గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా తలకు గాయం- శివకు తల్లి శాపం- గుణతో శివ తెగదెంపులు- కోడలిపై జాలి పడిన ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 16 ఎపిసోడ్‌లో మీనాను గుణ తోసేయడంతో తలకు గాయం అవుతుంది. గుణ రెండు చేతులు విరిచిన బాలు మీనా హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. అది తెలిసి శివకు తల్లి పార్వతి శాపనార్థాలు పెడుతుంది. శివ వెళ్లి గుణతో తెగదెంపులు చేసుకుంటాడు. మీనాపై ప్రభావతి జాలి చూపిస్తుంది. తానే వంట చేస్తుంది.

Feb 16, 2026, 08:49:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో శివ ఇంటికి తాగొచ్చిన విషయం మీనాకు చెబుతుంది పార్వతి. గుణ గాడు పార్టీ ఇచ్చాడని, అడిగితే మా మీద అరుస్తున్నాడని పార్వతి చెబుతుంది. నువ్వయిన కాస్తా వాడికి చెప్పవే అని పార్వతి అంటుంది. చెప్పాల్సింది వాడికి కాదు గుణ గాడికి అని గుణతో మాట్లాడేందుకు వెళ్తానని వెళ్తుంది మీనా.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 16 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 16 ఎపిసోడ్‌

30 లక్షల డిమాండ్

మరోవైపు దినేష్‌ను దివ్యతో పాటు కలుస్తుంది రోహిణి. చింటు దగ్గరికి వెళ్లడంపై, తన కొడుకు జోలికి వస్తే ఊరుకోను అని రోహిణి ఫైర్ అవుతుంది. నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉందని దినేష్ అంటే.. ఎంత కావాలో చెప్పమని విద్య అడుగుతుంది. ఇక ఫైనల్‌గా సెటిల్‌మెంట్ చేసుకుంటాను. 30 లక్షలు ఇవ్వు అని డిమాండ్ చేస్తాడు దినేష్. అంత డబ్బు ఇవ్వలేను. కావాలంటే జాబ్ ఇప్పిస్తానని రోహిణి అంటుంది.

నెల జీతం వచ్చేదాక వెయిట్ చేయలేనని దినేష్ అంటాడు. ఇదంతా ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని విద్య అంటే.. వెళ్లి మీ మోసం గురించి చెప్పి నా గురించి చెప్పండని దినేష్ రివర్స్‌లో వస్తాడు. రోహిణి గురించి ఇంట్లో చెబుతానని బ్లాక్ మెయిల్ చేసి వెళ్లిపోతాడు దినేష్. 30 లక్షలు అడుగుతున్నాడు ఏంటే అని విద్య అంటే.. గుణను కలవాలని రోహిణి అంటుంది.

మరోవైపు గుణతో మీనా గొడవ పడుతుంది. శివ నీ వల్ల చెడిపోతున్నాడని, వాడు తాగొచ్చాడని, దున్నపోత అని గుణను తిడుతుంది మీనా. వాడు నా దగ్గర తాగలేదని గుణ అంటాడు. వాడు నీ వల్ల పచ్చి తాగుబోతు అయ్యాడని మీనా అంటుంది. వాడు చిన్న పిల్లాడ. వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి. చేతనైతే వాడు నా దగ్గరికి రాకుండా ఆపుకో పో అని గుణ అంటాడు.

గుణ చేతులు విరిచిన బాలు

ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్. వాడికి డబ్బు ఆశ చూపిస్తే రోడ్డు మీదకు లాగి చెప్పు తెగేదాక కొడతా ఖబడ్దార్ అని మీనా అంటుంది. ఏయ్ నోరు మూసుకుని పోవే అని గుణ అంటాడు. దాంతో గుణను లాగిపెట్టి కొడుతుంది మీనా. నన్నే కొడతావా అని మీనాను తోసేస్తాడు గుణ. దాంతో మీనా తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుంది. అప్పుడే వచ్చిన బాలు చూసి షాక్ అవుతాడు.

గుణను ఎడాపెడా చితక్కొడతాడు. అడ్డొచ్చిన మరో రౌడీని కొడతాడు. గుణ చేయి వెనక్కి మెలిపెడతాడు బాలు. రెండు చేతులు మెలిపెడతాడు. కుర్చీ ఎత్తు తల పగలగొడదామని చూస్తాడు బాలు. కానీ, మీనా ఆపుతుంది. శివ గాడు నీతో కనిపిస్తే చావును చూస్తావని వార్నింగ్ ఇస్తాడు బాలు. హాస్పిటల్‌లో డాక్టర్ మీనా తలకు కట్టు కడుతుంది.

మీనాను డాక్టర్ ప్రశ్నలు అడిగితే బాలు సమాధానాలు చెబుతాడు. స్కూటీ నడుపుతూ కింద పడిందని బాలు అబద్ధం చెబుతాడు. మీనాకు స్కానింగ్ చేయాలని డాక్టర్ చెబుతుంది. స్కానింగ్‌కు మీనాను తీసుకెళ్తారు. గుణకు పార్వతి కాల్ చేసి మీనా గురించి అడుగుతుంది. మీరు టైమ్‌కు కాల్ చేశారు కాబట్టి మీనాను కాపాడనని, హాస్పిటల్‌లో ఉన్నాం. గుణ గొడవ కారణంగా మీనా తలకు దెబ్బ తగిలిందని బాలు చెబుతాడు.

