OTT Comedy: ఓటీటీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ సిరీస్ 3వ సీజన్- వెన్నెల కిషోర్ ఓటీటీ ఎంట్రీ- ట్విస్టులతో సర్‌ప్రైజ్!

Save The Tigers Season 3 OTT Vennela Kishore Poster Released: ఓటీటీలో సూపర్ హిట్ అయిన తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ నుంచి మూడో సీజన్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సేవ్ ది టైగర్స్ 3లో అనూహ్య మలుపులు తిప్పేల వెన్నెల కిషోర్ పాత్ర ఉండనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

Published on: May 23, 2026, 21:15:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Save The Tigers Season 3 OTT Vennela Kishore Poster Released: సీజన్ 1, సీజన్ 2లతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తి భారీ విజయాలు సాధించిన అతి పెద్ద ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ కామెడీ ఓటీటీ సిరీస్ ‘సేవ్ ది టైగ‌ర్స్’ నుంచి ఇప్పుడు సీజన్ 3 రానుంది. మొదటి రెండు సీజన్లలో సరదా, హాస్యం, చురుకైన డైలాగులు, రిలేషన్‌షిప్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఓటీటీ సిరీస్‌ మూడో సీజన్ రానుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఓటీటీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ సిరీస్ 3వ సీజన్- వెన్నెల కిషోర్ ఓటీటీ ఎంట్రీ- ట్విస్టులతో సర్‌ప్రైజ్!
ఓటీటీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ సిరీస్ 3వ సీజన్- వెన్నెల కిషోర్ ఓటీటీ ఎంట్రీ- ట్విస్టులతో సర్‌ప్రైజ్!

ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టులు

2023లో వచ్చిన ‘సేవ్ ది టైగర్స్’ ఫ్రాంచైజీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా రూపొందుతోన్న సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3కి మ‌హి వి.రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం షో ర‌న్న‌ర్స్‌. ఈ సీజ‌న్ మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టులు, కొత్త పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

ఆస‌క్తిక‌ర‌మైన కాస్మిక్ ట్విస్ట్‌తో

తాజాగా ‘సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3’ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే కథలో ఆస‌క్తిక‌ర‌మైన కాస్మిక్ ట్విస్ట్ ఉండనుందనే విష‌యం తెలుస్తోంది. రెండు వైవిధ్య‌మైన ప్ర‌పంచాల మ‌ధ్య జ‌రిగే ప్ర‌త్యేక‌మైన సోష‌ల్ ఎక్స్‌పెరిమెంట్ క‌థ‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చ‌నుంది. ఈ అంశం మొత్తం క‌థ‌ను స‌రికొత్త పంథాలో ప్రేక్ష‌కుల‌ను అందించ‌నుంది.

మూడు జంట‌లు.. అందులోని భ‌ర్త‌లు ప‌డే ఇబ్బందులు.. వారి చుట్టూ తిరిగే కామెడీ డ్రామాకు కాస్మిక్ ట్విస్ట్ అనేది ఎగ్జ‌యిటింగ్ కాన్సెప్ట్‌గా మారింది. ఇది క‌థ‌ను స‌రికొత్త విధానం చూపించ‌టంతో పాటు సమాజంపై అర్థవంతమైన వ్యాఖ్యానానికి కూడా అవకాశం దక్కనుంది. దీంతో ప్రేక్షకులు మ‌రోసారి నవ్వులు, రిలేషన్‌షిప్ సమస్యలు, సరదా, కామెడీ డ్రామా ఇలా అన్నీ అంశాలు క‌లిసున్న ఆల్ ఇన్ వ‌న్ ప్యాకేజ్‌గా సీజ‌న్‌3ని ఎంజాయ్ చేయొచ్చు.

సీజ‌న్‌3లో సరికొత్త స‌ర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్‌

మొదటి రెండు సీజన్లలో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న‌ ప్రియ‌ద‌ర్శి-జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌-దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం-పావ‌ని గంగిరెడ్డి జంట‌లు సీజన్ 3లోనూ అల‌రించ‌నున్నారు. ఇక ఈ సీజ‌న్‌3లో అందరికీ పెద్ద సర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్ త‌న‌దైన కామెడీతో నవ్వించనున్నాడు. ఈ సిరీస్‌తోనే వెన్నెల కిషోర్ ఓటీటీ తెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడు.

పోస్ట‌ర్ చూస్తుంటే ఆయ‌న పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. వెన్నెల కిషోర్ పాత్ర క‌థ‌లో అనూహ్య‌మైన మ‌లుపులు తీసుకురావ‌ట‌మే కాకుండా, అద్భుత‌మైన కామెడీ టైమింగ్‌తో పాటు గుర్తుండిపోయేలా డ్రామ‌టిక్ పెర్ఫామెన్స్‌తో ఓటీటీ సిరీస్‌ను మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా మార్చనున్నారని అభిమానులు భావిస్తున్నారు.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

కాగా అతిపెద్ద ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ జియోస్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. సేవ్ ది టైగర్స్ 3 ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే జియో హాట్‌స్టార్‌లో సేవ్ ది టైగర్స్ సీజన్ 1, 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More