Srija: డైరెక్టర్, నిర్మాతగా మారిన హీరోయిన్ శ్రీజ- కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ రిలీజ్- జబర్దస్త్ నుంచి సీరియల్స్ వరకు!

Actress Srija Directed Kotha Kothaga Song Album Release: నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి స్వీయ దర్శకత్వంలో సాంగ్ ఆల్బమ్‌ను రిలీజ్ చేశారు యంగ్ హీరోయిన్ శ్రీజ. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్‌ను రీసెంట్‌గా విడుదల చేశారు. జబర్దస్త్ వంటి పాపులర్ షోల నుంచి సీరియల్స్‌ వరకు ఆకట్టుకున్న శ్రీజ దర్శకురాలిగా మారింది.

Published on: Apr 6, 2026, 05:59:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సాంగ్ ఆల్బమ్ "కొత్త కొత్తగా". ఈ సాంగ్ లో "దేవగుడి" మూవీ ఫేమ్ అభినవ్ శౌర్య హీరోగా నటించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతాన్ని అందించారు రఘురామ్. సింగర్ లిప్సిక ఈ పాటను పాడారు. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం (ఏప్రిల్ 4) ఘనంగా జరిగింది.

డైరెక్టర్, నిర్మాతగా మారిన హీరోయిన్ శ్రీజ- కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ రిలీజ్- జబర్దస్త్ నుంచి సీరియల్స్ వరకు!
డైరెక్టర్, నిర్మాతగా మారిన హీరోయిన్ శ్రీజ- కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ రిలీజ్- జబర్దస్త్ నుంచి సీరియల్స్ వరకు!

సీరియల్స్‌లో నటించింది

ఈ కార్యక్రమంలో నిర్మాత డీవై చౌదరి మాట్లాడుతూ.. "శ్రీజ చాలా ప్రతిభావంతురాలు. మేము నిర్మించిన సీరియల్స్‌లో నటించింది. ఇంకా ఏదో సాధించాలనే తపన ఆమెలో కనిపించేది. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్‌లో తనే నటించి నిర్మించి, దర్శకత్వం వహించింది. ఈ సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్‌లా రిచ్‌గా రూపొందించింది శ్రీజ. ఆమెతో పాటు అభినవ్ శౌర్యకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా" అని చెప్పారు.

మాలాంటి వారికి అవకాశాలు

నటి పొట్టి విజయ మాట్లాడుతూ.. "శ్రీజ అందమైన హీరోయిన్ మాత్రమే కాదు అందమైన వ్యక్తిత్వం గల అమ్మాయి. ఆమె తనతో నటించే తోటి ఆర్టిస్టులను ఎంతో ఆదరంగా చూసుకుంటుంది. కొత్త కొత్తగా సాంగ్ చాలా బాగుంది. ఆమె ఇప్పుడు నిర్మాత, దర్శకురాలు అయ్యింది కనుక మాలాంటి వారికి అవకాశాలు ఇస్తుందని ఆశిస్తున్నా" అని ఆశించారు.

డైరెక్టర్‌గా మారడం గర్వంగా ఉంది

నటి మేఘన చౌదరి మాట్లాడుతూ.. "శ్రీజ నాకు మంచి ఫ్రెండ్. ఆమె శ్రీజ మ్యూజిక్ అని ఛానెల్ పెట్టి మంచి సాంగ్స్ చేస్తోంది. తను నిర్మాతగా, డైరెక్టర్‌గా మారడం గర్వంగా ఉంది. కొత్త కొత్తగా సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్ చూసిన ఫీల్ కలుగుతోంది. ఆమె ఇలాంటి మరిన్ని సాంగ్స్ చేయాలి" అని కోరారు.

మ్యూజిక్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు

నటి సంధ్య మాట్లాడుతూ.. "కొత్త కొత్తగా సాంగ్ ఎంత బాగుందో, ఈ పాటలో శ్రీజ, అభినవ్ శౌర్య పర్‌ఫార్మెన్స్‌లు కూడా అంతే బాగున్నాయి. వీళ్లిద్దరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ సాంగ్‌ను మ్యూజిక్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు" అని అన్నారు.

చాలా రఫ్ అండ్ టఫ్

నటుడు ఫణి మాట్లాడుతూ.. "శ్రీజ ఈ పాటలో సాఫ్ట్‌గా కనిపిస్తుంది గానీ ఆమె చాలా రఫ్ అండ్ టఫ్‌గా ఉంటుంది. మాతో జబర్దస్త్ షో చేసేప్పుడు శ్రీజ ఎంత ఎనర్జిటిక్‌గా, అగ్రెసివ్‌గా ఉంటుందో అర్థమైంది" అని తెలిపాడు.

టీవీ ప్రోగ్రామ్స్‌తోపాటు

"జెమినీ టీవీలోనూ నాతో ఒక ప్రోగ్రాం చేసింది. మంచి స్థాయికి ఎదగాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటుంది. సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్‌తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తోంది. శ్రీజ చేసిన ఈ సాంగ్ ఆల్బమ్ ఆమెకు పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా" అని యాక్టర్ ఫణి ఆకాంక్షించాడు.

హీరోయిన్ శ్రీజ టీవీ షోలు

ఇదిలా ఉంటే, బుల్లితెరపై సీరియల్స్‌లో నటించిన శ్రీజ పలు టీవీ ప్రోగ్రామ్స్‌తో కూడా ఆకట్టుకుంది. జబర్దస్త్, జూ లకటక, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో పాపులర్ అయిన శ్రీజ ఇప్పుడు డైరెక్టర్, నిర్మాతగా మారి కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ విడుదల చేయడం టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More