గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు మీనా మధ్య లక్ష పెట్టిన చిచ్చు- మనోజ్‌కు హీరో బాడీగార్డ్- ప్రభావతికి బాలు ఝలక్!

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 9 ఎపిసోడ్‌లో రాజేష్‌కు లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇస్తాడు. అవే డబ్బులు మీనాను అడిగితే ఇవ్వనంటుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవ రాజుకుంటుంది. మనోజ్ బాడీగార్డ్ సెలక్ష్షన్స్ చేస్తాడు. చూస్తేనే భయపడేలా ఉండే వ్యక్తిని బాడీగార్డ్‌గా అపాయింట్ చేసుకుంటారు మనోజ్, రోహిణి.

Published on: Feb 9, 2026, 09:04:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో రాజేష్ మందు తాగడంతో నీళ్లు కొట్టి లేపి అడుగుతాడు బాలు. అయినా లేవడు రాజేష్. లేపి ఒక్కటి కొట్టి అడుగుతాడు బాలు. మా పెద్దనాన్న వాళ్ల షష్టిపూర్తిని చాలా గ్రాండ్‌గా చేశారు. ఇప్పుడు మా నాన్నది 60వ షష్టిపూర్తి వస్తుంది. నేను కూడా అలాగే చేయకుంటే అంతా గగ్గోలు పెడతారని రాజేష్ చెబుతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 9 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 9 ఎపిసోడ్‌

అప్పు ఎక్కడా పుట్టలేదు

నువ్వు కూడా అలాగే చేయమంటాడు బాలు. ఘనంగా చేయాలంటే ఘనంగా డబ్బులు ఉండాలి, ఎక్కడా అప్పు పుట్టలేదు. నగలు కూడా తాకట్టులోనే ఉన్నాయి. మా నాన్న ఎంతో కష్టపడి పెంచాడురా. ఏం చేయలేకపోతున్నా. ఒక లక్ష ఖర్చు అవుతుందని రాజేష్ అంటాడు. కన్నతండ్రి సంతోషం కోసమేగా. నువ్వు ఏర్పాట్లు చేసుకో. టైమ్‌కు డబ్బు తీసుకొచ్చి నేనిస్తాను అని బాలు హామీ ఇస్తాడు.

మరోవైపు షో రూమ్‌కి బాడీ గార్డ్ కోసం ఇంటర్వ్యూ చేస్తారు మనోజ్, రోహిణి. ఇంతలో చాలా హైట్‌తో చూస్తేనే భయపడేలా ఓ మనిషి వస్తాడు. అతన్ని చూసి మనోజ్ భయపడిపోతాడు. అనుభవం గురించి అడిగితే.. హీరో దగ్గర చేశానని, అతను రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడని, నా వల్ల చాలా అదృష్టం కలిసి వస్తుందని అతను అంటాడు.

దాంతో మనోజ్ వీడు మనకు బాగా సెట్ అయ్యేలా ఉన్నాడని పది వేల జీతం అని చెబుతాడు. డబ్బు సమస్య కాదు. కానీ, నాకు టైమ్‌కు ఫుడ్ పడాలి టిఫిన్‌కు 20 పూరీలు, 60 ఇడ్లీలు, అరకేజీ నెయ్యి, మధ్యాహ్నం 10 కోడి గుడ్లు, గ్రిల్ చికెన్, రాత్రికి 12 చపాతీలు, పాతిక పరోటాలు, తిన్నది అరగడానికి అరడజన్ అరటిపండ్లు అని బాడీగార్డ్ చెబుతాడు.

70 కేజీల బరువు

నిన్నెలా నమ్మాలని మనోజ్ అంటే.. ఎత్తుకుని తిరుగుతాడు బాడీగార్డ్. 70 కేజీల బరువు ఉన్నారని చెబుతాడు. ఎవరైనా వచ్చి తేడాగా చేస్తే ఇలాగే ఎత్తి పడేస్తా అని బాడీగార్డ్ అంటాడు. ఇతను పక్కనుంటే నిన్ను ఎవరు ఏం చేయలేరని రోహిణి అంటుంది. సరేనని మనోజ్ అంటాడు. మరోవైపు మీనా దగ్గరికి వెళ్లి రాజేష్ విషయం చెప్పాలని చూస్తాడు.

