TV & OTT: అటు బుల్లితెర, ఇటు ఓటీటీలో వీకెండ్ వినోదం- ఈ 2 ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బెస్ట్ ఆప్షన్- అది ఎలాగంటే?
Drama Juniors Season 9 Launch OTT And Champion TV Premiere: ఈ వారం ఇటు ఓటీటీలో, అటు బుల్లితెరపై వీకెండ్ వినోదం సిద్ధమైంది. ఈ రెండు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బెస్ట్ ఆప్షన్ కానున్నాయి. డ్రామా జూనియర్స్ 9 గ్రాండ్ లాంచ్ ఓటీటీ స్ట్రీమింగ్‌తోపాటు రోషన్ మేక ఛాంపియన్ టీవీ ప్రీమియర్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
This Weekend Entertainment On OTT And TV: సరికొత్త కార్యక్రమాలు, సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని పంచుతున్న జీ తెలుగు టీవీ ఛానెల్ ఈ వీకెండ్ మరిన్ని కార్యక్రమాలతో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ఆరంభం నుంచి అశేష ప్రేక్షకాదరణ పొందుతున్న డ్రామా జూనియర్స్ రియాలిటీ షో మరో సీజన్‌తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.

జీ5 ఓటీటీలో
ఈ వారాంతంలో (వీకెండ్‌లో) డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ కానుంది. దాంతోపాటు హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక నటించిన ఛాంపియన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో ప్రేక్షకులను అలరించనుంది మీ జీ తెలుగు. డ్రామా జూనియర్స్ సీజన్ 9 జీ5 (ZEE5)లో ఓటీటీ రిలీజ్ కానుంది.
డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఓటీటీ స్ట్రీమింగ్
మే 21 నుంచి జీ5లో డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత మే 23 నుంచి ప్రతి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు జీ తెలుగులో టీవీ ప్రీమియర్ కానుంది. గత ఎనిమిది సీజన్లలో యువ నటీనటులను తెరపైకి తీసుకువచ్చి, వారి జీవితాలను మార్చిన డ్రామా జూనియర్స్, తెలుగు టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిల్డ్రన్స్ రియాలిటీ షోగా నిలిచింది.
యాంకర్ సుధీర్ హోస్ట్‌గా
భావోద్వేగాలు, అద్భుతమైన ప్రదర్శనలు, స్ఫూర్తిదాయకమైన ప్రయాణాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ షో, అనేక మంది యువ నటులను సినిమా, టెలివిజన్ రంగాలకు అందించింది. ఈ 9వ సీజన్‌కు ప్రముఖ యాంకర్ సుధీర్ హోస్ట్‌గా వ్యవహరించనుండగా, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సీనియర్ హీరోయిన్ ఆర్కే రోజా, హీరో శ్రీకాంత్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.
మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్
ఆకట్టుకునే చిన్నారుల ప్రదర్శనలు, ఆసక్తికరమైన సంభాషణలతో ప్రేక్షకులను మెప్పించేందుకు డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఘనంగా ప్రారంభం కానుంది. అలాగే, ఈ వీకెండ్ వినోదానికి అదనంగా, రైజింగ్ స్టార్ రోషన్ మేక, మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ సినిమాను వరల్డ్ టీవీ ప్రీమియర్‌గా అందించనున్నారు.
ఛాంపియన్ టీవీ ప్రీమియర్ డేట్
ఆదివారం (మే 24) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ఛాంపియన్ సినిమా టీవీ ప్రీమియర్ అవనుంది. యాక్షన్, భావోద్వేగాలు, మాస్ అప్పీల్ నిండిన ఈ చిత్రం యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించే సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించింది.
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బెస్ట్ ఆప్షన్స్
ఇలా డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్, ఛాంపియన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో అటు బుల్లితెర, ఇటు ఓటీటీలో ఈ వీకెండ్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బెస్ట్ ఆప్షన్స్‌గా జీ తెలుగు టీవీ ఛానెల్ సర్‌ప్రైజ్ ట్రీట్ అందిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


