గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: కొత్త నాటకం మొదలుపెట్టిన రోహిణి.. మీనాను కొట్టబోయిన ప్రభావతి.. పట్టు వదలని బాలు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (జనవరి 23) ఎపిసోడ్ లో రోహిణి మరో కొత్త నాటకానికి తెరతీసింది. మీనానే దోషిగా నిలబెట్టడంతో ఆమె చిక్కుల్లో పడింది. ఇంట్లో పెద్ద రచ్చే జరిగినా చివరికి రోహిణి సేఫ్ కాగా.. బాలు మాత్రం పట్టు వదల్లేదు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 604వ ఎపిపోడ్ లో రోహిణి బాగోతం మొత్తం బయటపడుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయింది. ఆమె ఇంట్లో వాళ్లకు అబద్ధం చెప్పి కొత్త నాటకానికి తెరలేపుతుంది. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి మీనా మెడకే ఈ నింద చుట్టుకుంటుంది. దీంతో ప్రభావతి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.

ప్రభావతిని నిలదీసిన సత్యం
గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (జనవరి 23) ఎపిసోడ్ రోహిణి విషయంలో ప్రభావతిని సత్యం నిలదీసే సీన్ తో మొదలవుతుంది. రోహిణికి రెండో ప్రెగ్నెన్సీ విషయం నీకు ముందే తెలుసు కదా అని ప్రభావతిని సత్యం నిలదీస్తాడు. ఆమెను నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటావు కాబట్టి.. ఇదీ నీకు తెలుసని ఆమెను నిందిస్తాడు. కానీ ప్రభావతి మాత్రం సత్యప్రమాణకంగా తనకు ఈ విషయం తెలియదని, ఆ నిజమేంటో రోహిణినే అడిగి తేల్చుకుంటానని అంటుంది.
రోహిణిని కడిగి పారేసిన ప్రభావతి
సత్యం వద్దని వారిస్తున్నా.. రోహిణి దగ్గరికి వెళ్లి కిందికి రా నీ సంగతి తేల్చేస్తానని ఆవేశంగా వెళ్తుంది. దీంతో తన గురించి నిజం తెలిసిపోయిందా అని ఆమె భయపడుతూ కిందికి వెళ్తుంది. అందరి ముందే నీకు ఇది రెండో ప్రెగ్నెన్సీయా.. నువ్వు హాస్పిటల్ కు వెళ్లిన విషయం నిజమేనా? తొలి గర్భం ఎవరితో వచ్చింది? పెళ్లికి ముందా? ఆ తర్వాతా? అసలు ఆ తొలి బిడ్డకు కారణం మనోజేనా లేక మరొకరా? నీ బతుకంతా రహస్యాలే ఉన్నాయి.. నీ తండ్రి, తల్లి ఎక్కడ? నీ విషయం తెలిసి వాళ్లు కూడా నిన్ను వదిలేసుకున్నారా? అని కడిగిపారేస్తుంది. అడ్డు వచ్చిన మనోజ్ ను కూడా కాలర్ పట్టుకొని పక్కకు నెట్టేస్తుంది.
కొత్త నాటకం మొదలుపెట్టిన రోహిణి
అత్త ఉగ్రరూపం చూసిన రోహిణి భయంతో వణికిపోతుంది. ఏడుస్తూనే ఉంటుంది. ఇక ఈరోజుతో తన కాపురం కూలినట్లేనా అని భయపడుతుంది. మనోజ్ కూడా నిలదీయడంతో ఏం చెప్పి తప్పించుకోవాలో అంటూ కొత్త నాటకానికి తెరతీస్తుంది. అవును నాకు ఇది రెండో ప్రెగ్నెన్సీయే అంటూ మొదలుపెట్టి.. అసలు నిజం తెలుసుకుని తట్టుకునే శక్తి మీకుందా? ఈ రంపపు కోతను భరించలేకపోతున్నానంటూ భారీ డైలాగులు కొడుతుంది.
అబార్షన్ అంటూ అబద్ధాలు
తనకు మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చిన మాట నిజమే అని అంగీకరిస్తుంది. అయితే అది మనోజ్ తోనే అని, పెళ్లి తర్వాత కొన్ని నెలలకు అని చెబుతుంది. ఆ విషయం మీ అందరికీ చెప్పి స్వీట్లు తీసుకొద్దామనుకున్న సమయంలో అబార్షన్ అయిందని అంటుంది. తన తండ్రి జైలుకు వెళ్లిన విషయం తెలిసి తాను ఆ సమయంలో కుంగిపోయానని, ఈ విషయం మీకు చెబితే తిడతారని తనలో తానే మదనపడ్డానని, ఆ బాధ, దు:ఖంలో గర్భం పోయిందని చెబుతుంది.
అబార్షన్ తర్వాతే తనకు తాను గర్భం దాల్చిన విషయం తెలిసిందని అంటుంది. మరి ఇంత పెద్ద విషయం ఎందుకు చెప్పలేదని నిలదీస్తే.. అది చెప్పి మీ అందరినీ బాధపెట్టడం ఇష్టం లేకే ఇలా చేసినట్లు మరో అబద్ధం ఆడుతుంది. దీంతో ప్రభావతి నెమ్మదిస్తుంది. మీ మామయ్య చెబితే తాను ఆవేశంతో ఊగిపోయినట్లు చెబుతుంది.
మీనాను కొట్టబోయిన ప్రభావతి
అసలు సత్యంకి ఈ విషయం ఎలా తెలిసిందని అడిగితే తనకు బాలు చెప్పాడని అతడు అంటాడు. బాలు తనకు రవి చెప్పాడని, రవి తనకు శృతి చెప్పిందని చెబుతారు. నీకు ఎలా నిజం తెలిసిందని అడిగితే శృతి ఆ విషయం చెప్పదు. కానీ మీనానే జోక్యం చేసుకొని తానే చెప్పినట్లు వెల్లడిస్తుంది. దీంతో ప్రభావతి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.
రోహిణిని బాగా చూసుకుంటున్నానని నీకు కుళ్లు.. అందుకే ఇలా లేనిపోనివి చెబుతున్నావంటూ మీనాపై వెళ్లి కొట్టబోతే బాలు అడ్డుకుంటాడు. ఇదే ఛాన్స్ అనుకొని రోహిణి కూడా మీనాను నానా మాటలు అంటుంది. నువ్వు అసలు మనిషివేనా.. నాలాంటి చదువుకున్నవాళ్లను చూస్తే ఇలాంటి వాళ్లు ఇలాగే చేస్తారు అంటూ రెచ్చిపోతుంది.
పట్టు వదలని బాలు
దీంతో తన రాత ఇలా అయిందేంటి.. తెలిసిన నిజం చెప్పినా తప్పేనా అని బాలుతో చెప్పి బాధపడుతుంది మీనా. ఆమెను ఓదార్చిన బాలు.. రోహిణి ఏదో కొత్త నాటకం ఆడిందని తెలుసుకుంటాడు. ఈ ఇంట్లో ఏ రహస్యం ఎక్కువ రోజులు ఆగదని, అదేంతో తాను నిగ్గు తేలుస్తానని అంటాడు. అదంతా చాటుగా వింటున్న రోహిణి మళ్లీ భయంతో వణికిపోతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


