గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనా శృంగార భంగిమ- స్వామిజీలా దినేష్- మీనాను ఇంట్లోంచి వెళ్లిపోమన్న ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 23 ఎపిసోడ్‌లో ప్రేమ్, రాధిక శృంగార భంగిమ పెట్టారని బొమ్మను చూపిస్తుంది. తాను ఏం నేర్పించానో చెబుతానని మనోజ్, రోహిణితో భంగిమలు వేయిస్తుంది. కానీ వేయలేకపోతారు. మీనా, బాలు వేస్తారు. స్వామిజీలా దినేష్ గెటప్ వేసి మనోజ్ దగ్గర బాలును ఇరికిస్తాడు. దాంతో మనోజ్ కోపంగా వెళ్తాడు.

Published on: Feb 23, 2026 8:49 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బొమ్మల కొలువుకు ఇంకొన్ని కావాలని సత్యంకు మీనా చెబుతుంది. తర్వాత రెండు బొమ్మలు చూపించి శృంగార భంగిమ అంటే ఇలాగే ఉంటుందా.. మీ దగ్గర డ్యాన్స్ ప్రేమ్ వాళ్లు ఇలాగే ఉన్నారని ప్రభావతితో మీనా అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 23 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 23 ఎపిసోడ్‌

అన్ని తప్పుగానే కనిపిస్తాయి

దానికి షాక్ అయిన ప్రభావతి తర్వాత నీ మొహం, నీకు అన్ని తప్పుగానే కనిపిస్తాయంటుంది. అంత దగ్గరగా ఉన్నారంటే అనుమానించాల్సిందే అని బాలు అంటాడు. వాళ్లను మందలిస్తే అందరి ముందు తిట్టిందని మీనా చెబుతుంది. కళల గురించి తనకేం తెలుసు అని మనోజ్ అంటాడు. వీడికి చోరకళ తప్పా ఇంకేం తెలుసు అని బాలు పంచ్‌లు వేస్తాడు.

నేను చూశాను. రేపు ఏమైనా అయితే ఎవరిని అంటారని మీనా అంటుంది. నువ్వు ఏం నేర్పించావ్ చెప్పమని బాలు అంటాడు. దాంతో మనోజ్, రోహిణితో శృంగార భంగిమలు వేయిస్తుంది ప్రభావతి. కానీ, వారికి రాదు. శ్రుతి, రవి కూడా వేయరు. బాలు, మీనా శృంగార భంగిమను కరెక్ట్‌గా వేస్తారు. మీరు నేర్పించింది ఇది. కానీ, వాళ్లు ఉన్నది ఇలా అని ప్రేమ్ వేసిన పోజు చూపిస్తుంది మీనా.

దాన్ని ఫొటో తీయించుకుంటాడు బాలు. నా స్టూడెంట్స్ మీద బురద జల్లుతుంది. ఇకనుంచి నాకు లంచ్ క్యారేజ్ తీసుకు రాకు అని ప్రభావతి వెళ్లిపోతుంది. నీకే పని తప్పిందని సత్యం అంటాడు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని బాలు అంటాడు. మరోవైపు బిజినెస్ బాగా జరగట్లేదని డల్‌గా ఉంటాడు మనోజ్. రోహిణి ఎంకరేజ్ చేస్తుంది.

లాటరీ వస్తుందని

ఇంతలో ఒకతను లక్షల్లో డీలింగ్ చేస్తున్నట్లు మాట్లాడుతూ వచ్చి మనోజ్ షాప్‌లో 10, 15 ఐటమ్స్ కావాలంటాడు. మనోజ్ చూపిస్తాడు.అన్ని నాకు తగినట్లే ఉన్నాయని, కొటేషన్ ఇవ్వండని అతను అంటాడు. కొటేషన్ ఇచ్చిన మనోజ్ ఐటమ్స్ రేపే తెప్పిస్తానంటాడు. రేపేం వద్దు వారం తర్వాత వచ్చి తీసుకుంటా. నాకు లాటరీ అప్పుడే వస్తుందిగా. పది రూపాయలు పెట్టి కోటి రూపాయల లాటరీ తీసుకున్నా. అది నాకే వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడని అతను అంటాడు.

నాకు లాటరీ తగిలితే ఫస్ట్ మీ షాప్‌కే వస్తాను అని మనోజ్ అంటాడు. దానికి మనోజ్ కోప్పడుతాడు. మనోజ్ మాల వేసుకుంది చూపించి నువ్వు నమ్ముతావ్. నేను నమ్మితే పిచ్చా అని అతను అంటాడు. రోహిణి చెప్పడంతో ఆ కస్టమర్‌ను సెక్యురిటీ ఎత్తుకుని బయటపడేస్తాడు. ఇంతలో ఓ బాబా వచ్చి లెటర్ ఇచ్చి మాయం అవుతాడు. అందులో నా గురించి తెలుసుకోవాలంటే వచ్చి గుడిలో కలువు అని ఉంటుంది.

వాడి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. మనం గుడికి వెళ్దామని మనోజ్ అంటాడు. కచ్చితంగా ఇది దినేష్ గాడి పనే అని రోహిణి అనుకుంటుంది. బాలు, మీనా కారులో వెళ్లి రోడ్డు మీద ఉన్న భార్యాభర్తలను కలుస్తారు. వీళ్లు దేవుడు పంపించిన మనవడు, మనవరాలు అని తాత అంటాడు. వాళ్లకు ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చానని, తిందామని మీనా అంటుంది.

