OTT Bold Horror: ఓటీటీలోకి వచ్చిన బోల్డ్ హారర్ థ్రిల్లర్- శృంగార కోరికలతో లోబర్చుకునే కామ పిశాచి-తెలుగులోనూ స్ట్రీమింగ్!
Seducer OTT Streaming In Telugu: ఓటీటీలోకి బోల్డ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ సెడ్యూసర్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. శృంగార కోరికలతో మగాళ్లను రెచ్చగొట్టి లోబర్చుకునే కామ పిశాచి నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. తెలుగులోనూ సెడ్యూసర్ ఓటీటీ రిలీజ్ అయింది. మరి సెడ్యూసర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.
Bold Psychological Horror Thriller Seducer OTT Release Telugu: అర్ధరాత్రి పూట లైట్లు ఆపేసి ఒక మంచి హారర్ సినిమా చూస్తూ థ్రిల్ అవ్వాలనుకునే ఓటీటీ ప్రియులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భయాన్ని పరిచయం చేస్తూ గతంలో థియేటర్లలో అలరించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

మరో టైటిల్‌తో
ఆ సినిమానే 'సెడ్యూసర్'. బోల్డ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన సెడ్యూసర్ సినిమాను కొన్ని ఇంటర్నేషన్ల్ ప్రాంతాల్లో 'సక్యుబస్' (Succubus) అనే టైటిల్‌తో విడుదల చేశారు. సక్యుబస్ అంటే కామ పిశాచి లేదా ఆడ దెయ్యం అనే అర్థాలు వస్తాయి. అలాంటి ఈ సినిమా భారతీయ ఓటీటీ వీక్షకులను భయపెట్టడానికి సుమారు 2 ఏళ్ల తర్వాత వచ్చింది.
ఈ సినిమా కథాంశం అంతా ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. కొంతమంది యువకులు సరదాగా గడపడానికి ఒక నిర్మానుష్య పల్లెటూరిలోకి అడుగుపెడతారు. అయితే వారు అనుకోకుండా ఒక ప్రాణాంతకమైన, రూపాలు మార్చే వింత కామ పిశాచి బారిన పడతారు.
లోబర్చుకునే కామ పిశాచి
మనుషుల మనసుల్లో ఉండే శృంగార కోరికలను ఆసరాగా చేసుకుని ఆ కామ పిశాచి వారిని లోబర్చుకోవడం మొదలుపెడుతుంది. అంతేకాదు, ఆ వ్యక్తుల్లో ఉండే అత్యంత చీకటి కోణాలను, క్రూరమైన ఆలోచనలను అది బయటకు తీస్తుంది. శృంగార కోరికలతో రెచ్చగొట్టి మగాళ్లను తన వశం చేసుకుంటుంది ఆ కామ పిశాచి.
అలా వశం చేసుకున్నాక ఏం జరిగింది, ఆ కామ పిశాచి నుంచి ఎలా ప్రాణాలతో బయటపడ్డారు? అసలు ఆ గ్రామం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే ట్విస్టులతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అడల్ట్ అండ్ జంప్ స్కేర్స్ వంటి హారర్ సీన్లతో థ్రిల్లింగ్‌గా సెడ్యూసర్ సినిమాను తెరకెక్కించారు మేకర్స్.
క్రిస్ప్ రన్‌టైమ్.. వీకెండ్‌కు పర్ఫెక్ట్ చాయిస్
చాలా హారర్ సినిమాలు సాగతీత లేకుండా ఉంటేనే ప్రేక్షకులకు ఆ భయం, థ్రిల్ కలుగుతాయి. ఈ విషయాన్ని దర్శకుడు బాగా గుర్తుంచుకుని సినిమాను ఎక్కడా ల్యాగ్ లేకుండా తెరకెక్కించారు. ఈ సినిమా రన్‌టైమ్ కేవలం 1 గంట 32 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే సరిగ్గా 92 నిమిషాల్లో అనవసరమైన డ్రామా ఏమీ లేకుండా, పాయింట్ టు పాయింట్ ప్రేక్షకులను భయపెట్టడంలో ఈ చిత్రం సక్సెస్ అయింది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
సైకలాజికల్ అండ్ బోల్డ్ హారర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి, ముఖ్యంగా రాత్రిపూట అడల్ట్ కంటెంట్‌తోపాటు గగుర్పాటు కలిగించే సీన్లు చూడాలనుకునే వారికి సెడ్యూసర్ మంచి ఛాయిస్. ఇలాంటి సెడ్యూసర్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో సెడ్యూసర్ ఓటీటీ రిలీజ్ అయింది.
2024లో తెరకెక్కిన సెడ్యూసర్ మే 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, దాదాపుగా రెండేళ్ల తర్వాత ఇండియాలో సెడ్యూసర్ ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా జియో హాట్‌స్టార్‌లో తమిళం, హిందీ, తెలుగు వంటి 3 భాషల్లో సెడ్యూసర్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ సక్యుబస్ ఓటీటీ రిలీజ్ అయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


