Peddi OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ థియేటర్లలో రిలీజైన పెద్ది- రామ్ చరణ్ జాన్వీ కపూర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Ram Charan Peddi OTT Streaming Details: రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పెద్ది ఇవాళ (జూన్ 4) థియేటర్లలో విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంటోన్న పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఆసక్తిగా మారాయి. మరి పెద్ది ఓటీటీ ఏంటో లుక్కేద్దాం.
Ram Charan Peddi OTT Streaming Platform Details: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బాలీవుడ్ బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా పెద్ది. 'ఉప్పెన' సినిమాతో సెన్సేషన్ సృష్టించిన బుచ్చిబాబు సాన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ డీటేల్స్
తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పెద్ది సినిమా ఇవాళ (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా, ఎన్నో అంచనాల నడుమ చాలా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అయింది. అయితే, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది పెద్ది మూవీ. ఈ నేపథ్యంలో పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.
రంగస్థలం తర్వాత మళ్లీ..
రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోకు ఇది రెండో సినిమా అవుతుంది. రంగస్థలం సినిమాకు బుచ్చిబాబు అసోసియేట్ దర్శకుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఉప్పెనతో దర్శకుడిగా మారారు. ఇప్పుడు రామ్ చరణ్ తో డైరెక్ట్‌గా పనిచేయడం వారి కాంబినేషన్‌పై భారీ అంచనాలు పెంచింది.
అణచివేతపై పెద్దిగాడి కుస్తీ
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో గుర్తింపు కోసం పోరాటం చేసే ఆట కూలీగా రామ్ చరణ్ కనిపించాడు. ఇది ఒక పల్లెటూరి నేపథ్యంతో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. పెద్ది అనే ఒక నిరుపేద యువకుడు క్రికెట్, కుస్తీ వంటి వివిధ క్రీడలలో అద్భుతమైన ప్రతిభను చూపిస్తాడు. తన క్రీడా నైపుణ్యంతో సమాజంలో అణచివేతకు గురవుతున్న వారి కోసం అతను ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా కథ. అంటే క్రీడలతో కూడిన సామాజిక కథాంశంతో ఈ సినిమా వచ్చింది.
ఆ 50 నిమిషాలు మాత్రం..
పెద్ది సినిమాపై అంచనాలు పెంచుతూ దర్శకుడు బుచ్చిబాబు సాన గతంలో గుల్టేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. "సినిమా చివరి 50 నిమిషాలు ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆ ఎమోషనల్ సీన్లు చాలా షాకింగ్‌గా, బరువెక్కిన గుండెతో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వచ్చేలా ఉంటాయి. ఆ ముగింపు సీన్లు మిమ్మల్ని చాలా కాలం వెంటాడుతాయి. ఒక గొప్ప సినిమా చూశామనే ఫీలింగ్ వారికి కలుగుతుంది" అని ఆయన పేర్కొన్నారు.
బాడీ లాంగ్వేజ్‌తోనే
ఈ మాటలతో రామ్ చరణ్ అభిమానులు మరింత ఉత్కంఠగా పెద్ది సినిమా కోసం ఎదురుచూశారు. వారికి అంచనాలకు తగినట్లుగానే పెద్ది మూవీకి మంచి టాక్ వస్తోంది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని, బాడీ లాంగ్వేజ్‌తోనే ఇరగదీశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పెద్ది ఓటీటీ డీల్ ఫిక్స్
ఇలాంటి సమయంలో పెద్ది ఓటీటీలోకి వస్తుందనే విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే, థియేట్రికల్ రిలీజ్ కాకముందుగానే పెద్ది ఓటీటీ డీల్ ఫిక్సయిపోయింది. పెద్ది ఓటీటీ హక్కులను దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ. 105 నుంచి 130 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుందని సమాచారం. దీన్నిబట్టి నెట్‌ఫ్లిక్స్‌లోనే పెద్ది ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ లెక్కన జూన్ 4 తర్వాత నాలుగు వారాల తర్వాత పెద్ది ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్‌ను స్ట్రీమింగ్‌కు కొద్దిరోజుల ముందు ప్రకటించనున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


