గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుణ, శివ దాదాగిరి- బుద్ధి చెప్పిన బాలు- సాక్షి సంతకం- గుడికి మీనా, బాలు మాట బేఖాతరు
గుండె నిండా గుడి గంటలు జనవరి 14 ఎపిసోడ్‌లో బాబురావు ఇంట్లో గుణ, శివ దాదాగిరి చేస్తారు. అక్కడికి వచ్చిన బాలు ఇద్దరికి బుద్ధి చెప్పి నోట్ రాయిస్తాడు. దానికి సాక్షిగా బాలు ఉంటాడు. శివ పుట్టినరోజు కావడంతో గుడిలో ప్రసాదాలు పంచి పెట్టాలనుకుంటుంది పార్వతి. దానికి మీనాను పిలుస్తారు. బాలును శివ వద్దంటాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాబురావు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి గుణ, శివ డబ్బు కోసం దాదాగిరి చేస్తారు. బాలు కారులోనే బాబురావు వస్తాడు. బాబురావు కారులో బ్యాగ్ మర్చిపోవడంతో బాలు తీసుకు వస్తాడు. మరోవైపు వడ్డీ సరిగ్గానే కడుతున్నా కదా ఇంటికి ఎందుకు వచ్చావని గుణను బాబురావు అడుగుతాడు.

గుణ, శివ దాదాగిరి
సరిగ్గానే కడుతున్నావ్. కానీ, అర్జంట్‌గా 50 వేలు అవసరం పడింది ఇవ్వు అని గుణ అంటాడు. ఉన్నపలంగా ఎలా ఇవ్వను. సంవత్సరం వరకు డబ్బు అడగను అన్నావ్. ఇప్పుడు అడగడం న్యాయంగా ఉందా అని బాబురావు అంటాడు. అప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఉంది. ఏం చేసైనా సరే డబ్బు ఇవ్వు. అప్పటివరకు మీ ఆవిడ చేసిన వంట తింటూ ఉంటా అని గుణ అంటాడు.
ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని బాబురావు అంటాడు. నేనేమైనా మీ ఆవిడను తీసుకెళ్తానా అని అప్పటివరకు అని గుణ అంటుంటే నాలుగు ఇళ్లలో అడుక్కు తింటావా అని బాలు ఎంట్రీ ఇస్తాడు. ఏంట్రా ఇళ్లలకు దూరి బెదిరిస్తున్నావా అని బాలు అంటాడు. నేను నా బిజినెస్ చేస్తున్నా అడ్డు పడకు అని గుణ అంటాడు.
గుణను పక్కనున్న రౌడీని బాలు కొడతాడు. నీ బిజినెస్ చూశాను. ఇలాంటి వాళ్లు ఇంటికి వచ్చి బెదిరిస్తుంటే చూస్తారేంటీ పోలీసులకు ఫోన్ చేయండని అని బాలు అంటాడు.
ఏది చేయు. నేను కేవలం మంచినీళ్లు తాగడానికి వచ్చానని చెబుతానని గుణ అంటాడు. నీ గురించి తెలిసే నువ్వు మాట్లాడింది వీడియో తీశాను అని చూపిస్తాడు బాలు. దాంతో గుణ భయపడిపోతాడు.
సాక్షిగా బాలు
ఇప్పుడు ఏ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోసారి అసలు, వడ్డీ కడితే చాలు అంటాడు గుణ. అసలు కట్టలేను అని బాబురావు అంటాడు. దాంతో పెన్ను, పేపర్ తీసుకురమ్మని శివతో నోట్ రాయిస్తాడు బాలు. తీసుకున్న లక్ష రూపాయను నెలకు పదివేలు చొప్పున కడతానని. అంతకుమించి ఒక్కరూపాయి ఎక్కువ ఇవ్వను. మనుషులతో బెదిరించను అని నోట్ రాయిస్తాడు బాలు.
గుణ, శివతో సంతకం చేయించి తాను సాక్షి సంతకం చేస్తాడు బాలు. దాంతో గుణ, శివ వెళ్లిపోతారు. బాలుకు బాబురావు థ్యాంక్స్ చెబుతాడు. మరోవైపు సుమతి కోసం హాస్పిటల్‌కి వెళ్తుంది శ్రుతి. వచ్చి కంగ్రాట్స్ చెప్పి ట్రీట్ అడుగుతుంది. ఫస్ట్ సాలరీ రాగానే ఇస్తానంటుంది శ్రుతి. సుమతికి వాచ్ గిఫ్ట్‌గా ఇస్తుంది శ్రుతి. దాంతో సుమతి చాలా సంతోషిస్తుంది.
