OTT Bold: ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. షాక్ ఇచ్చిన హీరోయిన్.. సీజన్ 6తో ముగుస్తున్న బోల్డ్ రొమాంటిక్ కామెడీ డ్రామా

Emily In Paris 6 OTT Streaming: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఆకట్టుకున్న క్రేజీ రొమాంటిక్ బోల్డ్ ఓటీటీ సిరీస్ ఎమిలీ ఇన్ పారిస్ ముగింపు దశకు చేరుకుంది. త్వరలో రానున్న ఆరో సీజన్‌తో ఎమిలీ ఇన్ పారిస్ ఓటీటీ సిరీస్‌ను ముగుస్తున్నట్లు హీరోయిన్ లిల్లీ కొలిన్స్ వీడియో ద్వారా చెప్పి షాక్ ఇచ్చింది.

Published on: May 23, 2026, 13:46:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bold Romantic OTT Series Emily In Paris End With Season 6: డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్, రొమాంటిక్ డ్రామాతో అలరించిన నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ ఓటీటీ వెబ్ సిరీస్ ‘ఎమిలీ ఇన్ పారిస్’ (Emily in Paris) వీక్షకులకు ఒక చేదు వార్త. ఈ బోల్డ్, రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్‌కు ఆరో సీజన్‌తో ఎండ్ కార్డ్ వేస్తున్నట్లు చెప్పి హీరోయిన్ లిల్లీ కొలిన్స్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది.

ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. షాక్ ఇచ్చిన హీరోయిన్.. సీజన్ 6తో ముగుస్తున్న బోల్డ్ రొమాంటిక్ కామెడీ డ్రామా
ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. షాక్ ఇచ్చిన హీరోయిన్.. సీజన్ 6తో ముగుస్తున్న బోల్డ్ రొమాంటిక్ కామెడీ డ్రామా

ఓటీటీ యాజమాన్యం స్పష్టం

ఇదే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాజమాన్యం స్పష్టం చేసింది. గ్రీస్‌లో ఈ కొత్త సీజన్ షూటింగ్ ప్రారంభమైన తరుణంలోనే ఈ అనూహ్య ప్రకటన వెలువడటం ఈ ఓటీటీ సిరీస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. భారతదేశంలోని మెట్రో నగరాల్లో, ముఖ్యంగా యువతలో ఈ హాలీవుడ్ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. విదేశీ ప్రయాణాలు, గ్లోబల్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడే తెలుగు ఓటీటీ ప్రియులు కూడా ఈ షోను అమితంగా ఆదరిస్తున్నారు.

అయితే, కేవలం ఎమిలీ కథ మాత్రమే కాదు.. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్న ‘ది లింకన్ లాయర్’ (The Lincoln Lawyer), ‘ది నైట్ ఏజెంట్’ (The Night Agent) వంటి మరికొన్ని పాపులర్ ఓటీటీ ఒరిజినల్స్ కూడా తదుపరి సీజన్లతో ముగియనున్నట్లు మేనేజ్‌మెంట్ ప్రకటించింది.

ఆరో సీజన్‌తో ఎమిలీ ప్రయాణానికి ముగింపు

ఈ ఏడాది జనవరిలోనే నెట్‌ఫ్లిక్స్ ఈ ఓటీటీ సిరీస్ ఎమిలీ ఇన్ పారిస్ ఆరో సీజన్‌ను ఖరారు చేసింది. ఐదో సీజన్ ముగింపులో హీరోయిన్ ఎమిలీ కూపర్ (లిల్లీ కొలిన్స్) జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. తన మార్కెటింగ్ ఏజెన్సీ కోసం రోమ్ ఆఫీస్ ప్రారంభించడంలో సహాయం చేసిన ఎమిలీ, చివరకు మళ్లీ పారిస్‌కే తిరిగి రావాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ప్రేమ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను గత సీజన్ చివరి ఎపిసోడ్‌లలో ఆసక్తికరంగా చూపించారు.

"ఎమిలీ హృదయం ఎప్పుడూ పారిస్‌లోనే ఉంది. తను అక్కడే జీవించాలని బలంగా అనుకుంటోంది. ఇది తాత్కాలిక నిర్ణయం కాదు" అని ఎమిలీ ఇన్ పారిస్ ఓటీటీ సిరీస్ సృష్టికర్త డారెన్ స్టార్ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమెరికా నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయి, పారిస్ సంస్కృతికి అలవాటు పడి అక్కడి జీవనశైలితో ఎలా మమేకమైందనేదే ఈ కథాంశం.

భావోద్వేగ వీడ్కోలు పలికిన దర్శకుడు, నటి

ఎమిలీ ఇన్ పారిస్ ఓటీటీ సిరీస్ ముగింపుపై డారెన్ స్టార్ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేయడం తన జీవితంలో మరచిపోలేని ప్రయాణమని కొనియాడారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తమకు అండగా నిలిచిన నెట్‌ఫ్లిక్స్, పారామౌంట్ సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పారిస్ నగరంపై ప్రేమను, ప్రయాణాలపై ఆసక్తిని పెంచిన ఈ ఆఖరి చాప్టర్‌ను త్వరలోనే వీక్షకుల ముందుకు తెస్తామని చెప్పారు. మరోవైపు ఓటీటీ హీరోయిన్ లిల్లీ కొలిన్స్ కూడా అభిమానుల కోసం ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకుంది.

"ఆరో సీజన్ మీ అందరినీ అలరిస్తుంది. ఎమిలీ జీవిత సాహసయాత్రలో ఇదే చివరి ఘట్టం. ఈ వీడ్కోలు సీజన్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా మార్చడానికి మా చిత్ర బృందం రాత్రింబగళ్లు శ్రమిస్తోంది" అని లిల్లీ కొలిన్స్ పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ

వీక్షణల పరంగా ఈ ఓటీటీ సిరీస్ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత వరుసగా ఐదు వారాల పాటు గ్లోబల్ టాప్ 10 ఇంగ్లీష్ సిరీస్ జాబితాలో నిలిచింది. అంతేకాదు, గత రెండేళ్ల కాలంలోనే ఈ ఓటీటీ షో ఏకంగా 25 కోట్ల (250 మిలియన్) వ్యూస్ సొంతం చేసుకుంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

పారామౌంట్ టెలివిజన్ స్టూడియోస్, జాక్స్ మీడియాతో కలిసి డారెన్ స్టార్ ప్రొడక్షన్స్ ఈ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండటంతో, వచ్చే ఏడాది ప్రథమార్థంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 6 ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More