ప్రభావతి ఆర్డర్

బొమ్మల కొలువు గురించి చెబుతారు. దాంతో ఓ బొమ్మ ఇస్తుంది. మరోవైపు డ్యాన్స్ స్కూల్ స్టూడెంట్స్‌కు బొమ్మల కొలువుకు రమ్మని ప్రభావతి చెబుతుంది. తన రాధికను ప్రేమ్ అలాగే చూస్తుంటాడు. దాంతో ప్రేమ్‌ను వెనక్కి పంపి రాధికను ముందుకు రమ్మంటుంది ప్రభావతి. రాధికతో విడిగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తానని ప్రేమ్ అంటే అలా ఇంకోసారి విడిగా చేయకండని ప్రభావతి అంటుంది.

తర్వాత ప్రేమ్, రాధిక గురించి మాట్లాడుకుంటారు ప్రభావతి, కామాక్షి. ఏదైనా జరిగి పోలీసులు వస్తే నా కొంప కొల్లేరు అవుతుంది. మీనా చెప్పిందంటే డౌట్ పడాల్సిందే. వాడి మొహం చూశావా. వాడు ఆ అమ్మాయి కోసమే డ్యాన్స్ నేర్చుకోడానికి వచ్చినట్లున్నాడని భయపెడుతుంది కామాక్షి. దాంతో ప్రభావతి ఆపుతుంది.

గుడికి మనోజ్, రోహిణి వెళ్తారు. బాడీగార్డ్‌తో మనోజ్, రోహిణి వెళ్తారు. అక్కడ స్వామిజీ రూపంలో దినేష్ ఉంటాడు. భక్తులు కూడా ఉంటారు. వాళ్లకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అతన్ని చూసి మన విషయం చెబుదామని అతని దగ్గరికి మనోజ్ వెళ్తాడు. దో నిరంజన్ అంటున్నారేంటని మనోజ్ అడిగితే.. నా తమ్ముడు రాజనాల, వాడు ఏక్ నిరంజన్ అంటాడు, నేను భోజనాల. ఇద్దరిని పోల్చుకోడానికి నేను దో నిరంజన్ అంటానని దినేష్ చెబుతాడు.

పవన్ కల్యాణ్ సినిమా పేర్లు

నేను వెతికేవాడు దొరుకుతాడా అని మనోజ్ అంటాడు. నీ ఎదురుగా ఉన్న దొరకడు. నీ భార్య పేరు కతో ఉంటుంది. కానీ వ్యవహారికంగా రో అనే పేరుతో పిలుస్తారు కదా. నా దగ్గరికి ఒకడు వచ్చి లేఖ వదిలి వెళ్లిపోయాడు అని లెటర్ ఇస్తాడు స్వామిజీగా ఉన్న దినేష్. అందులో నేను క్లూస్ ఇస్తా. దాన్నిబట్టి నన్ను పట్టుకో. నీ తెలివితేటలకు ఇదో పరీక్ష. పవన్ కల్యాణ్ సినిమాలోని ఒక సినిమా పేరే నా పేరు అని లేఖలో ఉంటుంది.

బాడీగార్డ్ పవన్ కల్యాణ్ సినిమా పేర్లు చెబుతాడు. తమ్ముడు, బాలు అని వస్తుంది. ఇదంతా చేస్తుంది నా తమ్ముడు బాలునా అని ఫొటో చూపిస్తాడు. తనను కొట్టింది గుర్తు చేసుకున్న దినేష్ ఇతనే అంటాడు. నా పక్కనే ఉండి ఎంత పని చేశాడో అని మనోజ్ అంటాడు. బాలు ఏదైనా డైరెక్ట్‌గా చేస్తాడు అని రోహిణి అంటుంది. వాడి సంగతి చూస్తానని మనోజ్ వెళ్లిపోతాడు.

బేటా.. 30 లక్షలు సమర్పించుకునేదాకా ఇలాంటి బ్యాడే జరుగుతుంది అని దినేష్ అంటాడు. ఇంటికెళ్లిన మనోజ్ బాలును కొట్టమని బాడీగార్డ్‌కు చెప్పి ఉంచుతాడు. ఇంట్లోకి వెళ్లి ఉత్తరాలు, బాలు గురించి స్వామిజీ చెప్పింది అంతా మనోజ్ చెబుతాడు. బాలు ఇలాంటి పని ఎప్పుడు చేయడు అని సత్యం అంటాడు.

ఇంట్లోంచి వెళ్లిపోండి

వాడు వీన్ని ప్రశాంతంగా బతకనివ్వడు. మీరిద్దరు ఇంట్లోంచి వెళ్లిపోండని ప్రభావతి అంటాడు. దాంతో మీనా ఫైర్ అవుతుంది. నా ఇల్లు అని ప్రభావతి అంటే.. ఇది నా ఇల్లు కూడా. మమ్మల్ని పంపే అధికారం మీకు లేదని మీనా అంటుంది. ఇంతదూరం వచ్చాక వీళ్లిద్దరిని నా ఇంట్లో చచ్చినా ఉండనివ్వను అని ప్రభావతి అంటుంది.

మనోజ్‌కు చెప్పి బాలను రమ్మని చెప్పమని అంటుంది ప్రభావతి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.