తన గర్ల్‌ఫ్రెండ్ మహీకను ఆ యాంగిల్లో ఫొటో తీయడంపై హార్దిక్ పాండ్యా సీరియస్.. మీడియాకు వార్నింగ్ ఇస్తూ పోస్ట్
హార్దిక్ పాండ్యా మీడియాపై సీరియస్ అయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మను ఓ ఫొటోగ్రాఫర్ చాలా దారుణమైన యాంగిల్ నుంచి ఫొటో తీయడంపై అతడు మండిపడ్డాడు. ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి క్రికెట్ గురించి కాదు.. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన ఫోటోగ్రాఫర్లపై అతడు తీవ్రంగా మండిపడ్డాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ (Mahieka Sharma) ఫోటోలను అభ్యంతరకరమైన యాంగిల్లో తీయడంపై హార్దిక్ తీవ్ర ఆవేదన, కోపాన్ని వ్యక్తం చేశాడు. సెప్టెంబర్ తర్వాత మళ్లీ భారత జట్టులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న హార్దిక్.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా ఒక ఘాటు సందేశాన్ని పోస్ట్ చేశాడు.

హద్దులు దాటారు.. ఇది చీప్ పబ్లిసిటీ
బాంద్రాలోని ఒక రెస్టారెంట్ మెట్లపై మహీకా శర్మ దిగుతున్నప్పుడు ఫోటోగ్రాఫర్లు ఆమె ఫోటోలను తీసిన విధానం హార్దిక్ పాండ్యాకు కోపం తెప్పించింది. దీనిపై ఇన్‌స్టా స్టోరీస్ లో అతడు ఓ పోస్ట్ చేశాడు.
"పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు మాపై నిఘా, ఆసక్తి ఉండటం సహజమేనని నాకు అర్థమవుతుంది. అది నేను ఎంచుకున్న జీవితంలో భాగమే. కానీ ఈరోజు ఒక హద్దు దాటారు. మహీకా బాంద్రాలోని ఒక రెస్టారెంట్ మెట్లు దిగుతుంటే.. ఫొటోగ్రాఫర్లు ఆమెను ఏ మహిళనూ తీయకూడని కోణంలో ఫోటోలు తీశారు. ఒక ప్రైవేట్ మూమెంట్‌ను చీప్ సెన్సేషనలిజం కోసం వాడుకున్నారు" అని హార్దిక్ ఆవేదన వ్యక్తం చేశాడు.
"క్లిక్‌ల కోసం మానవత్వం మర్చిపోకండి"
దేశంలో మహిళల పట్ల మరింత గౌరవప్రదమైన ప్రవర్తన ఉండాలని హార్దిక్ కోరాడు. తాను మీడియాను ఎప్పుడూ గౌరవిస్తానని, కానీ కేవలం వ్యూస్, క్లిక్‌ల కోసం ఇలా చేయడం సరికాదని హితవు పలికాడు.
"ఇది హెడ్‌లైన్స్ గురించో, ఎవరు ఫోటో తీశారనే దాని గురించో కాదు.. ఇది కనీస గౌరవం గురించి. మహిళలకు గౌరవం దక్కాలి. ప్రతి ఒక్కరికీ కొన్ని హద్దులు ఉంటాయి. రోజూ కష్టపడే మీడియా సోదరులకు నా విన్నపం.. మీ కష్టాన్ని నేను గౌరవిస్తాను. ఎప్పుడూ సహకరిస్తాను. కానీ దయచేసి కొంచెం ఆలోచించండి. ప్రతిదీ క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి యాంగిల్‌లోనూ ఫోటోలు తీయకూడదు. ఈ ఆటలో కాస్త మానవత్వాన్ని ఉంచుదాం. ధన్యవాదాలు" అని హార్దిక్ ముగించాడు.
హార్దిక్ - మహీకా లవ్ స్టోరీ
ఈ ఏడాది అక్టోబర్‌లో పుకార్లకు చెక్ పెడుతూ హార్దిక్ పాండ్యా, మహీకా శర్మతో తన రిలేషన్‌షిప్‌ను ధృవీకరించాడు. స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో పాటు, ఆమెను తన "11:11 విష్" అని పిలుస్తూ ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.
ఇటీవల "మై బిగ్ 3" అంటే తన జీవితంలో ముఖ్యమైన ముగ్గురు అంటూ క్రికెట్, తన కొడుకు అగస్త్య, మహీకాలతో ఉన్న ఫోటోలను పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి పూజ చేయడం, వర్కౌట్ చేయడం వంటి ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. గతంలో నటి నటాషా స్టాంకోవిక్‌తో విడిపోయిన హార్దిక్.. ఆమెతో కలిసి కొడుకు అగస్త్య బాధ్యతలను పంచుకుంటున్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


