OTT: అమెజాన్ ప్రైమ్‌లోకి మరో సూపర్ హిట్ సిరీస్ సీజన్ 2-గ్రామంలో చికిత్సాలయం, డాక్టర్‌కు తంటాలు-240 దేశాల్లో ఓటీటీ రిలీజ్
Gram Chikitsalay Season 2 OTT Streaming On Amazon Prime: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి మరో సూపర్ హిట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2 వచ్చేయనుంది. ఓ గ్రామంలో ప్రాథమిక కేంద్రం పెట్టిన తర్వాత డాక్టర్ పడే తంటాలతో ఈ సిరీస్ సాగనుంది. గ్రామ్ చికిత్సాలయ్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఏంటో చూద్దాం.
Gram Chikitsalay Season 2 OTT Release Amazon Prime: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో సహజత్వానికి దగ్గరగా ఉండే కథలకు, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న సిరీస్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 'పంచాయత్' వంటి ఓటీటీ సిరీస్‌ల ఘన విజయమే దీనికి నిదర్శనం.

ప్రైమ్ ఓటీటీ ఒరిజినల్ సిరీస్
అదే బాటలో అమెజాన్ ప్రైమ్ వీడియో తమ హిట్ ఒరిజినల్ ఓటీటీ సిరీస్ 'గ్రామ్ చికిత్సాలయ్' (Gram Chikitsalay- గ్రామ చికిత్సాలయం) రెండో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ 'ది వైరల్ ఫీవర్' (TVF) ఈ ఓటీటీ సిరీస్ గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2ని నిర్మించింది. మొదటి సీజన బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సీజన్ 2పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
భత్కండికి తిరిగొచ్చిన డాక్టర్ ప్రభాత్
తొలి సీజన్‌లో ఊహాజనిత గ్రామమైన 'భత్కండి'లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ని బాగుచేసే బాధ్యతను డాక్టర్ ప్రభాత్ (అమోల్ పరాశర్) భుజాన వేసుకున్నారు. రెండో సీజన్ కథ అక్కడి నుంచే మొదలవుతుంది. గ్రామస్థుల అనుమానాలను పటాపంచలు చేసి వారి నమ్మకాన్ని గెలుచుకోవడానికి డాక్టర్ ప్రభాత్ పడే పాట్లు, ప్రతి అడుగులోనూ ఎదురయ్యే కొత్త సవాళ్లు ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
వైద్య విజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదని, గ్రామీణ ప్రాంతంలో ఆసుపత్రిని నడపడానికి ఆదర్శాలకు, వాస్తవాలకు మధ్య ఉండే ఘర్షణను అర్థం చేసుకోవాలని డాక్టర్ ప్రభాత్ తెలుసుకునే క్రమాన్ని దర్శకుడు లలితమ్ తివారీ చాలా హృద్యంగా ఆవిష్కరించారు.
వీరే ప్రధాన తారాగణం
తొలి సీజన్‌లో అలరించిన తారాగణమే ఈ రెండో సీజన్‌లోనూ కొనసాగుతోంది. డాక్టర్ ప్రభాత్‌గా అమోల్ పరాశర్ నటించగా.. ఆకాష్ మఖిజా, ఆనందేశ్వర్ ద్వివేది, వినయ్ పాఠక్, ఆకాంక్ష రంజన్ కపూర్, గరిమ విక్రాంత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సీజన్‌లో కొత్తగా ప్రముఖ నటుడు దినేష్ లాల్ యాదవ్ చేరడం విశేషం. వైభవ్ సుమన్, శ్రేయ శ్రీవాస్తవ ఈ ఓటీటీ సిరీస్‌కు కథను అందించారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
అమెజాన్ ప్రైమ్‌లో గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 23, 2026న అమెజాన్ ప్రైమ్‌లో గ్రామ్ చికిత్సాలయ్ 2 ఓటీటీ రిలీజ్ అవనుంది. దీనికి సంబంధించిన విషయాన్ని తాజాగా ఇవాళ (జూన్ 4) ప్రకటించారు.
240కిపైగా దేశాల్లో ఓటీటీ రిలీజ్
ఈ ప్రైమ్ ఒరిజినల్ ఓటీటీ సిరీస్ జూన్ 23న హిందీ భాషలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో ప్రత్యేకంగా ప్రీమియర్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లోని అమెజాన్ ప్రైమ్ చందాదారులు కూడా ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు.
గ్రామీణ వైద్య విధానంలోని లోపాలను, అక్కడి ప్రజల జీవన విధానాన్ని చాలా సహజంగా, హాస్యంగా చూపించడం వల్ల ఈ సిరీస్ తెలుగు ఓటీటీ ఆడియెన్స్‌కు కూడా చాలా దగ్గరగా అనిపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఓటీటీ వర్గాల స్పందన
ఈ ఓటీటీ సిరీస్ గురించి అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా కంటెంట్ లైసెన్సింగ్ హెడ్ మనీష్ మెంగళాని మాట్లాడుతూ.. "ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. ఇప్పుడు పట్టణ కథలతో పాటు గ్రామీణ భారతదేశానికి సంబంధించిన కథలకు కూడా ఆదరణ పెరుగుతోంది" అన్నారు.
"'గ్రామ్ చికిత్సాలయ్' తొలి సీజన్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి, ఈ గ్రామీణ కామెడీ డ్రామా తదుపరి భాగాన్ని తీసుకురావడానికి మేము చాలా సంతోషిస్తున్నాము" అని మనీష్ మెంగళాని పేర్కొన్నారు. టీవీఎఫ్‌తో తమకున్న అనుబంధం ద్వారా ఇలాంటి భావోద్వేగపూరితమైన కథలను ప్రేక్షకులకు అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఓటీటీలోకి రూరల్ కామెడీ డ్రామా
చివరిగా, హాస్యం, ఎమోషన్, సామాజిక అంశాల సమ్మేళనంగా ఓటీటీలోకి రానున్న గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2.. గ్రామీణ జీవనవిధానాన్ని, అక్కడి ప్రజల పట్టుదలను, ప్రేమానురాగాలను మరోసారి డిజిటల్ స్క్రీన్‌పై ఆవిష్కరించనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


