OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు- పది స్పెషలే, ఒకేదాంట్లో 5- తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్-ఎక్కడ?

OTT Release Movies Today: ఇవాళ గురువారం (జూన్ 4) ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు పదింటికి 10 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉంటే ఒక్క ఓటీటీలోనే 5 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్ నుంచి డార్క్ కామెడీ వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలేంటో చూద్దాం.

Published on: Jun 4, 2026, 05:39:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Today OTT Movies Released: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, చౌపల్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, డార్క్ కామెడీ, రొమాంటిక్ డ్రామా, స్పై యాక్షన్ వంటి విభిన్నమైన జోనర్లలో సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ 10 సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు- పది స్పెషలే, ఒకేదాంట్లో 5- తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు- పది స్పెషలే, ఒకేదాంట్లో 5- తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మా బెహన్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కామెడీ సినిమా)- జూన్ 4

ది మర్డర్ ఆఫ్ రేచల్ నికెల్ (ఇంగ్లీష్ ట్రు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 4

ది వాచర్స్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 4

నైట్ షిఫ్ట్ ఫర్ క్యూటీస్ (ఇండోనేషియన్ కామెడీ రొమాంటిక్ డ్రామా సిరీస్)- జూన్ 4

ది విట్నెస్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 4

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

పీటర్ (కన్నడ సస్పెన్స్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 4

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ధురంధర్ 2 ది రివేంజ్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 4

చౌపల్ ఓటీటీ

కతల్ కే బాద్ (హర్యాన్వీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 4

ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ

కేప్ ఫియర్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 4

కేబుల్‌వన్ ఓటీటీ

మొమాకు: మోటర్ మచిస్ ఔర్ కట్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 4

ఓటీటీలోకి ఇవాళ 10 సినిమాలు

ఇలా ఇవాళ గురువారం (జూన్ 4) ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా రణ్‌వీర్ సింగ్ రూ. 1700 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ ధురంధర్ 2 ది రివేంజ్, మాధురీ దీక్షిత్-తృప్తి డిమ్రిల క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మా బెహన్, హారర్ థ్రిల్లర్ పీటర్, కేఫ్ ఫియర్ ఇలా పదింటికి పది సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

తెలుగులో 3 ఇంట్రెస్టింగ్

వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 3 సినిమాలు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, ఈ పదింట్లో ఏకంగా 5 సినిమాలు ఒకే ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉండటం విశేషం అని చెప్పుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More