John Cena Asha Bhosle: గాన గంధర్వి ఆశా భోంస్లే మృతికి హాలీవుడ్ స్టార్ నివాళి.. జాన్ సీనా పోస్ట్‌పై నెటిజన్లు ఫిదా!
John Cena Tribute To Asha Bhosle: భారతీయ సంగీత శిఖరం ఆశా భోంస్లే మృతితో యావత్ ప్రపంచం కన్నీరు మునిగింది. ఆమె అంతిమ యాత్రకు సినీ, రాజకీయ దిగ్గజాలు తరలి వెళ్లారు. అయితే, తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా సింగర్ ఆశా భోంస్లేకు నివాళులు అర్పించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
John Cena Tribute To Asha Bhosle: భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే (92) ఆదివారం (ఏప్రిల్ 12)ముంబైలో కన్నుమూశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆశా భోంస్లే భౌతికకాయానికి ముంబై పోలీసులు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఆశా భోంస్లే మృతి పట్ల దేశవిదేశాల నుంచి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ హాలీవుడ్ నటుడు జాన్ సీనా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
జాన్ సీనా ఇన్ స్టా పోస్ట్: నెటిజన్ల సర్‌ప్రైజ్
ప్రపంచ ప్రసిద్ధ రెజ్లర్, హాలీవుడ్ హీరో జాన్ సీనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆశా భోంస్లే ఫోటోను షేర్ చేస్తూ ఆమెకు నివాళులర్పించారు. సాధారణంగా సీనా తన పోస్టులకు ఎటువంటి క్యాప్షన్లు ఇవ్వరు. ఈసారి కూడా అలాగే మౌనంగానే తన గౌరవాన్ని చాటుకున్నారు. ఒక అంతర్జాతీయ స్టార్, భారతీయ దిగ్గజ గాయనిని స్మరించుకోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
"అందుకే మిమ్మల్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) అని పిలుస్తాం," అంటూ భారతీయ అభిమానులు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. భారత్ అంటే జాన్ సీనాకు ఉన్న ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒక దిగ్గజానికి మరొక దిగ్గజం ఇచ్చే అత్యున్నత గౌరవం ఇదేనని అభిమానులు కొనియాడుతున్నారు.
కన్నీటి వీడ్కోలు పలికిన సినీ లోకం
ఆశా భోంస్లే అంతిమ దర్శనం కోసం ముంబైలోని ఆమె నివాసానికి సెలబ్రిటీలు పోటెత్తారు. సచిన్ టెండూల్కర్, టబు, రణ్‌వీర్ సింగ్, రితేష్ దేశ్‌ముఖ్ వంటి ప్రముఖులు ఆశా మనవరాలు జనాయ్ భోంస్లేను పరామర్శిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. షారుఖ్ ఖాన్, మనోజ్ బాజ్‌పాయ్, కంగనా రనౌత్, హేమమాలిని వంటి తారలు సోషల్ మీడియా వేదికగా తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
శివాజీ పార్క్‌లో జరిగిన అంత్యక్రియలకు అమిర్ ఖాన్, విక్కీ కౌశల్, జాకీ ష్రాఫ్ వంటి బాలీవుడ్ ప్రముఖులతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే వంటి రాజకీయ ఉద్ధండులు హాజరై నివాళులర్పించారు. ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఎనిమిది దశాబ్దాల ప్రస్థానం.. మరువలేని గీతాలు
1940లలో కెరీర్ ప్రారంభించిన ఆశా భోంస్లే, వేల సంఖ్యలో పాటలు పాడి రికార్డు సృష్టించారు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం వంటి అనేక భారతీయ భాషల్లో ఆమె అద్భుతమైన పాటలు పాడారు. 'దిల్ చీజ్ క్యా హై', 'ఇన్ ఆంఖోన్ కీ మస్తీ' వంటి క్లాసిక్ గీతాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
భారత ప్రభుత్వం ఆమెను 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డుతో గౌరవించింది. అలాగే 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషణ్' ఆశా భోంస్లేను వరించింది. ఆమె మరణం భారతీయ కళా రంగానికి తీరని లోటని సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


