గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతి, మనోజ్‌లను వణికించిన శృతి, మీనా.. రోహిణి వల్ల జాబ్ పోగొట్టుకున్న సుమతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (జనవరి 26) ఎపిసోడ్ లో రోహిణి తన నటనతో మీనా, బాలులను డిఫెన్స్ లో పడేస్తుంది. అటు ప్రభావతి, మనోజ్‌లను బుట్టలో వేసుకుంటుంది. అంతేకాదు సుమతి జాబ్ కోల్పోయే పరిస్థితి ఏర్పడగా.. ప్రభావతి, మనోజ్‌లను శృతి భయపెడుతుంది.

Published on: Jan 26, 2026, 08:22:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 605వ ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. దొరికిపోతుందనుకున్న రోహిణి.. చివరికి మీనాను టార్గెట్ చేస్తుంది. అటు సుమతి జాబ్ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఎపిసోడ్ చివర్లో ప్రభావతి, మనోజ్ లను లక్ష్యంగా చేసుకొని శృతి, మీనా భయపెట్టడం నవ్వులు తెప్పించింది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతి, మనోజ్‌లను వణికించిన శృతి, మీనా.. రోహిణి వల్ల జాబ్ పోగొట్టుకున్న సుమతి
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతి, మనోజ్‌లను వణికించిన శృతి, మీనా.. రోహిణి వల్ల జాబ్ పోగొట్టుకున్న సుమతి

మీనాకు బాలు, సత్యం సపోర్ట్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (జనవరి 26) ఎపిసోడ్ మీనాను ప్రభావతి, రోహిణి లక్ష్యంగా చేసుకొని తిట్టే సీన్ తో మొదలవుతుంది. అయితే ఆమెకు మద్దతుగా బాలు, సత్యం నిలుస్తారు. మీనా చేసిన తప్పేంటి? ఉన్న నిజమే కదా చెప్పింది అని బాలు అంటాడు.

అలా చూస్తే ఈ ఇంట్లో తప్పు చేయంది ఎవరు.. మనోజ్ గాడు నా రూ.40 లక్షలు ముంచాడు.. నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి రోహిణికి పార్లర్ పెట్టించావు.. రవిగాడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు అంటూ సత్యం కూడా ప్రభావతిని నిందిస్తాడు. రోహిణి, ప్రభావతి, మనోజ్ నానా మాటలు అనడంతో మీనా ఏడుస్తుంది.

నిగ్గు తేలుస్తానన్న బాలు.. వణికిపోయిన రోహిణి

ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మీనాను బాలు ఓదారుస్తాడు. ఈ విషయం తనకు ముందుగా చెప్పి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని అంటాడు. రోహిణి ఏదో నాటకం ఆడినట్లు సందేహిస్తాడు. మా అమ్మ, మనోజ్ గాడు అడిగినప్పుడు వణికిపోయిందని, తర్వాత ఏదో నోటికి వచ్చిన కథ చెప్పిందని అంటాడు. అయినా ఈ ఇంట్లో ఏ రహస్యం ఎక్కువ రోజులు ఆగదని, ఆ నిజమేంటో తాను నిగ్గు తేలుస్తానని చెబుతాడు. అది విన్న రోహిణి భయంతో వణికిపోతుంది.

వేరు కాపురం పెడతామన్న రోహిణి

తన మీద వాళ్లకు ఇంకా అనుమానం పోలేదు.. ఏదైనా చేయాలని అనుకొని వెంటనే ప్రభావతి దగ్గరికి వెళ్తుంది రోహిణి. తల్లి ప్రేమ లేక, తండ్రి దూరమై అల్లాడుతున్న తనను తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారంటూ ప్రభావతిని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ ఇంట్లో తాను ఉండలేకపోతున్నానని, అందరూ తమనే టార్గెట్ చేస్తున్నారని మొసలి కన్నీరు కారుస్తుంది.

దీంతో ప్రభావతి పూర్తిగా కరిగిపోతుంది. తాము వేరు కాపురం పెడతామని అనడంతో మీరు ఎందుకు వెళ్తారు.. ఆ పూలమ్ముకునేదాన్నే ఇంట్లో నుంచి పంపేస్తానని ప్రభావతి అంటుంది. నువ్వు, మనోజ్, రవి, శృతిలో ఇంట్లో ఉండాలని స్పష్టం చేస్తుంది. మీనా సంగతి తాను చూసుకుంటానని రోహిణికి నచ్చజెప్పి పంపిస్తుంది.

ఎమోషనల్ అయిన మనోజ్

ఇటు రోహిణి దగ్గరికి వెళ్లిన మనోజ్ ఎమోషనల్ అవుతాడు. వేరు కాపురం పెడదామని అన్నావట.. అమ్మ చెప్పింది.. కానీ అమ్మను వదిలి నేను ఉండలేను అని అంటాడు. అంతేకాదు అబార్షన్ కాకపోయి ఉంటే ఇప్పుడు ఎన్నో నెల అయి ఉండేది.. ఒకవేళ అబార్షన్ కాకపోయి ఉంటే ఇప్పుడు శ్రీమంతం చేసేవాళ్లం.. పుట్టబోయే బిడ్డకు పేరు కోసం ఆలోచించేవాళ్లం.. ఊయల కొనేవాళ్లం అంటూ మనోజ్ బాగా ఎమోషనల్ అవుతాడు. దీంతో రోహిణి అతన్ని హత్తుకొని నీకు చాలా అబద్ధాలు చెబుతున్నాను.. నన్ను క్షమించి మనోజ్ అని మనసులో అనుకుంటుంది.

సుమతికి డాక్టర్ చీవాట్లు

ఇటు సుమతిని కలవడానికి వెళ్తుంది మీనా. ఇంట్లో జరిగిన విషయం చెప్పి బాధపడుతుంది. ఇక రోహిణి జోలికి వెళ్లొద్దని అంటుంది. అప్పుడే సుమతిని డాక్టర్ పిలుస్తుంది. రోహిణి గురించి ఆరా తీసినందుకు చీవాట్లు పెడుతుంది. ఆమె హాస్పిటల్ కు ఫోన్ చేసి అడిగిందని, ఇక ఇక్కడి రానని చెప్పిందని, నీ వల్ల ఓ పేషెంట్ దూరమైందని డాక్టర్ అంటుంది. నిన్ను ఉద్యోగంలో నుంచి తీసుస్తున్ననని అంటుంది. దీంతో సుమతి ఏడుస్తూ డాక్టర్ కాళ్లావేళ్లా పడుతుంది. తన ఉద్యోగం పోతే తన తల్లి తట్టుకోలేదని చెబుతుంది. అయినా డాక్టర్ మనసు మారదు.

ఇటు రాత్రి సమయంలో మీనాకు హారర్ సినిమా చూపిస్తుంటుంది శృతి. అదే సమయంలో ప్రభావతి వచ్చి లైట్ వేయడంతో అమ్మో దెయ్యం అంటూ మీనా ఉలిక్కి పడుతుంది. ప్రభావతి తిడుతుంది. ఆ తర్వాత ప్రభావతిని భయపెట్టాలని శృతి డిసైడవుతుంది. తన మిమిక్రీ టాలెంట్ తో ప్రభావతితోపాటు మీనాను కూడా వణికిస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More