శివకు శాపనార్థాలు

దాంతో కంగారుపడిన పార్వతి హాస్పిటల్‌కు వస్తామని అంటుంది. భర్త ఫొటో ముందు అన్ని తలుచుకుంటూ ఏడుస్తుంటుంది పార్వతి. ఇంతలో శివ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావ్. అసలు ఈ ఏడుపు ఇంట్లోకి రావాలంటేనే అని శివ అనడంతోనే కొడుకును ఎడాపెడా కొడుతుంది పార్వతి. ఏమైందని శివ అడుగుతాడు.

నువ్వు చేసిన పనికి చంపిన పర్వాలేదురా. నువ్వు పురుగుల పడి చస్తావురా. నీకు నా ఉసురే తగులుతుందని శాపనార్థాలు పెడుతుంది పార్వతి. తల్లివి అయుండి కొడుకుకు శాపనార్థాలు పెడుతున్నావ్ అని శివ అంటుంది. గుణ గాడి గురించి చెప్పి.. మీ అక్కను దారుణంగా తోసేసాడురా. దాని తలకు దెబ్బ తగిలి ఎంత రక్తం పోయిందో తెలుసా. ఇప్పుడు అది హాస్పిటల్‌లో ఉంది అని పార్వతి ఏడుస్తూ చెబుతుంది.

అల్లుడు గారు నీ చేయి విరిచినప్పుడు బాధపడ్డాను. కానీ, ఆయన చేసింది కరెక్టే అనిపిస్తుందని పార్వతి అంటుంది. ఇప్పుడే వస్తాను అని శివ గుణ దగ్గరికి వెళ్తాడు. ఏమైందని అడుగుతాడు శివ. నీ బావే కొట్టాడు అని రౌడీ చెబుతాడు. నీ బావ అనే ఏం చేయకుండా వదిలేసాం అని అతను అంటాడు. లేకపోతే ఏం చేసేవార్రా. మా బావ చంపనందుకు సంతోషించండి అని శివ అంటుంది.

గుణతో తెగదెంపులు

ఇన్నేళ్లు నీకే సపోర్ట్ చేశాను. అసలు మా అక్కను నువ్వు ఎందుకు తోసావ్ అని శివ అడుగుతాడు. మీ అక్క తిట్టింది కదా మరి దానికేంటీ అని గుణ అంటాడు. అది నాకు చెప్పాలిగా. దానికి తోస్తావా. మర్యాదగా వెళ్లి క్షమాపణ చెప్పు అని శివ అంటాడు. నా తప్పు లేనప్పుడు నేనెందుకు క్షమాపణ చెప్పాలి అని గుణ అంటాడు. అయితే నేను ఇక్కడికి రాను. నువ్వు సారీ చెప్పేదాకా రాను అని శివ వెళ్లిపోతాడు.

మరోవైపు బాలుకు కంగ్రాట్స్ చెబుతుంది డాక్టర్. దాంతో ఇది తల్లి కాబోతుందా అని బాలు అనుకుంటాడు. స్కానింగ్‌లో ఏం రాలేదు. సమస్య లేదని డాక్టర్ చెబుతుంది. కాసేపు అబ్జర్వేషన్‌లో ఉంచాలని డాక్టర్ అంటుంది. దాంతో బెడ్ మీద మీనా కూర్చుంటుంది. తనకోసం గుణను బాలు కొట్టింది తలుచుకుని మురిసిపోతుంది మీనా.

పార్వతి వచ్చి మీనాను చూస్తుంది. గుణను బాలు కొట్టింది చెబుతుంది మీనా. గుణ రెండు చేతులు విరిచారని చెబుతుంది మీనా. శివను తిడుతూ కొడుతుంది పార్వతి. అంతా శివను నిందిస్తారు. శివ మాట్లాడబోతుంటే నేను తాగుబోతు, తిరుగుబోతులతో మాట్లాడనని చెప్పవే సుమతి. నా భర్తతో పోలిక వీడికి అని ఛీ కొడుతుంది మీనా.

జాలి చూపించిన ప్రభావతి

నా తమ్ముడు బుద్ధిగా స్కూల్‌కు వెళ్లేవాడు. ఈ రౌడీ నా తమ్ముడు కాదని మీనా అంటుంది. నేను మారిపోయాను అక్క. నా తప్పు తెలుసుకున్నాను. ఆ గుణతో కలిసి పని చేయను. నీ మీద చేయి చేసుకున్నాక వాడి ఫ్రెండ్ అయితే ఏంటీ ఎవడైతే ఏంటీ. నీకంటే నాకు ఏది ముఖ్యం కాదని శివ అంటాడు. బాగా చదివి సుమతిలాగా జాబ్ తెచ్చుకో అని మీనా అంటుంది.

గుణతో తెగదెంపులు చేసుకుని వచ్చానని శివ అంటాడు. చూస్తా ఈ మాట ఎన్నిరోజులు అని మీనా అంటుంది. తర్వాత మీనాను ఇంటికి తీసుకెళ్తాడు బాలు. స్కూటీ నడుపుతూ కింద పడిందని బాలు తండ్రికి అబద్దం చెబుతాడు. ఇంతలో ప్రభావతి వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. డబ్బు గురించి ప్రభావతి చెబుతుంటే బూతుల్లా వినిపిస్తున్నాయని సత్యం అంటాడు.

దెబ్బ బాగా గట్టిగా తగిలిందా. నాలుగు రోజులు అయినా విశ్రాంతి తీసుకో అని మీనాపై ప్రభావతి జాలి చూపిస్తుంది. కాసేపు పడుకో నేనే వంట చేస్తాను అని ప్రభావతి కిచెన్‌లోకి వెళ్లిపోతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More