సడెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన ప్రియ‌ద‌ర్శి కామెడీ థ్రిల్ల‌ర్‌.. ల‌వ‌ర్ కిడ్నాప్‌.. పులిబిడ్డ ఎవరు?

ప్రియదర్శి, నిహారిక్ ఎన్ఎమ్ లీడ్ రోల్స్ ప్లే చేసిన లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సడెన్ గా ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ఈ కామెడీ థ్రిల్లర్. 20 రోజులకే ఓటీటీలో అడుగుపెట్టింది ఈ సినిమా. 

Published on: Nov 06, 2025 8:19 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సడెన్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియదర్శి లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ ‘మిత్ర మండలి’. 20 రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది ఈ ఫిల్మ్. ఓ అమ్మాయిని ప్రేమించే నలుగురు యువకులు చూట్టూ తిరిగే కథ ఇది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.

ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్ (x/Priyadarshi Pulikonda)
ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్ (x/Priyadarshi Pulikonda)

మిత్ర మండలి ఓటీటీ

ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మిత్ర మండలి. ఈ సినిమా ఇవాళ (నవంబర్ 6) సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ప్రియదర్శితో పాటు నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మమూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిశోర్, సత్య తదితరులు నటించారు.

20 రోజుల్లోనే

మిత్ర మండలి సినిమా థియేటర్లో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ మూవీ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే థియేటర్లో ఈ సినిమా అనుకున్నంత ఆడలేదు. మరోవైపు తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ లాంటి చిత్రాలతో పోటీని తట్టుకోలేకపోయింది. ఇప్పుడు 20 రోజుల్లోనే అంటే నవంబర్ 6న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీ రైట్స్

మిత్ర మండలి సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు సొంతం చేసుకుంది. ఈ రెండింటి వాల్యూ కలిపి రూ.9.50 కోట్లుగా టాక్. ఈ ప్రకారం మిత్ర మండలి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఓటీటీలో అడుగుపెట్టింది.

మిత్ర మండలి కథ

ఒక అమ్మాయి ప్రేమ కోసం నలుగురు కుర్రాళ్లు తిరిగే కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మిత్ర మండలి. చైతన్య (ప్రియదర్శి), సాత్విక్ (విష్ణు), రాజీవ్ (ప్రసాద్ బెహరా), అభి (రాగ్ మయూర్) ఫ్రెండ్స్. వీళ్లు జంగ్లీపట్నం అనే ఊర్లో ఉంటారు. అదే గ్రామంలో ఉండే స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎమ్)ను ప్రేమిస్తుంటారు. ఆమె తండ్రి నారాయణ (వీటీవీ గణేష్)కు పులిబిడ్డ అని పేరు. ఆ పేరు ఎందుకు వచ్చిందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అతనికి అందరూ భయపడుతుంటారు.

మరోవైపు చైైతన్యను స్వేచ్ఛ ప్రేమిస్తుంటుంది. ఈ క్రమంలోనే స్వేచ్ఛను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఈ కేసును సాల్వ్ చేసేందుకు పోలీస్ ఆఫీసర్ గా వెన్నెల కిశోర్ రంగంలోకి దిగుతాడు. మరి స్వేచ్ఛను కిడ్నాప్ చేసింది ఎవరు? చైతన్య, స్వేచ్ఛ లవ్ స్టోరీ ఏమైంది? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

News/Entertainment/సడెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన ప్రియ‌ద‌ర్శి కామెడీ థ్రిల్ల‌ర్‌.. ల‌వ‌ర్ కిడ్నాప్‌.. పులిబిడ్డ ఎవరు?
News/Entertainment/సడెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన ప్రియ‌ద‌ర్శి కామెడీ థ్రిల్ల‌ర్‌.. ల‌వ‌ర్ కిడ్నాప్‌.. పులిబిడ్డ ఎవరు?