గుండె నిండా గుడి గంటలు: నడిరోడ్డు మీద బాలు మీనా గొడవ- ఫైన్ కట్టమన్న పోలీస్- పూలగంప వార్నింగ్- రోహిణి మీదే కొడుకు బారం

గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో తల్లి సుగుణను హాస్పిటల్‌లో చేర్చుతారు. ఇక నుంచి నీ కొడుకు చింటు బాధ్యత, బారం నీదే అని సుగుణ అంటుంది. మరోవైపు నడి రోడ్డు మీదే బాలు, మీనా గొడవ పడతారు. ట్రాఫిక్ పోలీస్ వచ్చి బాలును ఫైన్ కట్టమని అంటాడు. దాంతో బాలు తన భర్త అని మీనా నిజం చెబుతుంది.

Published on: Jan 31, 2026, 05:41:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో ప్రభావతి పెట్టిన చిచ్చుతో మీనా, శ్రుతి ఇద్దరు గొడవ పడినట్లు నానా మాటలు అనుకుంటారు. మీనాను శ్రుతి పొగరుబోతని, బాలు కంటే గయ్యాలి అని తిడుతుంది. ఇకనుంచి కాఫీ, టీ కావాలన్నా, భోజనం కావాలన్నా అత్తయ్యనే ఇస్తుందని మీనా వెళ్లిపోతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

ఉప్పు నిప్పులా మీనా శ్రుతి

శ్రుతి కూడా అత్తయ్యే పెడతారని చెప్పి వెళ్లిపోతుంది. వీళ్ల గొడవ నేను వండటం మీదకు వచ్చిందేంటీ. నేను వండి పెట్టాలా. అయితే ఏంటీలే వీరిద్దరు మాత్రం గొడవ పెట్టుకున్నారు. ఇక నుంచి ఈ తోడి కోడళ్లు ఇద్దరు ఉప్పు నిప్పులానే ఉంటారు. ఎప్పటికీ కలవరు, హమ్మయ్యా అని ప్రభావతి తెగ సంతోషిస్తుంది.

రోహిణి ఎక్కడి వెళ్లింది, ఇంత మంచి న్యూస్ చెబుదామంటే రోహిణి లేదేంటీ అని ప్రభావతి అనుకుంటుంది. మరోవైపు సొంతూరికి కల్యాణిగా రోహిణి వెళ్తుంది. అక్కడ చింటు ఏడుస్తూ కనిపిస్తాడు. రోహిణి తల్లి సుగుణను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. స్పృహలోకి వచ్చిన సుగుణ కూతురు రోహిణితో మాట్లాడుతుంది.

నేను ఎంత కాలం ఉంటానో నాకు తెలియదు. నేను పోతే చింటు పరిస్థితి ఏమవుతుందో అని భయంగా ఉంది. నీ కొడుకు బారం ఇకనుంచి నీమీదే ఉంది. నువ్వే వాడిని చూసుకోవాలి. మీ అత్తింట్లో ఏం చెప్పైనా సరే చింటును తీసుకెళ్లు. లేకుంటే వాడు అనాథల బతకాల్సి వస్తుందని సుగుణ అంటుంది.

నా కొడుకు బారమయ్యాడా

తల్లి మాటలు విన్న రోహిణి ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో చింటును ఎలా తీసుకెళ్లాలి, ఏం చెప్పి మ్యానేజ్ చేయాలి. నా కొడుకు బాధ్యత నాకే బారంగా మారిందేంటీ. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఉంచావేంటీ దేవుడా అని రోహిణి కుమిలిపోతుంది.

మరోవైపు ఓ ప్యాసెంజర్‌ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్తాడు బాలు. ప్యాసెంజర్ అర్జంట్‌గా వెళ్లాలని తొందరపెడతాడు. ఎక్కడికి వెళ్లాలి సర్ అని బాలు అడుగుతాడు. తన పెళ్లికి వెళ్లాలి అని ప్యాసెంజర్ అంటే.. పెళ్లి చూపులకా. ఎందుకు సర్ ఏరి కోరి డేంజర్‌లో పడతానంటారు అని సెటైర్లు వేస్తాడు బాలు.

పెళ్లి గురించి ఇంతలా చెబుతున్నావ్. ఇంతకీ నీకు పెళ్లి అయిందా అని అతను అడుగుతాడు. అయింది సర్ అని బాలు అంటే.. నీ లైఫ్ ఎలా ఉందని ప్యాసెంజర్ అడుగుతాడు. ఆమె లేకపోతే ఉండలేను, ఆమె ఉంటే తట్టుకోలేను. అదొక తీయ్యటి గొడవ అని బాలు చెబుతాడు.

బాలు మీనా గొడవ

ఇంతలో ఎదురుగా స్కూటీ మీద మీనా వస్తుంది. కారుకు కొద్దిగా తాకుతుంది. బాలు కోపంగా అరుస్తూ కారు దిగుతాడు. ఏ కారబ్బాయి.. కళ్లు ఎక్కడ పెట్టుకున్నావ్ అని మీనా అంటుంది. నీ కళ్లు ఎక్కడ పెట్టుకున్నావ్. ఆ పూలగంపలో దాచుకున్నావా అని బాలు రివర్స్ అవుతాడు. ప్యాసెంజర్ ఏమో టైమ్ అవుతుందని ఎదురుచూస్తుంటాడు.

నా పెళ్లికి టైమ్ అవుతుంది అని కంగారుగా అంటాడు ప్యాసెంజర్. ఆగండి సర్. ఏం పెళ్లి చేసుకుంటారు. చేసుకుని మేము ఏం సుఖపడుతున్నాం అని బాలు అంటాడు. ఇతని పెళ్లాం మాత్రం ఏం సుఖపడుతుందో మనకేం తెలుసు అని మీనా అంటుంది. అలా బాలు, మీనా ఒకరినొకరు ఇన్‌డైరెక్ట్‌గా అనుకుంటూ నడిరోడ్డు మీదే కారు, స్కూటీ ఆపి మరి గొడవ పడుతుంటారు.

ఇంతలో ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఏంటీ గొడవ అని నిలదీస్తాడు. జరిగింది అంతా చెబుతారు. రాంగ్ రూట్‌లో వచ్చినందుకు ఐదు వందలు ఫైన్ వేస్తున్నాను. ఫైన్ కట్టాల్సిందే అని పోలీస్ హెచ్చరిస్తాడు. 500 ఆ అని బాలు షాక్ అవుతాడు. ఇక బాలును కాపాడటానికి చివర్లో ఈయన మా ఆయన సర్ అంటూ ట్విస్ట్ ఇస్తూ నిజం చెబుతుంది మీనా.

స్వీట్ టార్చర్ వైఫ్

దానికి ట్రాఫిక్ పోలీస్, ప్యాసెంజర్ ఇద్దరు షాక్ అవుతారు. ఇద్దరి గొడవ సరదా కోసం అని అర్థం చేసుకుని ట్రాఫిక్ పోలీస్ వెళ్లిపోతాడు. నువ్వు చెప్పిన స్వీట్ టార్చర్ వైఫ్ ఈవిడేనా అని మీనా గురించి బాలు చెప్పినవన్నీ మాట్లాడుతాడు ప్యాసెంజర్.

ఆ మాటలన్నీ విన్న కోపంతో ఊగిపోతుందు. మీరు ఇంటికి రండి చెబుతాను మీ సంగతి అని బాలుకు తాను ప్రేమగా పిలుచుకునే పూలగంప మీనా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More