OTT Trailer: సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ట్రైలర్ రిలీజ్- 2 విభిన్న ప్రపంచాలు, మధ్యలో ఇంద్రుడు- ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Save The Tigers Season 3 OTT Trailer Released: ఓటీటీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ నుంచి మూడో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రెండు విభిన్న ప్రపంచాల మధ్య జరిగే కథతో మగాళ్లకు కనెక్ట్ అయ్యే డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ సాగింది.

Published on: May 30, 2026, 20:59:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Save The Tigers Season 3 OTT Trailer Released: సూపర్ హిట్ తెలుగు ఓటీటీ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇప్పటికే సేవ్ ది టైగర్స్ నుంచి వచ్చిన రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. సేవ్ ది టైగర్స్ 3 ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ట్రైలర్ రిలీజ్- 2 విభిన్న ప్రపంచాలు, మధ్యలో ఇంద్రుడు- ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ట్రైలర్ రిలీజ్- 2 విభిన్న ప్రపంచాలు, మధ్యలో ఇంద్రుడు- ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్ రిలీజ్

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా, వినోదభరితంగా సాగింది. ఈ సీజన్ 3లో ఇంద్రుడిగా స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు గత రెండు సీజన్లలో భార్యల వల్ల నలిగే భర్తలను చూపించారు. కానీ, ఈసారి సేవ్ ది టైగర్స్ సీజన్ 3లో మరో లోకంలో భార్యలను ఏమార్చి జల్సాలు చేసుకునే భర్తలను చూపించారు.

సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్‌లోకి వెళితే.. ‘ఎవరన్నా.. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి మనకు ఇన్ని అబద్దాలు చెప్పింది.. పెళ్లి అంటే పండు వెన్నెల, పెళ్లాం అంటే నిండు పున్నమి’ అని రాహుల్ పాత్రలో అభినవ్ గోమటం చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది.

పెళ్లి జీవితం గురించి

బార్‌లో రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (కృష్ణ చైతన్య), ఘంటా రవి (ప్రియదర్శి) ముగ్గురూ కలిసి పెళ్లి గురించి, జీవితం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అన్నడో నాకు దొరికితేనా? అని విక్రమ్ (కృష్ణ చైతన్య) అనడంతో స్వర్గంలో ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ ప్రత్యక్షం అవుతారు.

అక్కడి నుంచి కథ వేరే ట్రాక్ ఎక్కుతుంది. ఘంటా రవి ఎమ్మెల్యేగా ఎదుగుతాడు. రాహుల్ గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ అవుతారు. విక్రమ్ ఓ పెద్ద కంపెనీకి సీఈవో అవుతారు. అసలు తమ జీవితంలో ఏం జరుగుతుందో తమకే అర్థం కాకుండా ఉంటుంది. రెండో ప్రపంచంలో ఈ మార్పులు అన్నీ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది.

మగాళ్ల కు కనెక్ట్ అయ్యేలా

ఫుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఈ మూడో సీజన్‌ను నెక్ట్స్ లెవెల్లో రూపొందించారని సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక ట్రైలర్ చివర్లో వెన్నెల కిషోర్ చెప్పిన గాలికిపోయే కంప డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. విడాకులు తీసుకున్నప్పుడు భర్తను భార్య భరణం అడిగినట్లే భార్యను భర్త భరణం అడిగితే తప్పేంటీ అని కోర్టులో కృష్ణ చైతన్య చెప్పే డైలాగ్ మగాళ్లందరికి కనెక్ట్ అయ్యేలా ఉంది.

సరికొత్త కాన్సెప్ట్‌తో సేవ్ ది టైగర్స్ సీజన్ 3ని తెరకెక్కించినట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్ కాస్త కన్ఫ్యూజింగ్‌గానే ఉన్నా కామెడీ మాత్రం కన్ఫామ్‌గా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఫాంటసీ అంశాలతో రిలేషన్ షిప్ డ్రామాను మిక్స్ చేసి మూడో సీజన్‌ను వినోదభరితంగా తెరకెక్కించారు. అలాగే, ఈసారి కథ రెండు విభిన్న ప్రపంచాలు, మధ్యలో ఇంద్రుడు చుట్టూ జరుగుతుందని అర్థం అవుతోంది.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, జబర్దస్త్ రోహిణి ఇలా అందరూ తమ తమ పాత్రలతో మరోసారి ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్దంగా ఉన్నారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 3కి ప్రదీప్ అద్వైతం, మహి వి. రాఘవ్ క్రియేటర్స్‌గా ఉండగా.. శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహించారు. శివ మేక, సాహితీ చింతలపూడి నిర్మాతలుగా ఉన్నారు.

ఇక ఎప్పటిలాగే జియో హాట్‌స్టార్‌లోనే సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ రిలీజ్ కానుంది. జూన్ 19 నుంచి హాట్‌స్టార్‌లో సేవ్ ది టైగర్స్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

మరోసారి జియో హాట్‌స్టార్ ఓటీటీ వేదికపై నవ్వులు పూయించేందుకు 3వ సీజన్‌తో వచ్చేయనుంది సేవ్ ది టైగర్స్ సిరీస్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More