ఓటీటీలోకి హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ- 7.5 రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక నటించిన తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా మూవీ ఛాంపియన్ స్ట్రీమింగ్ కానుంది. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా చేసిన ఈ మూవీకి 7.5 రేటింగ్ వచ్చింది. మరి ఛాంపియన్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటీ, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం.
నిర్మల కాన్వెంట్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక. ఆ తర్వాత పెళ్లి సందD సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మేక రోషన్ చాలా కాలం గ్యాప్‌తో మరో మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఆ సినిమానే ఛాంపియన్.

పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా
తెలుగులో హిస్టారికల్ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కిన ఛాంపియన్ సినిమాలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది అనస్వర రాజన్. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం, రుతమ్ సమర్ కథ అందించారు.
మిక్కీ జే మేయర్ సంగీతం
అలాగే, ప్రదీప్ అద్వైతం ఛాంపియన్ సినిమాకు దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఛాంపియన్ మూవీలో హీరో హీరోయిన్లతోపాటు కల్యాణ్ చక్రవర్తి, రచ్చ రవి, బలగం సంజయ్, కెకె మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
చైల్డ్ ఆర్టిస్ట్ స్పెషల్ సాంగ్
స్పెషల్ సాంగ్‌తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న అవంతిక వందనపు అట్రాక్ట్ చేసింది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఛాంపియన్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొన్ని ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ స్లో నెరేషన్ అంటూ విమర్శకులు పెదవి విరిచారు.
ఛాంపియన్ రేటింగ్
కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం ఛాంపియన్ సినిమాకు పదికి 7.5 రేటింగ్ ఉంది. ఇలాంటి రెస్పాన్స్ తెచ్చుకున్న ఛాంపియన్ ఓటీటీలోకి వచ్చేయనుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఛాంపియన్ ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు ఇదివరకే టాక్ నడిచింది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి
ఇటీవల ఛాంపియన్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈ సంస్థ. అయితే, జనవరి 23న ఛాంపియన్ ఓటీటీ రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం వంటి నాలుగు భాషల్లో ఛాంపియన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇంకో నాలుగు రోజుల్లో ఓటీటీలోకి ఛాంపియన్ వచ్చేయనుందని తెలుస్తోంది.
ఛాంపియన్ శాటిలైట్ రైట్స్
అలాగే, ఛాంపియన్ శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ జీ తెలుగు దక్కించుకుంది. ఓటీటీ రిలీజ్ తర్వాత జీ తెలుగు ఛానెల్‌లో ఛాంపియన్ టీవీ ప్రీమియర్ అవనుంది. ఇదిలా ఉంటే, ఛాంపియన్ సినిమా 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిజాం నిరంకుశ పాలనలో హైదరాబాద్ సంస్థాన పరిస్థితుల కాలంలో తెరకెక్కింది.
ఛాంపియన్ కథ
సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్ (రోషన్ మేక)కు ఫుట్‌బాల్ అంటే ప్రాణం. ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉండిపోవాలని కలలు కంటాడు. . అయితే, మైఖేల్ తండ్రి చేసిన ఓ తప్పు కారణంగా మైఖేల్ ఆయుధాలు డెలివరీ చేసే పనిలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏమైందనేదే ఛాంపియన్ కథ.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