కానీ, అదంతా వినకుండా బాలుతో చీర మడతపెట్టిస్తుంది మీనా. తర్వాత రాజేష్ బాగా తాగేసి ఉన్నాడని, రాజేష్ చెప్పిందంతా చెబుతాడు బాలు. నేను డబ్బిస్తా అన్నాను. ఇంటి కోసం దాచుకున్న డబ్బు ఇద్దామని బాలు అంటాడు. రాజేష్ అన్న స్థాయికి మించి చేయాలనుకుంటే ఇబ్బందులు వస్తాయి. ఉన్న డబ్బు అనవసరంగా అప్పులిస్తే మన మాట నిలబెట్టుకోలేమని మీనా అంటుంది.

అదంతా ప్రభావతి చేస్తుంది. మీనా, బాలు గొడవ పడుతుంటారు. అది చూసి ప్రభావతి సంతోషిస్తుంది. ప్రైజ్ మనీలో 50 వేలు తీసుకెళ్తాను అంటాడు బాలు. హాస్పిటల్‌లో ఉంటే హెల్ప్ చేయండి, కానీ తాహతుకు మించి చేయకండి. గుడిలో సింపుల్‌గా చేయండి, అంతేకానీ తాగించి, బిర్యాని పెడితేనే చేసినట్లు కాదు. కుదరదని చెప్పండి అని మీనా గట్టిగానే చెబుతుంది.

ప్రభావతికి ఝలక్

మనం రూమ్ కోసం పెట్టుకున్న డబ్బులు తాగడానికో, తినడానికో ఇవ్వను అని మీనా వెళ్లిపోతుంది. తర్వాత బాలుతో ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. మొన్న తమ్ముడి దగ్గరకి వెళ్లింది, ఇప్పుడు నీ డబ్బులు నీకే ఇవ్వట్లేదు, నువ్వు పెట్టిన పూలకొట్టుతో సంపాదించి ఆ డబ్బే ఇవ్వట్లేదు అని కొడుకుకు కోడలిపై ఎక్కిస్తుంది ప్రభావతి.

అవునమ్మా. మీనా నన్ను పూచిక పుల్లలా చూస్తుంది అని తల్లి కొంగు పట్టుకుని బాధపడుతున్నట్లు అంటాడు బాలు. కానీ, ఆ వెంటనే మాకు ఏ గొడవ వచ్చిన సర్దుకుపోతాం. అంతేకానీ నువ్వు రెచ్చగొట్టి చిచ్చుపెట్టి మమ్మల్ని విడదీయాలని చూడటం వేస్ట్ అమ్మా. నీ పని నువ్వు చూసుకో అని ప్రభావతికే ఝలక్ ఇస్తాడు బాలు.

మరోవైపు బాలుతో జరిగిన గొడవ గురించి, రాజేష్ తండ్రి షష్టిపూర్తి గురించి చెబుతుంది మీనా. కోపంగా వెళ్లిపోయారని మీనా అంటే.. మూరెడు మల్లెపూలు పెట్టుకో. ఎలా మాట్లాడడో చూడు అని పక్కింటావిడ అంటుంది. నువ్వు చేసింది కరెక్టే అని మీనాను అంటారు వాళ్లు.

డబ్బు పెట్టిన చిచ్చు

ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లిన బాలు డబ్బు మీనా ఇవ్వనంటుందని, ఇల్లు కోసం దాచినట్లు చెబుతాడు బాలు. నిజమే అని ఫ్రెండ్స్ అంటారు. తర్వాత రవిని లక్ష అప్పు అడుగుతాడు బాలు. అనవసరమైన ఖర్చులకు డబ్బు ఇచ్చేకన్నా ఊరుకోవడం నయమని రవి అంటాడు.

మీనాతో గొడవ గురించి మనోజ్, రవితో చెబుతాడు బాలు. అదే గొడవ, డబ్బు గురించి తోడికోడళ్లు రోహిణి, శ్రుతితో చెబుతుంది మీనా. రాజేష్‌కు ఇవ్వాలనుకున్న లక్ష డబ్బు పెట్టిన చిచ్చుతో బాలు, మీనా మధ్య గొడవ రగులుతుంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More