తనకు పిల్లలు కావాలి కానీ పెయిన్ వద్దని శ్రుతి అంటుంది. తల్లి అయ్యే ఫీలింగ్ గురించి గొప్పగా చెబుతుంది శ్రుతి. భయంతో సరోగసీ పద్ధతితో పిల్లలు కంటానని, దానికి కావాల్సిన సమాచారం తెలుసుకో అని శ్రుతి అంటుంది. దానికి చాలా ఖర్చు అవుతుంది, ఆ పద్ధతి గురించి తెలుసుకుంటా. ఎవరికి చెప్పను అని శ్రుతి అంటుంది.
గుడిలో ప్రసాదాలు
మరోవైపు శివ పుట్టినరోజు సందర్భంగా గుడిలో ప్రసాదాలు పంచిపెట్టాలని మొక్కుకున్నట్లు పార్వతి చెబుతుంది. శివ విసుక్కుంటుంది. అక్కకు కాల్ చేసి బావతో పాటు రమ్మను అని పార్వతి అంటుంది. ఇంతలో మీనా వచ్చి శివకు బర్త్ డే విషెస్ చెబుతుంది. బాలును గుడికి పిలవడం ఇష్టం లేదని వెళ్లిపోతాడు శివ.
తర్వాత రెండో కారుకు వచ్చిన డబ్బును రాజేష్ ఇచ్చాడని మీనాకు ఇస్తాడు బాలు. శివ పుట్టినరోజు గురించి చెబుతుంది మీనా. బాలు సెటైర్లు వేస్తాడు. గుడికి తీసుకెళ్లి ప్రసాదాలు పంచిపెడతానంటుంది, మిమ్మల్ని కూడా రమ్మంది అని మీనా అంటుంది. కానీ, మీ తమ్ముడు వద్దన్నాడా బాలు అంటాడు. గుణ గురించి తిరగడం, కొడుకును ఓ దెబ్బ వేయడం తప్పులేదని బాలు అంటాడు.
మీనా తమ్ముడుని వెనకేసుకొస్తే బాలుకు కోపం వస్తుంది. గుణ వెంట వీడే తిరుగుతున్నాడు. అంతా దొంగలముఠా. అసలు వీడు ఏం చేశాడో తెలుసా అని అనబోయి మీనా బాధపడుతుందని ఆగుతాడు బాలు. వాడు మారిపోయాడు అని మీనా అంటుంది. మారడం అంటే బట్టలు మార్చడం కాదు బుద్ధి మార్చడం. గుణతో తిరగడం ఆపితే తప్ప వాడు మారడు. నువ్వేం గుడికి వెళ్లక్కర్లేదు అని బాలు అంటాడు.
బాలు మాట కాదన్న మీనా
మొక్కు తీర్చుకోడానికి వెళ్తే నేను వెళ్లకుంటే ఏం బాగుంటదని మీనా అంటుంది. భర్తకు విలువ లేని చోట భార్య ఉండకూడదు. కాబట్టి నువ్వు వెళ్లకు అని బాలు వెళ్లిపోతాడు. మరోవైపు ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేస్తారు పార్వతి వాళ్లు. మీనా ఇంకా రాలేదని ఎదురుచూస్తుంటారు. మీనా ఇంట్లో బాధపడుతుంటే శ్రుతి వచ్చి మాట్లాడుతుంది.
ఇంట్లో వాళ్లను బాధపెట్టకుండా ఉండాలంటే వెళ్లు అని శ్రుతి అంటుంది. దాంతో తమ్ముడి కోసం బాలు మాట బేఖాతరు చేసిన మీనా గుడికి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న ప్రభావతి బాలు రాగానే చెబుతుంది. గుడికి వెళ్లిన బాలు మీనాను కోపంగా చూస్తాడు. భర్త కంటే పనిపాట లేకుండా తిరిగే తమ్ముడు ఎక్కువయ్యాడని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


