Club | 303 |
| Mumbai Indians | 299* (Will be 300 on Sunday night) |
| Hampshire County Cricket Club | 296 |
| Royal Challengers Bengaluru | 287 |
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


